Sobhita Dhulipala | చీకటిలో ఏం జరిగింది – శోభిత ధూళిపాళ ఓటీటీ మూవీ ట్రైలర్ రిలీజ్
శోభిత హీరోయిన్‌గా నటిస్తున్న చీకటిలో మూవీ టీజర్ సోమవారం రిలీజ్ చేశారు. క్రైమ్ , సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. చీకటిలో మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Jan 12, 2026, 2.14 pm IST
Sobhita Dhulipala | ఓ వైపు సినిమాలు చేస్తూనే అడపాదడపా ఓటీటీలలో మెరుస్తున్నారు నేటితరం నాయికలు. తమన్నా, కాజల్‌తో పాటు చాలా మంది హీరోయిన్లు ఓటీటీలలో తమ లక్‌ను పరీక్షించుకున్నారు. తాజాగా అక్కినేని కోడలు శోభిత కూడా తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ ఓటీటీ మూవీ చేయబోతుంది. చీకటిలో పేరుతో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. చీకటిలో ట్రైలర్ ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. తన స్నేహితుల మరణాల వెనకున్న మిస్టరీని ఛేదించే ధైర్యవంతురాలైన సంధ్య యువతిగా ఈ ట్రైలర్ శోభిత కనిపించింది.
చీకటిలో కథ...
న్యూస్ చానెల్‌లో జాబ్ నచ్చకపోవడంతో మానేసి సొంతంగా చీకటిలో పేరుతో బ్రాడ్‌కాస్టింగ్ చానెల్ పెడుతుంది. మరోవైపు ఓ సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను హత్య చేస్తుంటాడు. ఆ కిల్లర్‌ను పట్టుకోవడానికి సంధ్య తన చీకటిలో చానెల్ ద్వారా ఇన్వేస్టిగేషన్ మొదలుపెడుతుంది. పోలీసులతో పాటు న్యూస్ చానెల్ ప్రతినిధులు ఆమె ఇన్వేస్టిగేషన్‌ను పట్టించుకోకుండా చులకనగా మాట్లాడే సీన్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు...వాడు చీకటిలో వస్తాడు...వాడికి వాళ్లు ఎక్కడ ఉంటాడో తెలుసు... వాళ్లింట్లో ఎవరి లేని టైమ్స్ కూడా తెలుసు...హూ ఈజ్ హి....ట్యాగ్ చేస్తేనే చంపేశాడా...మరిచీకటిలో క్రియేట్ చేసిన సంధ్యను.... అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
చీకటిలో మూవీలో శోభిత ధూళిపాళతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్యకృష్ణ, ఈషా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత శోభిత చేస్తున్న తెలుగు మూవీ ఇది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






