Realme P4 Power 5G | రియల్‌మి కొత్త ఫోన్‌లో 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ.. ధర ఎంతంటే..?
Realme P4 Power 5G | మొబైల్స్ తయారీదారు రియల్‌మి మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పి4 పవర్ 5జి పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్‌లో ఏకంగా 10,000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందిస్తున్నారు. ఈ ఫీచర్‌ను ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
Technology | Published On Jan 31, 2026, 10.20 am IST
Realme P4 Power 5G | మొబైల్స్ తయారీదారు రియల్‌మి మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పి4 పవర్ 5జి పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్‌లో ఏకంగా 10,000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందిస్తున్నారు. ఈ ఫీచర్‌ను ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక ఇందులో పలు ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల హైపర్ గ్లో 4డి కర్వ్ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా ఈ ఫోన్‌కు ఏకంగా 6500 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ సైతం లభిస్తోంది.
14జీబీ వరకు వర్చువల్ ర్యామ్..
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జి చిప్ సెట్‌ను అమర్చారు. 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. మరో 14జీబీ వరకు ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. అందువల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. అసలు ల్యాగ్ ఉండదు. అలాగే హీట్ బయటకు వెళ్లేలా ప్రత్యేకంగా ఎయిర్ ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. కనుక ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్ కు గురి కాదు. ముఖ్యంగా 4కె రికార్డింగ్‌లను, గేమింగ్ సెషన్‌లను సైతం అద్భుతంగా నిర్వహిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో వెనుక వైపు డ్యుయల్ కెమెరాలను ఇచ్చారు. ప్రధానంగా 50 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న ప్రైమరీ సెన్సార్ ఉంది. అలాగే మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాలకు ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. అందువల్ల ఫొటోలు, వీడియోలను అద్భుతంగా చిత్రీకరించుకోవడమే కాదు, నాణ్యంగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు.

భారీ బ్యాటరీ..
రియల్ మి పి4 పవర్ 5జి ఫోన్ లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తుండగా, ఈ ఫోన్‌కు గాను 3 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌ను మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించగా, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ కలిగిన తొలి మిలిటరీ గ్రేడ్ క్వాలిటీ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. అయితే భారీ బ్యాటరీని ఏర్పాటు చేసినప్పటికీ ఫోన్ కేవలం 219 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉండడం విశేషం. ఇక 4 ఏళ్ల ఉపయోగం అనంతరం కూడా ఫోన్ బ్యాటరీలో 80 శాతం మేర కెపాసిటీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు గాను 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇస్తున్నారు. కనుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల పాటు చార్జింగ్ చేసినా ఒక రోజుకు కావల్సిన బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 27 వాట్ల మేర రివర్స్ చార్జింగ్ కూడా ఇందులో సపోర్ట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ తో ఇతర ఫోన్‌లను కూడా చార్జింగ్ చేయవచ్చన్నమాట.
ధర వివరాలు..
ఈ ఫోన్ ను 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లు ఉన్నాయి. ఐపీ 66, 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ కూడా అందుబాటులో ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక రియల్ మి ప4 పవర్ 5జి ఫోన్ కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.25,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌లపై రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే మరో రూ.2వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను కొన్న వారికి 4 ఏళ్ల వరకు బ్యాటరీపై అదనపు వారంటీ లభిస్తుంది. ఇక ఫిబ్రవరి 5 నుంచి ఈ ఫోన్‌ను రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్‌లలో విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



