realme C83 5G | 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్
realme C83 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తన సి సిరీస్‌లో తాజా మోడల్‌గా రియల్‌మి సి83 5జి స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
Technology | Published On Mar 7, 2026, 9.44 am IST
realme C83 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తన సి సిరీస్‌లో తాజా మోడల్‌గా రియల్‌మి సి83 5జి స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. దీనికి హెచ్‌డీప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కనుక డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 6జీబీ వరకు ర్యామ్‌ను, 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ర్యామ్‌ను అదనంగా మరో 12జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. దీని వల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
ప్రత్యేకమైన ఏఐ ఔట్‌డోర్ మోడ్ ఫీచర్..
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 17 ఆధారిత రియల్‌మి యూఐ 7.0ను ఇచ్చారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇందులో ఏఐ ఔట్‌డోర్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇది ఫోన్‌ను బయట ఉపయోగించే సమయంలో ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఏఐ సహాయంతో సిస్టమ్ పనితీరు పెరుగుతుంది. స్పీకర్ వాల్యూమ్ మెరుగవుతుంది. నెట్‌వర్క్ స్పందన వేగవంతమవుతుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పెరుగుతుంది. దీంతో సూర్యకాంతిలో కూడా ఫోన్ ను స్పష్టంగా వీక్షించవచ్చు. ఇక రియల్‌మి సి83 5జి ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా మాడ్యూల్‌తో కూడిన వెర్టికల్ కెమెరా డిజైన్ ను ఇచ్చారు. ఈ ఫోన్‌ను బ్లూమింగ్ పర్పుల్, స్ప్రౌటింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌కు ప్రత్యేకంగా ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ను ఇచ్చారు. అదనంగా ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అలాగే మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ను కూడా పొందింది. ఇందుల 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. ఇది 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఏకంగా 6 ఏళ్ల వరకు మన్నికగా పనిచేస్తుందని కంపెనీ తెలియజేసింది. ఇందులో రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను కూడా ఇస్తున్నారు కనుక ఇతర ఫోన్‌లను దీంతో చార్జింగ్ చేయవచ్చు. అలాగే బైపాస్ చార్జింగ్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని సహాయంతో చార్జర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు 100 శాతం చార్జింగ్ అయ్యాక ఫోన్ నేరుగా విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది. బ్యాటరీపై ఆధారపడదు. దీని వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఇక ఫోన్‌లో మెమొరీ కార్డు స్లాట్ సదుపాయం కూడా ఇచ్చారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్ సదుపాయం ఇచ్చారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే..
రియల్‌మి సి83 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ, 64జీబీ మోడల్ ధర రూ.13,499 ఉండగా, 4జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.14,499గా ఉంది. అలాగే 6జీబీ, 1288జీబీ మోడల్ ధరను రూ.17,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, ఇతర స్టోర్స్‌లో ఇప్పటికే విక్రయిస్తున్నారు. దీనిపై 6 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



