త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Privilege Notice Against CM Revanth | సీఎం రేవంత్‌పై సభా హక్కుల నోటీస్.. స్పీకర్‌కు అంద‌జేసిన బీఆర్ఎస్ శాస‌న‌ స‌భాప‌క్షం

Privilege Notice Against CM Revanth | మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిపక్ష నేత‌ కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్షం రేవంత్‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న (Privilege Motion) నోటీసు ఇచ్చింది.

S

Telangana | Published On Sep 18, 2026, 1.30 pm IST

Privilege Notice Against CM Revanth | సీఎం రేవంత్‌పై సభా హక్కుల నోటీస్.. స్పీకర్‌కు అంద‌జేసిన బీఆర్ఎస్ శాస‌న‌ స‌భాప‌క్షం
Advertisement

Privilege Notice Against CM Revanth | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిపక్ష నేత‌ కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్షం రేవంత్‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న (Privilege Motion) నోటీసు ఇచ్చింది. కేసీఆర్ భూముల‌కు సంబంధించి త‌ప్పుడు స‌మాచారంతో స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని పేర్కొంది. ఈమేర‌కు శుక్ర‌వారం మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, గంగుల కమలాకర్ స్పీకర్‌ను కలిసి సభా హక్కుల నోటిస్ అంద‌జేశారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్‌హౌస్, ఆయన కుటుంబ సభ్యుల భూములపై సభలో కొన్ని ఆధారాలు లేని వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. 330 ఎక‌రాల అసైన్డ్ భూములు కేసీఆర్ ఆక్ర‌మించారని చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని నోటీస్‌లో తెలిపారు. 22ఏ పై బీఆర్ఎస్ మాట్లాడుతున్నందుకే క‌క్ష‌సాధింపుగా ఈ చ‌ర్య‌ల‌కు రేవంత్ ఒడిగ‌ట్టార‌ని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement