OnePlus Freedom Sale | రిపబ్లిక్ డే సందర్భంగా వన్‌ప్లస్ ఫ్రీడం సేల్.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
OnePlus Freedom Sale | గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మొబైల్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఫ్రీడం సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది.
Technology | Published On Jan 13, 2026, 9.33 am IST
OnePlus Freedom Sale | గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మొబైల్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఫ్రీడం సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. జనవరి 16వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా, ఇందులో అనేక వన్ ప్లస్ ఫోన్లతోపాటు పలు వన్ ప్లస్ ఉత్పత్తులపై కూడా భారీ ఎత్తున రాయితీలను అందిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే వన్ ప్లస్ లాంచ్ చేసిన వన్ ప్లస్ 15 ఫోన్లను కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు. వన్ ప్లస్ 15 సిరీస్‌కు చెందిన ఫోన్ల ప్రారంభ ధర రూ.72,999 ఉండగా, ఈ ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తున్నారు.
తక్కువ ధరకే వన్‌ప్లస్ 15..
ఈ సేల్‌లో వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్‌ను రూ.3వేల బ్యాంకు డిస్కౌంట్ అనంతరం రూ.44,999 ధరకు అందిస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ అనంతరం మళ్లీ ఈ ఫోన్ ధర యథాతథంగా ఉంటుందని కంపెనీ తెలియజేసింది. కనుక జనవరి 16 నుంచి 26వ తేదీ వరకు కేవలం 10 రోజుల వరకు మాత్రమే ఈ సేల్‌ను నిర్వహిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 15 ఫోన్‌ను రూ.68,999 ధరకు కొనవచ్చు. దీనికి గాను నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందించనున్నారు. కేవలం ఫోన్లపై మాత్రమే కాకుండా ఈ సేల్‌లో వన్ ప్లస్ ట్యాబ్‌లపై కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. ఇందులో భాగంగా వన్ ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్‌ను డిస్కౌంట్ అనంతరం రూ.23,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఉచితంగా స్టైలస్ పెన్ కూడా లభిస్తుంది.
ట్యాబ్‌లపై కూడా..
ఈ సేల్‌లో వన్ ప్లస్ ప్యాడ్ 3 ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను డిస్కౌంట్ అనంతరం రూ.44,999 ధరకు విక్రయిస్తున్నారు. అలాగే వన్‌ప్లస్‌కు చెందిన ఆడియో ఉత్పత్తులపై కూడా రాయితీలను పొందవచ్చు. ముఖ్యంగా వన్ ప్లస్ బడ్స్ ప్రొ 3 ఇయర్ బడ్స్‌ను డిస్కౌంట్ అనంతరం రూ.9,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ సేల్ ను ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం లేకుండా వన్ ప్లస్ నిర్వహిస్తోంది. అంటే ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా సరే వన్ ప్లస్ ప్రొడక్ట్స్ వేటిని తీసుకున్నా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ క్రమంలోనే ఈ సేల్ వన్ ప్లస్ వెబ్‌సైట్‌తోపాటు వన్ ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు, రిటెయిల్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉందని కంపెనీ తెలియజేసింది. ఆయా ప్రొడక్ట్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లతోపాటు రాయితీలను కూడా అందిస్తున్నారు. అలాగే పలు ప్రొడక్ట్స్‌ను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే వీలు కల్పించారు.
ధరల వివరాలు ఇలా..
వన్‌ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ ధర రూ.72,999 ఉండగా ఈ సేల్‌లో దీనిపై రూ.4వేల డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.68,999కు కొనవచ్చు. అలాగే వన్‌ప్లస్ 15ఆర్‌ను రూ.3వేల డిస్కౌంట్ అనంతరం రూ.44,999కు, వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్‌ను డిస్కౌంట్ పోగా రూ.30,999 ధరకు అందిస్తున్నారు. అలాగే వన్ ప్లస్ నార్డ్ సీఈ5 ఫోన్‌ను రూ.22,999కు, వన్‌ప్లస్ 13 ఫోన్‌ను రూ.57,999కు, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌ను రూ.37,999కు కొనవచ్చు. వన్‌ప్లస్ 13ఎస్ (రూ.49,999), వన్‌ప్లస్ బడ్స్ 4 (రూ.4,999), వన్‌ప్లస్ బడ్స్ ప్రొ 3 (రూ.9,999), వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 (రూ.1699), వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రొ (రూ.2349), వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3ఆర్ (రూ.1449), వన్‌ప్లస్ ప్యాడ్ 2 (రూ.34,999), ప్యాడ్ గో (రూ.13,999), ప్యాడ్ లైట్ (రూ.11,999), ప్యాడ్ 3 (రూ.44,999) ప్యాడ్ గో 2 (రూ.23,999) తదితర డివైస్‌లను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు వన్ ప్లస్ వెబ్‌సైట్‌లోని సేల్ పేజ్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



