త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oppo Holi Offer | ఒప్పో హోలీ ఆఫ‌ర్‌.. ఫోన్ల‌పై 24 నెల‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని ఈఎంఐ..

Oppo Holi Offer | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో హోలీ పండుగ సంద‌ర్భంగా ఫోన్ల‌పై ప‌లు ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. మార్చి 1 నుంచి 8 వ‌ర‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్లు అందుబాటులో ఉంటాయ‌ని ఒప్పో ఇండియా తెలియ‌జేసింది. ఈ ఆఫ‌ర్ల‌లో భాగంగా ఎంపిక చేసిన ఫోన్ మోడ‌ల్స్‌పై జీరో డౌన్ పేమెంట్‌తోపాటు ఏకంగా 24 నెల‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని ఈఎంఐ ని కూడా అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 28, 2026, 6.38 am IST

Oppo Holi Offer | ఒప్పో హోలీ ఆఫ‌ర్‌.. ఫోన్ల‌పై 24 నెల‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని ఈఎంఐ..
Advertisement

Oppo Holi Offer | మొబైల్స్ త‌యారీదారు ఒప్పో హోలీ పండుగ సంద‌ర్భంగా ఫోన్ల‌పై ప‌లు ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. మార్చి 1 నుంచి 8 వ‌ర‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్లు అందుబాటులో ఉంటాయ‌ని ఒప్పో ఇండియా తెలియ‌జేసింది. ఈ ఆఫ‌ర్ల‌లో భాగంగా ఎంపిక చేసిన ఫోన్ మోడ‌ల్స్‌పై జీరో డౌన్ పేమెంట్‌తోపాటు ఏకంగా 24 నెల‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని ఈఎంఐ ని కూడా అందిస్తున్నారు. అలాగే ప‌లు స్మార్ట్ ఫోన్ మోడ‌ల్స్‌పై బ్యాంకు, యూపీఐ లావాదేవీల‌తో క్యాష్ బ్యాక్‌ను కూడా ఇస్తున్నారు. మేక్ యువ‌ర్ మూమెంట్ అనే వ్యూహంలో భాగంగా ఈ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ఒప్పో తెలిపింది.

ఏయే ఫోన్ల‌పై అంటే..

ఒప్పో నిర్వ‌హిస్తున్న ఈ ప్ర‌త్యేక సేల్‌లో ఒప్పో రెనో 15 ప్రొ మినీ ఫోన్‌కు చెందిన 256జీబీ, 512జీబీ వేరియెంట్ల‌ను 24 నెల‌ల కాలానికి గాను వ‌డ్డీ లేని ఈఎంఐతో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఒప్పో ఫైండ్ ఎక్స్‌9 ఫోన్‌కు చెందిన 12జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ మోడ‌ల్స్‌ను 18 నెల‌ల‌కు వ‌డ్డీ లేని ఈఎంఐతో కొన‌వ‌చ్చు. ఒప్పో రెనో 15కు చెందిన 8జీబీ+512జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ మోడ‌ల్స్‌ను 15 నెల‌ల కాలానికి వ‌డ్డీ లేని ఈఎంఐతో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఒప్పో ఎ6 ప్రొకు చెందిన 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ మోడ‌ల్స్‌పై 8 నెల‌లు, ఒప్పో ఎ6కు చెందిన‌ 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 6జీబీ+256జీబీ మోడ‌ల్స్‌పై 6 నెలల కాలానికి వ‌డ్డీ లేని ఈఎంఐని అందిస్తున్నారు.

ఈ ఫోన్ల‌ను జీరో డౌన్ పేమెంట్‌తో కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని ఒప్పో తెలిపింది. వినియోగ‌దారులు కోట‌క్ మ‌హీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఇక ఈఎంఐ లేదా నాన్‌-ఈఎంఐ లావాదేవీల‌పై వినియోగ‌దారుల‌కు 10 శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా ఇస్తున్నారు. అన్ని ఎంపిక చేసిన ప్ర‌ధాన బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌పై ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంది. యూపీఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement