Redmi Note 15 Pro | రెడ్‌మీ నోట్ 15 ప్రొ ఫోన్లను లాంచ్ చేసిన షియోమీ.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
Redmi Note 15 Pro | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ తన రెడ్‌మీ నోట్ సిరీస్‌లో సరికొత్త ఫోన్లను ఆవిష్కరించింది. రెడ్‌మీ నోట్ 15 ప్రొ ప్లస్ 5జి, రెడ్‌మీ నోట్ 15 ప్రొ 5జి పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లకూ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.
Technology | Published On Jan 30, 2026, 11.56 am IST
Redmi Note 15 Pro | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ తన రెడ్‌మీ నోట్ సిరీస్‌లో సరికొత్త ఫోన్లను ఆవిష్కరించింది. రెడ్‌మీ నోట్ 15 ప్రొ ప్లస్ 5జి, రెడ్‌మీ నోట్ 15 ప్రొ 5జి పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లకూ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఇతర ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్ల డిస్‌ప్లే చాలా దృఢంగా ఉంటుంది. రెండు ఫోన్లలోనూ ఐపీ66, 68, 69, 69కె డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ప్రొ ప్లస్ మోడల్‌లో బ్యాక్ ప్యానెల్‌ను ఫైబర్ గ్లాస్ రూపంలో ఇచ్చారు. కనుక చేతి గ్రిప్ చాలా సులభంగా ఉంటుంది. అలాగే వెట్ టచ్ 2.0 పేరిట మరో ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. దీని వల్ల చేతులు తడిగా ఉన్న ఫోన్‌ను నిరభ్యంతరంగా పట్టుకోవచ్చు.
200MP కెమెరా..
ఈ రెండు ఫోన్లకు వెనుక వైపు 200MP భారీ కెపాసిటీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనికి పలు ఏఐ ఫీచర్లను కూడా అందిస్తున్నారు. రెడ్‌మీ నోట్ 15 ప్రొ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను అందించగా, ప్రొ ప్లస్ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ గూగుల్ జెమిని ఏఐకి సపోర్ట్ లభిస్తుంది. అలాగే గూగుల్‌కు చెందిన సర్కిల్ టు సెర్చ్ ఫీచర్‌ను సైతం వీటిల్లో పొందవచ్చు. ఈ రెండు ఫోన్ల డిస్‌ప్లేలను కూడా సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా 3200 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ప్రొ మోడల్ డిస్‌ప్లే సైజ్ 6.77 ఇంచులు ఉండగా, ప్రొ ప్లస్ మోడల్‌లో 6.83 ఇంచుల డిస్‌ప్లేను అందిస్తున్నారు.
భారీ బ్యాటరీ..
రెడ్‌మీ నోట్ 15 ప్రొ 5జి ఫోన్‌లో 6580 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. ఇక రెడ్‌మీ నోట్ 15 ప్రొ ప్లస్ ఫోన్‌లో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, దీనికి 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్లను సుమారుగా 6 ఏళ్ల పాటు ఉపయోగించినా కూడా బ్యాటరీ అద్భుతంగా బ్యాకప్‌ను ఇస్తుందని, బ్యాటరీలో కనీసం 80 శాతం కెపాసిటీ ఉంటుందని షియోమీ స్పష్టం చేసింది. రెండు ఫోన్లకు కూడా 1.5కె రిజల్యూషన్ కలిగిన ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. కనుక ఫోన్ డిస్‌ప్లేలు చాలా క్వాలిటీగా ఉంటాయి. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌లను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్లలో అందిస్తున్నారు.
ధర వివరాలు..
రెడ్‌మీ నోట్ 15 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌ను కార్బన్ బ్లాక్, సిల్వర్ యాష్, మిరేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.31,999గా నిర్ణయించారు. రెడ్‌మీ నోట్ 15 ప్రొ ప్లస్ 5జి ఫోన్‌ను కార్బన్ బ్లాక్, కాఫీ మోకా, మిరేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా, ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. అలాగే 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.43,999గా ఉంది. ఇక ఈ ఫోన్లను అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, అన్ని ఆథరైజ్డ్ రిటెయిల్ స్టోర్ లలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో రూ.3వేల వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Google Gemini AI | గూగుల్ జెమిని ఏఐకి భారీ అప్ డేట్స్.. ఏజెంటిక్ ఏఐలో కొత్త విప్లవం..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



