త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Redmi Note 15 SE 5G | షియోమీ నుంచి రెడ్‌మీ నోట్ 15 స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్‌.. అదిరిపోయిన ఫీచ‌ర్లు..

Redmi Note 15 SE 5G | చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్‌15 5జి స్పెష‌ల్ ఎడిష‌న్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. అంత‌కు ముందు తెలిపిన విధంగానే సంస్థ ఈ ఫోన్‌ను వినియోగ‌దారుల‌కు ప్ర‌స్తుతం అందుబాటులోకి తెచ్చింది.

S

Technology | Published On Apr 3, 2026, 9.59 am IST

Redmi Note 15 SE 5G | షియోమీ నుంచి రెడ్‌మీ నోట్ 15 స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్‌.. అదిరిపోయిన ఫీచ‌ర్లు..
Advertisement

Redmi Note 15 SE 5G | చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్‌15 5జి స్పెష‌ల్ ఎడిష‌న్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. అంత‌కు ముందు తెలిపిన విధంగానే సంస్థ ఈ ఫోన్‌ను వినియోగ‌దారుల‌కు ప్ర‌స్తుతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో డిజైన్‌, బ్యాట‌రీ, కెమెరా ప‌రంగా అనేక మార్పులు చేసి అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను క్రిమ్స‌న్ రిజ‌ర్వ్ అనే కొత్త రంగులో అందుబాటులో ఉంచారు. లెద‌ర్ ఫినిష్‌తో రూపొందించిన ఈ డిజైన్ ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది. ఎరుపు రంగు బ్యాక్‌కు గోల్డ్ మిడ్‌-ఫ్రేమ్‌ను జ‌త‌చేయ‌డం ద్వారా ప్ర‌త్యేక‌మైన లుక్ వ‌చ్చింది. అలాగే ఫ్రాస్టెడ్ వైట్‌, కార్బ‌న్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లోనూ ఈ ఫోన్ లాంచ్ అయింది.

భారీ బ్యాటరీ, అద్భుత‌మైన డిస్‌ప్లే..

ఈ ఫోన్‌కు చెందిన స్టాండ‌ర్డ్ మోడ‌ల్‌లో ఉన్న‌ట్లే టాప్‌-సెంట‌ర్ స్క్విర్కిల్ ఆకార కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. అయితే రెడ్‌-గోల్డ్ థీమ్‌కు అనుగుణంగా కెమెరా డెకోను డిజైన్ చేశారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా, మ‌రో 2 మెగా పిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 20 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5800 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. దీంట్లో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్బుత‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. సూర్య‌కాంతిలోనూ డిస్‌ప్లే స్ప‌ష్టంగా కనిపించేలా ఈ ఫోన్‌కు 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు.

మిలిట‌రీ గ్రేడ్ క్వాలిటీ..

ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 3 ప్రాసెస‌ర్ ఇందులో ఉంది. 6జీబీ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. అయితే హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్ ల‌భిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత షియోమీ హైప‌ర్ ఓఎస్‌2ను ఇచ్చారు. ఆథెంటికేష‌న్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను ఇచ్చినందున సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఐపీ65, ఐపీ66 డ‌స్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ స‌దుపాయాన్ని అందించారు. మిలిటరీ గ్రేడ్ నాణ్య‌త‌తో ఈ ఫోన్‌ను రూపొందించినందున బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఎన్ని సార్లు కింద ప‌డినా అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. 5జి సేవ‌ల‌ను ఇందులో పొంద‌వ‌చ్చు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను అందించారు.

ధ‌ర వివ‌రాలు..

రెడ్‌మీ నోట్ 15 ఎస్ఈ 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.19,999గా నిర్ణ‌యించారు. 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.21,999 ఉండ‌గా, 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంఐ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, అన్ని రిటెయిల్ స్టోర్‌ల‌లో ఏప్రిల్ 7 నుంచి విక్ర‌యించ‌నున్నారు. లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. ప‌లు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement