Phone Battery Backup | మీ ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే బ్యాటరీ బ్యాకప్ ఎంతగానో పెరుగుతుంది..!
Phone Battery Backup | స్మార్ట్ ఫోన్లలో ఒకప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే గొప్ప. అప్పట్లో అదే సంచలనం. కానీ ఇప్పుడు 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫోన్లలో అందిస్తున్నా కూడా బ్యాకప్ సరిపోవడం లేదు. కాసేపు ఫోన్‌ను వాడగానే బ్యాటరీ చాలా వరకు తగ్గిపోతుంది.
Technology | Published On Dec 22, 2025, 6.01 pm IST
Phone Battery Backup | స్మార్ట్ ఫోన్లలో ఒకప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే గొప్ప. అప్పట్లో అదే సంచలనం. కానీ ఇప్పుడు 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫోన్లలో అందిస్తున్నా కూడా బ్యాకప్ సరిపోవడం లేదు. కాసేపు ఫోన్‌ను వాడగానే బ్యాటరీ చాలా వరకు తగ్గిపోతుంది. కొన్ని గంటలపాటు ఫోన్‌ను వాడితే ఇక ఫోన్‌కు చార్జింగ్ మళ్లీ పెట్టాల్సిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫోన్ వాడుతున్న చాలా మంది బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉన్నప్పటికీ బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా రాకపోవడానికి కేవలం ఫోన్‌ను అతిగా వాడడమే కాదు, ఇంకా పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అయిపోవడానికి ఫోన్లలో ఉండే పలు సెట్టింగ్స్ కారణం అని చెప్పవచ్చు. వాటిని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయడం ద్వారా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వచ్చేలా చేయవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీ..
సాధారణంగా మనం ఫోన్లను వాడినప్పుడు అనేక యాప్స్ ఓపెన్ చేస్తుంటాం. ఒక యాప్‌ను క్లోజ్ చేసి మరొక యాప్‌ను ఓపెన్ చేసినా కూడా అంతకు ముందు ఓపెన్ చేసిన యాప్స్ అన్నీ బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. అవి ఫోన్‌కు చెందిన పలు రీసోర్స్‌లను ఉపయోగించుకుంటాయి. వాటిల్లో బ్యాటరీ కూడా ఒకటి. ఈ క్రమంలో మనం వాడని యాప్ కూడా బ్యాటరీని ఉపయోగించుకుంటుంది. ఇలా యాప్స్ అన్నీ బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయితే అవి బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ తగ్గుతుంది. కనుక బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్‌ను క్లోజ్ చేయాలి. లేదా బ్యాటరీ వాడుకోకుండా చూడాలి. అందుకు గాను ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం అందులో ఉండే బ్యాటరీ విభాగంలో కిందకు వెళ్తే యాప్స్ కనిపిస్తాయి. ఏదైనా యాప్‌ను ఓపెన్ చేస్తే మనకు అలో బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీ, రిస్ట్రిక్ట్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ పేరిట పలు ఆప్షన్లు దర్శనం ఇస్తాయి. వాటిల్లో రిస్ట్రిక్ట్ బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీని వల్ల ఆ యాప్ బ్యాక్ గ్రౌండ్‌లో పనిచేస్తున్నా కూడా బ్యాటరీని వినియోగించుకోకుండా ఉంటుంది. ఇలా మీకు కావల్సిన యాప్‌లకు ఈ సెట్టింగ్‌ను మార్చుకుంటే మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేయవచ్చు. దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది.

లొకేషన్, జీపీఎస్, నోటిఫికేషన్స్..
ఇక మనం ఫోన్‌ను నిరంతరాయంగా ఉపయోగించకపోయినప్పటికీ చాలా మంది అందులో లొకేషన్ సర్వీసెస్, జీపీఎస్ ఆన్ చేసి ఉంచుతారు. వాస్తవానికి ఇవి అధికంగా బ్యాటరీని ఉపయోగించుకుంటాయి. కనుక మీరు ఫోన్‌ను వాడినప్పుడే వీటిని ఎనేబుల్ చేసుకోండి. లేదంటే డిసేబుల్ చేసి ఉంచండి. దీని వల్ల పెద్ద ఎత్తున బ్యాటరీ ఆదా అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది. అలాగే చాలా మంది అవసరం లేని యాప్స్‌కు కూడా నోటిఫికేషన్స్‌ను ఆన్ చేసి పెడతారు. ఇలా చేయడం వల్ల ఫోన్‌కు పదే పదే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. దీంతో బ్యాటరీ గణనీయంగా ఖర్చవుతుంది. కనుక మీకు అవసరం ఉన్న యాప్స్‌కు మాత్రమే నోటిఫికేషన్స్ వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోండి. అవసరం లేని యాప్స్‌కు నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయండి. దీని వల్ల కూడా బ్యాటరీ ఆదా అవుతుంది.
వైఫై, బ్లూటూత్..
చాలా మంది ఫోన్లలో ప్రస్తుతం మొబైల్ డేటాను అధికంగా ఉపయోగిస్తున్నారు. కనుక వైఫైని ఆఫ్ చేసి ఉంచండి. మీకు కావాలనుకుంటేనే వైఫైని వాడండి. అలాగే బ్లూటూత్ కూడా అవసరం ఉన్నప్పుడే ఉపయోగించండి. ఇతర సమయాల్లో ఆఫ్ చేసి పెట్టండి. ఇలా వైఫై, బ్లూటూత్‌లను ఆఫ్ చేసి ఉంచడం వల్ల చాలా వరకు బ్యాటరీని ఆదా చేయవచ్చు. అలాగే ఫోన్‌లో ఎప్పటికప్పుడు రీసెంట్ లిస్ట్‌లో ఉండే యాప్స్‌ను తొలగించండి. లేదంటే ఆ యాప్స్ బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూ బ్యాటరీతోపాటు డేటాను, మెమొరీని కూడా వాడుకుంటాయి. దీంతో ఫోన్ కాస్త స్లో అవుతుంది. దీన్ని నివారించేందుకు ఫోన్ రీసెంట్ లిస్ట్‌లో ఉండే యాప్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. దీంతో ఫోన్ వేగంగా పనిచేయడమే కాదు, బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న సెట్టింగ్స్‌ను మార్చడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరిగేలా చేయవచ్చు. దీంతో మరింత ఎక్కువ సేపు మీరు ఫోన్‌ను ఉపయోగించుకోగలుగుతారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



