త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oppo Pad 5 | భారీ బ్యాట‌రీ, అదిరిపోయే ఫీచ‌ర్లతో లాంచ్ అయిన ఒప్పో కొత్త ట్యాబ్‌..!

Oppo Pad 5 | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ఇటీవ‌లే రెనో 15 సిరీస్ లో ప‌లు నూత‌న స్మార్ట్ ఫోన్‌ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఫ్లాగ్‌షిప్‌తోపాటు మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో ఈ ఫోన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వీటిల్లో ఫీచ‌ర్లు సైతం వినియోగ‌దారుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఇదే కోవ‌లో ఒప్పో ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కూడా లాంచ్ చేసింది.

S

Technology | Published On Jan 12, 2026, 12.16 pm IST

Oppo Pad 5 | భారీ బ్యాట‌రీ, అదిరిపోయే ఫీచ‌ర్లతో లాంచ్ అయిన ఒప్పో కొత్త ట్యాబ్‌..!
Advertisement

Oppo Pad 5 | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ఇటీవ‌లే రెనో 15 సిరీస్ లో ప‌లు నూత‌న స్మార్ట్ ఫోన్‌ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఫ్లాగ్‌షిప్‌తోపాటు మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో ఈ ఫోన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వీటిల్లో ఫీచ‌ర్లు సైతం వినియోగ‌దారుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఇదే కోవ‌లో ఒప్పో ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కూడా లాంచ్ చేసింది. ఒప్పో ప్యాడ్ 5 పేరిట ఓ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశపెట్టారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఈ ట్యాబ్ ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఒప్పో ప్యాడ్ 5 ఆండ్రాయిడ్ ట్యాబ్‌లో 12.1 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 2.8కె రిజ‌ల్యూష‌న్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. క‌నుక ఈ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుత‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు.

భారీ బ్యాట‌రీ..

ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ ట్యాబ్‌ను వైఫైతోపాటు 5జి మోడ‌ల్‌లోనూ లాంచ్ చేశారు. క‌నుక 5జి మోడ‌ల్‌లో ఎంచ‌క్కా సిమ్ వేసుకుని మ‌రీ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ట్యాబ్ లో ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. ప‌లు ఏఐ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. దీని వ‌ల్ల ఉద్యోగులు లేదా విద్యార్థులు తమ ప‌నిలో నైపుణ్య‌త‌ను సాధించ‌వ‌చ్చు. త‌మ స్కిల్స్‌ను మెరుగు ప‌రుచుకోవ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది. ఈ ట్యాబ్‌లో 10,050 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇచ్చారు. క‌నుక ఈ ట్యాబ్ బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ట్యాబ్‌కు స‌పోర్ట్ చేసేలా ఓ స్టైల‌స్‌ను కూడా ఒప్పో అందిస్తోంది. దీన్ని ఒప్పో పెన్సిల్ 2ఆర్ పేరిట అందిస్తున్నారు. దీని స‌హాయంతో ట్యాబ్‌ను చాలా సుల‌భంగా ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు.

5జి మోడల్ కూడా..

ఒప్పో ప్యాడ్ 5 ట్యాబ్‌లో డిస్‌ప్లేకు డాల్బీ విజ‌న్ స‌దుపాయం కూడా ఉంది. క‌నుక డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా క‌నిపించేలా ఈ డిస్‌ప్లేకు 600 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌ను 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేశారు. వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, ముందు వైపు కూడా అదే కెపాసిటీ క‌లిగిన కెమెరాను ఇచ్చారు. యూఎస్‌బీ టైప్ సి ఆడియోకు ఈ ట్యాబ్ స‌పోర్ట్‌ను అందిస్తుంది. క్వాడ్ స్పీక‌ర్ల‌ను ఏర్పాటు చేశారు క‌నుక ఆడియో కూడా పెద్ద‌గా వినిపిస్తుంది. 5జి, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర స‌దుపాయ‌ల‌ను కూడా ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు.

ధ‌ర వివ‌రాలు..

ఒప్పో ప్యాడ్ 5 ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను అరోరా పింక్‌, స్టార్‌లైట్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ ఫైఫై మోడ‌ల్ ధ‌ర రూ.26,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 5జి మోడల్ ధ‌ర‌ను రూ.32,999గా నిర్ణ‌యించారు. ఈ ట్యాబ్‌ను ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఈ ట్యాబ్ కు ప్రీ ఆర్డ‌ర్ల‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు. దీనిపై రూ.2వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను, 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement