Mettu Sai Kumar | తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓ వసూల్ రాజా: మెట్టు సాయికుమార్
Mettu Sai Kumar | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) ఒక వసూల్ రాజా అని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ (Mettu Sai Kumar) ఆరోపించారు. తలసానికి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గురించి మాట్లాడే స్థాయిలేదని మండిపడ్డారు.
Mettu Sai Kumar | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) ఒక వసూల్ రాజా అని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ (Mettu Sai Kumar) ఆరోపించారు. తలసానికి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గురించి మాట్లాడే స్థాయిలేదని మండిపడ్డారు. గాంధీభవన్ (Gandhi Bhavan)లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ తలసాని తన దందాలు, వసూళ్లను మర్చిపోవాలని సూచించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదు ఆయన తలసాని శ్రీనివాస్ రావు అని ఎద్దేవా చేశారు. తలసాని కేసీఆర్ కుటుంబానికి గుమస్తా అని తీవ్రంగా మండిపడ్డారు. తలసానికి దమ్ము లేదని విమర్శించారు.
రేవంత్ ను టచ్ చేయడం కాదు రేవంత్ కటౌట్‌ను కూడా ఆయన ఏం చేయలేరని దుయ్యబట్టారు. ధమ్కీలు, డాగులకు భయపడేందుకు రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ లాంటి వాడు కాదని అన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్నారని ప్రశంసించారు. సికింద్రాబాద్, సనత్‌నగర్‌లకు తలసాని చేసింది ఏంటో చెప్పాలని సవాల్ చేశారు. ముక్కలు చేస్తామని బీరాలు పలుకుతున్న తలసాని బూడిద కాక తప్పదని హెచ్చరించారు. తలసాని మాటలను సుమోటోగా తీసుకుని, కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సనత్ నగర్‌కు పట్టిన చీడ, పీడ తలసాని అని విమర్శించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



