త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy F70e 5G | రూ.13వేల‌కే శాంసంగ్ కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Samsung Galaxy F70e 5G | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ భార‌త మార్కెట్‌లో త‌న నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్‌70ఇ 5జి ని విడుద‌ల చేసింది. శాంసంగ్‌కు చెందిన ఎఫ్ సిరీస్‌లో విడుద‌లైన లేటెస్ట్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 9, 2026, 1.28 pm IST

Samsung Galaxy F70e 5G | రూ.13వేల‌కే శాంసంగ్ కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?
Advertisement

Samsung Galaxy F70e 5G | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ భార‌త మార్కెట్‌లో త‌న నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్‌70ఇ 5జి ని విడుద‌ల చేసింది. శాంసంగ్‌కు చెందిన ఎఫ్ సిరీస్‌లో విడుద‌లైన లేటెస్ట్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, దీనికి హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఈ ఫోన్ డిస్‌ప్లేకు హై బ్రైట్‌నెస్ మోడ్ (హెచ్‌బీఎం) ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వల్ల డిస్‌ప్లేకు 800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. దీంతో ఫోన్ డిస్‌ప్లే సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. డిస్‌ప్లేను సైతం టెంప‌ర్డ్ గ్లాస్‌తో తీర్చిదిద్దారు. క‌నుక చాలా దృఢంగా ఉంటుంది. కింద ప‌డినా అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్ 199 గ్రాముల బ‌రువును క‌లిగి ఉంటుంది. 8.2ఎంఎం మందంతో అత్యంత స్లీక్ డిజైన్‌ను క‌లిగి ఉంది. క‌నుక ఫోన్‌కు ప్రీమియం లుక్ వ‌చ్చింది. ఈ ఫోన్‌కు ఐపీ54 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను సైతం అందిస్తున్నారు. స్పాట్ లైట్ బ్లూ, లైమ్‌లైట్ గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు వెనుక డ్యుయల్ రియ‌ర్ కెమెరాల‌ను ఇచ్చారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్స‌ల్ కెపాసిటీని క‌లిగి ఉంటుంది. దీన్ని వైడ్ యాంగిల్ సెన్సార్ గా ఉప‌యోగించుకోవ‌చ్చు. సెకండ‌రీ కెమెరాకు 2 మెగాపిక్స‌ల్ సెన్సార్ ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరాగా ప‌నిచేస్తుంది. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అమ‌ర్చారు. అందువ‌ల్ల ఫోన్‌ను ఒక్క‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే రోజంతా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ బ్యాట‌రీకి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను కూడా ఇచ్చారు. క‌నుక ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.

6 ఏళ్ల వ‌ర‌కు ఓఎస్‌, సెక్యూరిటీ అప్ డేట్స్‌..

గెలాక్సీ ఎఫ్‌70ఇ 5జి ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత వ‌న్ యూఐ 8.0 ల‌భిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 6 ఏళ్ల వ‌ర‌కు ఓఎస్ అప్‌డేట్స్‌ను, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేయ‌గా, 4జీబీ, 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకునే స‌దుపాయం క‌ల్పించారు. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్ ల‌భిస్తుంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ల‌భిస్తుంది. 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి వంటి స‌దుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

గెలాక్సీ ఎఫ్‌70ఇ 5జి ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్‌పై రూ.1000 వ‌ర‌కు బ్యాంకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే కూప‌న్ల‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఫోన్‌ను ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అన్ని ఆఫ్ లైన్ స్టోర్‌లలో విక్ర‌యించ‌నున్నారు.

Advertisement
Advertisement