realme P4 Lite 5G | భారీ బ్యాటరీతో తక్కువ ధరకే లాంచ్ అయిన రియల్‌మి పి4 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్
realme P4 Lite 5G | మొబైల్స్ తయారీదారు రియల్‌మి భారత మార్కెట్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ రియల్‌మి పి4 లైట్ 5జిని విడుదల చేసింది. పి4 సిరీస్‌లో భాగంగా వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కాగా, ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉంది. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.
Technology | Published On Mar 20, 2026, 3.45 pm IST
realme P4 Lite 5G | మొబైల్స్ తయారీదారు రియల్‌మి భారత మార్కెట్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ రియల్‌మి పి4 లైట్ 5జిని విడుదల చేసింది. పి4 సిరీస్‌లో భాగంగా వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కాగా, ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉంది. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. సూర్యకాంతిలోనూ తెరను స్పష్టంగా వీక్షించేలా ఈ ఫోన్ డిస్‌ప్లేకు 900 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ప్రత్యేకంగా వీసీ కూలింగ్ సిస్టమ్‌ను ఇచ్చినందున ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు.
మిలిగ్రేడ్ ప్రమాణాలతో..
ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌ను అందించారు. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఎలాంటి ల్యాగ్ ఉండదు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 ఓఎస్‌ను ఇచ్చారు. ఫోన్‌కు వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇవ్వగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఐపీ 64 డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో ఈ ఫోన్‌ను దృఢంగా రూపొందించారు. అందువల్ల ఫోన్ బిల్డ్ క్వాలిటీ బలంగా ఉంటుంది.
7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 7000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌కు దీన్ని ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్ సాధారణ యూసేజ్‌కు రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు కనుక ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. ఇక బైపాస్ చార్జింగ్ అనే సదుపాయం కూడా ఉంది. చార్జర్‌తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఫోన్ బ్యాటరీ 100 శాతం ఉంటే అప్పుడు బ్యాటరీ వినియోగం అవకుండా నేరుగా విద్యుత్‌తోనే పనిచేస్తుంది. దీంతో బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఎక్కువ కాలం పాటు బ్యాటరీ మన్నికగా ఉంటుంది.
ధర వివరాలు..
ఈ ఫోన్ ను 4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్ ఇచ్చారు. స్పీకర్ వాల్యూమ్‌ను 300 శాతం వరకు పెంచుకునే ఆప్షన్ ను అందించారు. 5జి సేవలు అందుబాటులో ఉన్నాయి. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మి పి4 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియెంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999 ఉండగా దీనిపై డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. దీంతో ఈ మోడల్ రూ.11,499కి వస్తుంది. అలాగే 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 ఉండగా, ప్రారంభ ఆఫర్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ.12,499కి ఇస్తున్నారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 ఉండగా, డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్‌ను రూ.14,499కి ఇస్తున్నారు. ఈ ఫోన్‌ను మార్చి 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



