OPPO K14 5G | ఒప్పో నుంచి కె14 5జి స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, కూలింగ్ ఫీచర్..
OPPO K14 5G | మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్ ఫోన్ కె14 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కె సిరీస్‌లో విడుదలైన లేటెస్ట్ ఒప్పో ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లు పొందవచ్చు. అలాగే బడ్జెట్ ధరకే ఈ ఫోన్‌ను అందిస్తున్నారు.
Technology | Published On Mar 18, 2026, 5.31 pm IST
OPPO K14 5G | మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్ ఫోన్ కె14 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కె సిరీస్‌లో విడుదలైన లేటెస్ట్ ఒప్పో ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లు పొందవచ్చు. అలాగే బడ్జెట్ ధరకే ఈ ఫోన్‌ను అందిస్తున్నారు. ఇందులో 6.75 ఇంచుల డిస్‌ప్లే ఉండగా దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. సూర్యకాంతిలోనూ డిస్‌ప్లేను స్పష్టంగా చూసేలా 1125 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16ను అందించారు.
ప్రత్యేకమైన కూలింగ్ ఫీచర్..
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 8జీబీ వరకు ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. అందువల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా వీసీ కూలింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్..
ఈ ఫోన్ కేవలం 8.61 ఎంఎం మందంతో అత్యంత స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. వెనుక భాగాన్ని కూడా ప్రత్యేక మెటీరియల్‌తో రూపొందించారు. అందువల్ల ఫోన్ గ్రిప్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఇందులో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. చార్జర్‌ను కూడా ఫోన్‌తోపాటు ఇస్తున్నారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా, ఇందులో స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇందులో ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు.
ధర, ఆఫర్ల వివరాలు..
ఒప్పొ కె14 5జి స్మార్ట్ ఫోన్‌ను ప్రిజం వైట్, ప్రిజం వయొలెట్, ఐసీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.21,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో మార్చి 20 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఆఫర్లను సైతం అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



