త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్..

OPPO Find X9 Ultra | చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ని అధికారికంగా విడుదల చేసింది. ఆప్టిక్స్ సుప్రీమ్, పాకెట్ హాసెల్‌బ్లాడ్ అనే థీమ్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్స్, వీడియో మేకర్స్‌ను టార్గెట్ చేసింది.

S

Technology | Published On May 21, 2026, 5.07 pm IST

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్..
Advertisement

OPPO Find X9 Ultra | చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ని అధికారికంగా విడుదల చేసింది. ఆప్టిక్స్ సుప్రీమ్, పాకెట్ హాసెల్‌బ్లాడ్ అనే థీమ్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్స్, వీడియో మేకర్స్‌ను టార్గెట్ చేసింది. హాసెల్‌బ్లాడ్ ఎక్స్2డి 100సి ఎర్త్ ఎక్స్‌ప్లోరర్ లిమిటెడ్ ఎడిషన్ కెమెరా నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌తో ఈ ఫోన్ ను రూపొందించారు. వెనుక భాగంలో పర్యావరణ హితమైన ప్రీమియం లెదర్ ఫినిష్ ఉపయోగించారు. హాసెల్‌బ్లాడ్ లోగో స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. కాన్యాన్ ఆరెంజ్, టండ్రా అంబర్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో అందుబాటులో ఉంది. ఫైండ్ ఎక్స్9 అల్ట్రాలో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. స్విస్ ఎస్‌జీఎస్ ఫైవ్ స్టార్ డ్రాప్, షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందింది. అలాగే ఐపీ66, ఐపీ68, ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

అదిరిపోయిన కెమెరాలు..

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన హైలైట్ దాని కెమెరా సెటప్. మొత్తం ఆరు లెన్స్‌లతో కూడిన అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ సిస్టమ్ అందించారు. 10ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలిఫోటో లెన్స్, 20ఎక్స్ వరకు ఆప్టికల్ క్వాలిటీ జూమ్, 200ఎంపీ అల్ట్రా క్లియర్ టెలిఫోటో కెమెరా, 200ఎంపీ అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా, అప్‌గ్రేడ్ డైనమిక్ రేంజ్, లైట్ సెన్సిటివిటీ వంటి ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. కొత్త లూమో ఇంటర్నల్ ఆప్టికల్ జూమ్ టెక్నాలజీతో 2ఎక్స్, 6ఎక్స్ జూమ్ రేంజ్‌లలో నాలుగు రెట్లు ఎక్కువ పిక్సెల్ కౌంట్ అందుతుంది. మొత్తం కెమెరా సిస్టమ్ 8కె ఇమేజ్ క్వాలిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో నెక్స్ట్ జనరేషన్ హాసెల్‌బ్లాడ్ మాస్టర్ మోడ్ ఇచ్చారు. ఇందులో మూడు కీలక ఫీచర్లు ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్ ట్రూ డీటెయిల్, హాసెల్‌బ్లాడ్ నేచురల్ కలర్, మాస్టర్ మోడ్ ఒరిజినల్ ఫిల్మ్ అనే స‌దుపాయాల‌ను ఇచ్చారు. ఈ ఫీచర్ల ద్వారా 8కె అల్ట్రా హై రిజల్యూషన్ ఫొటోలు, నేచురల్ కలర్ అవుట్‌పుట్, క్లాసిక్ ఫిల్మ్ టోన్స్ లభిస్తాయి. తొమ్మిది రకాల ఫిల్మ్ ప్రొఫైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

క్వాలిటీ క‌లిగిన చిత్రాలు..

వీడియో మేకర్స్ కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేక వీడియో లెన్స్ గ్రూప్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఏడు హై క్వాలిటీ ఆప్టికల్ లెన్స్‌లు ఉన్నాయి. 8కే వీడియో @ 30ఎఫ్‌పీఎస్, 4కే వీడియో @ 120ఎఫ్‌పీఎస్, 10బిట్ లాగ్ రికార్డింగ్, ఓ-లాగ్2 సపోర్ట్, ఏసెస్ కలర్ మేనేజ్‌మెంట్, కస్టమ్ 3డి ఎల్‌యూటీ ఇంపోర్ట్స్ వంటి ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. ప్రొఫెషనల్ వీడియో షూటింగ్ కోసం TILTAతో కలిసి ఓప్పో ప్రత్యేక ఎకోసిస్టమ్ కూడా రూపొందించింది. ఇందులో ఎన్‌డీ ఫిల్టర్లు, మాన్యువల్ ఫోకస్ హ్యాండిల్స్, హెచ్‌డీఎంఐ అవుట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.82 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 144హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, పిక్సెల్ లెవల్ గామా కరెక్షన్, ఐ కంఫర్ట్ టెక్నాలజీ వంటి స‌దుపాయాల‌ను ఇది క‌లిగి ఉంది. ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉపయోగించారు. మొబా, ఎఫ్‌పీఎస్ గేమ్స్‌లో 144ఎఫ్‌పీఎస్ ఫుల్ ఫ్రేమ్ రేట్ అందుతుందని కంపెనీ తెలిపింది.

భారీ బ్యాట‌రీ..

ఫైండ్ ఎక్స్9 అల్ట్రాలో 7050ఎంఏహెచ్ గ్లేసియర్ బ్యాటరీ ఇచ్చారు. 100వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి స‌దుపాయాల‌ను ఇది క‌లిగి ఉంది. అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ అందించారు. మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా కాల్స్, మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో లాంచ్ అయంది. ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్‌సీ వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాలు ఉన్నాయి. ఆడియో నాణ్య‌త కోసం డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

ఒప్పో ఫైండ్ ఎక్స్‌9 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ (12జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌) ధ‌ర రూ.1,69,999గా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోన్‌కు ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించారు. మే 28 నుంచి ఒప్పో ఇండియా స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్ ను ప్రీ ఆర్డ‌ర్ చేస్తే రూ.11వేల విలువైన ఫ్రీ ప్రీమియం గిఫ్ట్ బాక్స్ ఇస్తారు. ఒప్పోకు చెందిన ఎంకో ఎయిర్ 5 ప్రో ఇయ‌ర్‌బ‌డ్స్‌ను ఉచితంగా అందిస్తారు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.22వేల వ‌ర‌కు గ‌రిష్టంగా బోన‌స్ పొంద‌వ‌చ్చు. 24 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ఉంది. 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్‌, 60 శాతం వ‌ర‌కు అష్యూర్డ్ బై బ్యాక్‌, 180 రోజుల వాలిడిటీతో హార్డ్ వేర్ డిఫెక్ట్ రీప్లేస్‌మెంట్‌, 3 నెల‌ల గూగుల ఏఐ ప్రో స‌బ్‌స్క్రిప్ష‌న్‌, 3 నెల‌ల స్పాటిఫై ప్రీమియం ఖాతా, జియో వినియోగ‌దారుల‌కు 5టీబీ వ‌ర‌కు క్లౌడ్ స్టోరేజ్ వంటి ఆఫ‌ర్ల‌ను ఈ ఫోన్‌పై ఇస్తున్నారు.

Advertisement
Advertisement