Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
Surface Pro for Business | ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన నూతన తరం సర్ఫేస్ ఫర్ బిజినెస్ ల్యాప్‌టాప్‌లను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో కొత్తగా సర్ఫేస్ ప్రొ ఫర్ బిజినెస్, సర్ఫేస్ ల్యాప్ టాప్ ఫర్ బిజినెస్ మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లను ఇచ్చారు. అందువల్ల ఇవి అత్యంత వేగంగా పనిచేస్తాయి.
Technology | Published On May 20, 2026, 1.53 pm IST
Surface Pro for Business | ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన నూతన తరం సర్ఫేస్ ఫర్ బిజినెస్ ల్యాప్‌టాప్‌లను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో కొత్తగా సర్ఫేస్ ప్రొ ఫర్ బిజినెస్, సర్ఫేస్ ల్యాప్ టాప్ ఫర్ బిజినెస్ మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లను ఇచ్చారు. అందువల్ల ఇవి అత్యంత వేగంగా పనిచేస్తాయి. మెరుగైన ఏఐ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. దీని వల్ల ఏఐ పనులను అత్యంత వేగంగా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా కోడింగ్ చేసేవారితోపాటు బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఇవి మెరుగైన పనితీరును అందిస్తాయి. ఏఐ పనులను వేగంగా పూర్తి చేసేలా అత్యంత అధునాతన హార్డ్‌వేర్‌ను వీటిల్లో ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్‌లను ఉపయోగిస్తే ఉత్పాదకత మరింత మెరుగు పడుతుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా ఇవే ల్యాప్ టాప్ మోడల్స్‌ను మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది చివర్లో స్నాప్ డ్రాగన్ ఎక్స్2 ప్రాసెసర్‌లతో అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీని వల్ల ఈ ల్యాప్ టాప్ శ్రేణిని మరింత విస్తరించాలని ప్రయత్నిస్తోంది.
మాక్‌బుక్ ఎయిర్ ఎం5 కన్నా మెరుగైన పనితీరు..
మైక్రోసాఫ్ట్ తన సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్ లలో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌లను అందిస్తుండడం వల్ల ల్యాప్ టాప్‌లలో మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో గత సర్ఫేస్ మోడల్స్ కన్నా మెరుగైన గ్రాఫిక్స్ ప్రదర్శన లభిస్తుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్ చిప్‌ను డివైస్‌లు ఉపయోగించుకుంటాయి. యాపిల్‌కు చెందిన ఎం5 చిప్ కలిగిన మాక్ బుక్ ఎయిర్‌తో పోలిస్తే గ్రాఫిక్స్ పనితీరులో 35 శాతం మెరుగైన ప్రదర్శనను ఇస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అలాగే గత సర్ఫేస్ ల్యాప్ టాప్ మోడల్స్ కన్నా ఇవి 90 శాతం అధిక వేగంతో పనిచేస్తాయని వెల్లడించింది. వీటిల్లో క్లిష్టమైన డేటా విశ్లేషణ, కంటెంట్ క్రియేషన్, రియల్‌టైమ్ ప్రజెంటేషన్‌ల కోసం నిరంతరాయమైన వర్క్‌లోడ్‌ను తట్టుకునేలా హార్డ్ వేర్ వంటి ఫీచర్లను ఇచ్చారు. అందువల్ల ఇవి బిజినెస్ ప్రొఫెషనల్స్‌తోపాటు కంటెంట్ క్రియేటర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి.
ధర వివరాలు..
ఈ ల్యాప్ టాప్‌లలో 13.8 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. వైఫై 7 కనెక్టివిటీ ఉంది. జెన్ 4 ఎస్ఎస్‌డీని ఇచ్చారు కనుక హార్డ్ డిస్క్ వేగంగా పనిచేస్తుంది. అల్ట్రా పోర్టబుల్ డిజైన్‌లో వీటిని తీర్చిదిద్దారు. అందువల్ల రోజూ ఎక్కడికంటే అక్కడికి సులభంగా వీటిని తీసుకెళ్లవచ్చు. అలాగే ఇవే మోడల్స్‌ను 15 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లోనూ ఇస్తున్నారు. ఇక ఇవి 23 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. 13.8 ఇంచుల మోడల్స్ మరింత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయని తెలియజేసింది. ఈ ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ చిప్-టు-క్లౌడ్ రక్షణ ఇచ్చారు. అందువల్ల వీటిని అంత సులభంగా అటాక్, హ్యాకింగ్ చేయలేరు. వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కోసం 13.8 ఇంచుల మోడల్స్ అద్బుతంగా పనిచేస్తాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. వీటి ధర రూ.1.45 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 16జీబీ నుంచి 24జీబీ వరకు ర్యామ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 15 ఇంచుల మోడల్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.1.88 లక్షలుగా ఉంది. వీటికి టచ్ స్క్రీన్ సదుపాయాన్ని ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్‌లు అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్లు, మైక్రోసాఫ్ట్ భాగస్వామి స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Ambrane Reneo | టైప్-సి ఛార్జింగ్‌తో ఆంబ్రేన్ కొత్త బ్యాటరీలు.. ఒక్కటి 100 సాధారణ బ్యాటరీలకు సమానం!
మే 14, 2026

Samsung | గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు.. ప్రకటించిన శాంసంగ్..
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



