Galaxy S26 Series Phones | గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్.. ధర ఎంతంటే..?
Galaxy S26 Series Phones | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 ప్లస్, గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఫోన్లను ఈ సందర్భంగా విడుదల చేసింది. అంతకు ముందు వచ్చిన గెలాక్సీ ఎస్25 మోడల్స్‌తో పోలిస్తే ఈ ఫోన్లలో పలు అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు.
Technology | Published On Feb 26, 2026, 10.29 am IST
Galaxy S26 Series Phones | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 ప్లస్, గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఫోన్లను ఈ సందర్భంగా విడుదల చేసింది. అంతకు ముందు వచ్చిన గెలాక్సీ ఎస్25 మోడల్స్‌తో పోలిస్తే ఈ ఫోన్లలో పలు అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఫోన్ కేవలం 7.9ఎంఎం మందం మాత్రమే కలిగి అత్యంత స్లిమ్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలైన అత్యంత స్లిమ్మెస్ట్ గెలాక్సీ అల్ట్రా మోడల్ ఇదే కావడం విశేషం. ఇందులో ప్రైవసీ డిస్‌ప్లే అనే ఫీచర్‌ను ఇచ్చారు. అందువల్ల ఎదురుగా చూస్తున్న వారికే డిస్‌ప్లే కనిపిస్తుంది. పక్క నుంచి చూసే వారికి ఇతర ఏ కోణంలోనూ ఫోన్ డిస్‌ప్లే కనిపించదు. దీంతో యూజర్‌కు పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఇక అల్ట్రా మోడల్‌లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఇచ్చారు. సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 3.0కు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ 75 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.
ఎస్26 అల్ట్రాలో..
గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఫోన్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కెమెరా పరంగా పలు అప్‌గ్రేడ్‌లను ఇచ్చారు. తక్కువ కాంతిలోనూ ఫొటోలు లేదా వీడియోలు చిత్రీకరించుకునే విధంగా లో-లైట్ ఫొటోగ్రఫీ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే వీడియోల కోసం నైటోగ్రఫీ వీడియో అనే ఫీచర్ కూడా ఉంది. డివైస్ కదులుతున్నా వీడియోలను ఎలాంటి కుదుపులు లేకుండా తీసుకునేందుకు ఇందులో వీడియో స్టెబిలైజేషన్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకు ఏఐ ఫీచర్లను ఇచ్చారు. అందువల్ల ఫొటోలను అద్బుతంగా చిత్రీకరించుకోవచ్చు.
ఏజెంటిక్ ఏఐతో..
గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లలో ఏజెంటిక్ ఏఐ ఫీచర్‌ను ఇచ్చారు. ఇందులో భాగంగా నౌ నడ్జ్ అండ్ నౌ బ్రీఫ్, కన్‌వర్జేషనల్ బిక్స్‌బీ, సర్కిల్ టు సెర్చ్ వంటి సదుపాయాలను పొందవచ్చు. గూగుల్ జెమిని, పర్‌ప్లెక్సిటీ వంటి థర్డ్‌పార్టీ ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు కూడా ఈ డివైస్‌లను అనుసంధానించారు. కనుక ఆయా ఏఐ సేవలను కూడా వినియోగదారులు పొందవచ్చు. అందులో భాగంగా పలు ఏఐ ఫొటో ఎడిటింగ్ టూల్స్ సైతం లభిస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 ప్లస్ స్పెసిఫికేషన్లు..
- 6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (ఎస్26)
- 6.7 ఇంచుల క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (ఎస్26ప్లస్)
- 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్
- శాంసంగ్ ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్/స‌్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్
- 12జీబీ ర్యామ్, 256/512జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16, డ్యుయల్ సిమ్
- 50, 12, 10 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 7
- బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
- 4300ఎంఏహెచ్ బ్యాటరీ (ఎస్26), 4900ఎంఏహెచ్ బ్యాటరీ (ఎస్26ప్లస్)
- 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (ఎస్26), 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (ఎస్26 ప్లస్)
- 20వాట్ల వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా స్పెసిఫికేషన్లు..
- 6.9 ఇంచుల క్వాడ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ-ఎడ్జ్ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే
- 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్
- 12/16జీబీ ర్యామ్, 256/512/1టీబీ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 16, డ్యుయల్ సిమ్
- 200, 50, 10, 50 మెగాక్సిల్ రియర్ కెమెరాలు
- 12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ
- వైఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 60వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 25వాట్ల వైర్‌లెస్ చార్జింగ్
గెలాక్సీ ఎస్26, ఎస్26 ప్లస్ ఇండియన్ వెర్షన్ ఫోన్లలో శాంసంగ్‌కు చెందిన ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ లభిస్తుంది. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఫోన్‌లో మాత్రం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ లభిస్తుంది.
ధర వివరాలు..
- గెలాక్సీ ఎస్26 (12జీబీ+256జీబీ): ధర రూ.87,999
- గెలాక్సీ ఎస్26 (12జీబీ+512జీబీ): ధర రూ.1,07,999
- గెలాక్సీ ఎస్26 ప్లస్ (12జీబీ+256జీబీ): ధర రూ.1,19,999
- గెలాక్సీ ఎస్26 ప్లస్ (12జీబీ+512జీబీ): ధర రూ.1,39,999
- గెలాక్సీ ఎస్26 అల్ట్రా (12జీబీ+256జీబీ): ధర రూ.1,39,999
- గెలాక్సీ ఎస్26 అల్ట్రా (12జీబీ+512జీబీ): ధర రూ.1,59,999
- గెలాక్సీ ఎస్26 అల్ట్రా (16జీబీ+1టీబీ): ధర రూ.1,89,999
ప్రీ ఆర్డర్లు షురూ..
గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లను ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, రిటెయిల్ స్టోర్స్‌లో ప్రీ ఆర్డర్ చేయవచ్చు. అలాగే శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లోనూ ఈ ఫోన్లను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికి రూ.20వేల మేర ప్రయోజనాలు లభించనున్నాయి. ఎస్26, ఎస్26 అల్ట్రా ఫోన్లను బ్లాక్, వైట్, స్కై బ్లూ, కోబాల్ట్ వయోలెట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా, ఎస్26 ప్లస్ ఫోన్ కోబాల్ట్ వయొలెట్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఆన్‌లైన్‌లో ఎక్స్‌క్లూజివ్ గా పింక్ గోల్డ్, సిల్వర్ షాడో కలర్ వేరియెంట్లను అన్ని ఫోన్లకు అందిస్తున్నారు. ఇక అన్ని ఫోన్లను మార్చి 11 నుంచి స్టోర్‌లలో విక్రయించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




