త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | పేద‌ల భూముల‌కు ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ‌గా ఉండాలి: ఎంపీ ఈటల రాజేంద‌ర్‌

Eatala Rajender | పేద‌ల భూముల‌కు ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ‌గా ఉండాల‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender) అన్నారు. ప్ర‌భుత్వ భూముల‌ను పేద‌లు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్లు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేద‌నే భావన ప్రజల్లో వచ్చిందని, ఇది మంచిది కాద‌ని చెప్పారు.

G

Hyderabad | Published On Jan 12, 2026, 1.19 pm IST

Eatala Rajender | పేద‌ల భూముల‌కు ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ‌గా ఉండాలి: ఎంపీ ఈటల రాజేంద‌ర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పేద‌ల భూముల‌కు ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ‌గా ఉండాల‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender) అన్నారు. ప్ర‌భుత్వ భూముల‌ను పేద‌లు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్లు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేద‌నే భావన ప్రజల్లో వచ్చిందని, ఇది మంచిది కాద‌ని చెప్పారు. కూక‌ట్‌ప‌ల్లిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఈట‌ల రాజేంద‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `కూక‌ట్ ప‌ల్లి కాంక్రీట్ జంగ‌ల్‌గా మారింది. ఇది అత్యధిక జనసాంద్రత గ‌ల‌ ప్రాంతం. హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో మిగిలిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి లేదా ప్రభుత్వమే వాటిని వేలంలో అమ్ముతున్న‌ది. అలాకాకుండా ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేదతీరేలా ఖాళీ స్థ‌లాల‌ను పార్క్ లుగా మార్చాలి.

40, 50 ఏండ్ల కింద ఏర్పడ్డ లే అవుట్‌ల‌లో ఖాళీగా ఉన్న పార్క్‌, స్కూల్స్ స్థలాల‌ను బై నంబర్లు వేసి కబ్జా చేస్తున్నారు. అన్ని చోట్ల తనిఖీలు చేసి ప్ర‌భుత్వం వాటిని కాపాడాలి. సివిల్ తగాదాలు, భూ పంచాయతీలకు పోలీస్ స్టేషన్లు అడ్డాలుగా మారడం మంచిది కాదు. గొప్ప పేరున్న తెలంగాణ‌ పోలీస్‌కి ఇది మచ్చ తీసుకువస్తుంది. రెవెన్యూ శాఖ‌ ఈ పని చేయాలి.

కొంద‌రు బ‌డాబాబులు దొంగ డాక్యుమెంట్ సృష్టించి, కోర్టులలో పిటిష‌న్లు వేయ‌డంతోపాటు అధికారులను మేనేజ్ చేసి పేదలను ఇబ్బంది పెడుతున్నారు. సామాన్యులకు ఈ పని చేసి పెడితే మంత్రి శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలి. ఇలాంటి భూముల విషయంలో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి.

ప్రభుత్వం పేదలకు ఎప్పుడో ఏక్ సాల్ పట్టా అని ఇచ్చింది. ఆ భూములు బ్రోకర్లు కబ్జా పెట్టారు. వీటి మీద కూడా స‌ర్కార్‌ దృష్టి పెట్టాలి. ఒకవేళ నిజమైన పేదలు ఆ భూమి మీద ఉంటే వారికి నష్టపరిహారం చెల్లించి, ఆ భూముల‌ను సేకరించాలి తప్ప వారిని తరిమివేయవద్దు.

హెచ్ఎంటీ, ఐడీపీఎల్ భూముల్లో 60 గజాల్లో పేదలు కట్టుకున్న ఇండ్ల‌ను కూలగొట్టద్దు. బడాబాబులు ఆక్రమిస్తే మాత్రం వెనక్కు తీసుకోవాలి. పెదోళ్ళు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్లు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేదనే భావన ప్రజల్లో వచ్చింది. ఇది మంచిది కాదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను కోరారు. చాలా పెద్ద కంపెనీలు ప్రీ బుకింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయు. ఇలాంటి వాటివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటిమీద ఉక్కుపాదం పెట్టాల‌ని సూచించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement