త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OPPO A6 5G | వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన ఒప్పొ ఎ6 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

OPPO A6 5G | ఒప్పో భారత మార్కెట్‌లో తన కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎ6 5జి ని తాజాగావిడుదల చేసింది. గత ఏడాది వచ్చిన ఎ5 5జి ఫోన్ కి కొన‌సాగింపుగా దీన్ని విడుద‌ల చేశారు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచు హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా దీనికి 120హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు.

S

Technology | Published On Jan 23, 2026, 6.29 am IST

OPPO A6 5G  | వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన ఒప్పొ ఎ6 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

OPPO A6 5G | ఒప్పో భారత మార్కెట్‌లో తన కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎ6 5జి ని తాజాగావిడుదల చేసింది. గత ఏడాది వచ్చిన ఎ5 5జి ఫోన్ కి కొన‌సాగింపుగా దీన్ని విడుద‌ల చేశారు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచు హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా దీనికి 120హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌కు ఐపీ66, ఐపీ68, ఐపీ69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్‌ను కూడా అందిస్తున్నారు. 80 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి నీటిని కూడా తట్టుకునేలా ఈ ఫోన్ రూపొందించబడిందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 6జీబీ, 8జీబీ ర్యామ్‌ ఆప్షన్లతో అందుబాటులోకి తెచ్చారు. ఈ డివైస్‌లో ప్ర‌త్యేకంగా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. దీని వల్ల భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్‌ను కూడా గంటల తరబడి ఆడినా ఫోన్ వేడెక్కకుండా పనిచేస్తుందని ఒప్పో పేర్కొంది.

భారీ బ్యాట‌రీ..

కెమెరా విభాగంలో ఒప్పో ఎ6 5జి డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే 7000ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుండగా, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ కనీసం ఐదేళ్ల పాటు స్థిరమైన ప్ర‌ద‌ర్శ‌న‌ అందిస్తుందని కంపెనీ తెలియ‌జేసింది. ఒప్పో ఎ6 5జి లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత క‌ల‌ర్ ఓఎస్ 15ను ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 5జి నెట్‌వర్క్, వైఫై 6,  బ్లూటూత్ 5.4, USB టైప్-సి వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ధర విషయానికి వస్తే, ఒప్పో ఎ6 5జి స్మార్ట్‌ఫోన్ సకురా పింక్, ఐస్ వైట్, సఫైర్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర‌ను రూ.21,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్ ప్రస్తుతం ఒప్పో అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ రిటైల్  స్టోర్ల‌లోనూ అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1వేయి వ‌ర‌కు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, అలాగే 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement