త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OnePlus 15R | వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ వ‌చ్చేసింది.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌.. ధ‌ర ఎంతంటే..?

S

Technology | Published On Dec 18, 2025, 7.29 am IST

OnePlus 15R | వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ వ‌చ్చేసింది.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌.. ధ‌ర ఎంతంటే..?

Finance and money: loans, credit cards, LIC, savings schemes, stock basics, gold investment, insurance.​

Advertisement

OnePlus 15R | మొబైల్స్ త‌యారీ కంపెనీ వ‌న్‌ప్ల‌స్ త‌న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వ‌న్ ప్ల‌స్ 15ఆర్‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. వ‌న్‌ప్ల‌స్‌కు చెందిన లేటెస్ట్ టాప్ ఎండ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇక ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీంట్లో ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారిత ఆక్సిజ‌న్ ఓఎస్ 16 ల‌భిస్తుంది. పూర్తిగా ఏఐతో అనుసంధానిస్తూ ఈ ఓఎస్‌ను తీర్చిదిద్దారు. క‌నుక ఈ ఫోన్‌లో ప‌లు అద్భుత‌మైన ఏఐ ఫీచ‌ర్ల‌ను వినియోగ‌దారులు వాడుకోవ‌చ్చు. ముఖ్యంగా ఫోన్ స్మూత్‌గా ప‌నిచేసేందుకు, ఇంటెల్లిజెంట్ లాంగ్వేజ్ టూల్స్‌, ఇమేజింగ్ స‌పోర్ట్ కోసం ఏఐ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. గూగుల్‌కు చెందిన ఏఐ అసిస్టెంట్ జెమిని సేవ‌ల‌ను ఈ ఫోన్‌కు అనుసంధానం చేశారు. క‌నుక ఆ సేవ‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఫోన్‌కు గాను 4 మేజ‌ర్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామ‌ని వ‌న్ ప్ల‌స్ తెలియ‌జేసింది.

అద్భుత‌మైన డిస్‌ప్లే..

వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ స్మార్ట్ ఫోన్‌లో అదిరిపోయే డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 6.83 ఇంచుల సైజ్‌ను క‌లిగి ఉంది. అమోలెడ్ త‌ర‌హా డిస్‌ప్లే క‌నుక అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. దృశ్యాలు అత్యంత నాణ్యంగా ఉంటాయి. అలాగే ఈ డిస్‌ప్లే ఏకంగా 1.5కె రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. గ‌రిష్టంగా 165 హెడ్జ్ వ‌ర‌కు రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. క‌నుక సినిమాలు చూసేట‌ప్పుడు, గేమ్స్ ఆడేట‌ప్పుడు అద్భుత‌మైన ఫీలింగ్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా క‌నిపించేలా దీనికి 1800 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 5 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 12జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. 512జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ను అందిస్తున్నారు. హీట్‌ను బ‌య‌ట‌కు పంపేందుకు ప్ర‌త్యేకంగా 3డి వేప‌ర్ చాంబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. క‌నుక ఫోన్ ను ఎంత తీవ్రంగా ఉప‌యోగించిన‌ప్ప‌టికీ అంత త్వ‌ర‌గా హీట్‌కు గురి కాదు. ఇది గేమ‌ర్ల‌కు ఎంతో స‌హాయం చేస్తుంది.

ప్ర‌త్యేక వైఫై చిప్‌..

ఈ ఫోన్ లో వైఫై కోసం ప్ర‌త్యేకంగా వైఫై చిప్‌ను అందించ‌డం విశేషం. దీని వ‌ల్ల వైఫైకి ఎలాంటి అంత‌రాయం లేకుండా చాలా స్మూత్‌గా హైస్పీడ్ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఇక టీపీ లింక్ అనే సంస్థ‌తో వ‌న్ ప్ల‌స్ భాగ‌స్వామ్యం అయినందున ఆ కంపెనీ రూట‌ర్‌కు ఈ ఫోన్‌ను క‌నెక్ట్ చేస్తే ఎంతో స్మూత్‌గా ప‌నిచేస్తుంది. హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాల స‌హాయంతో 4కె వీడియోల‌ను అత్య‌ధిక ఫ్రేమ్ రేట్‌తో చిత్రీకరించుకోవ‌చ్చు. ఏకంగా 120ఎఫ్‌పీఎస్ వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ను చార్ కోల్ బ్లాక్‌, మింట్ బ్రీజ్‌, ఎల‌క్ట్రిక్ వయోలెట్ అనే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేశారు.

భారీ బ్యాట‌రీ..

వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ స్మార్ట్ ఫోన్ ఐపీ69కె డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ప్రొటెక్ష‌న్‌ను క‌లిగి ఉంది. ఇందులో 7400 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇచ్చారు. యూజ‌ర్లు ఈ ఫోన్‌ను ఎక్కువ స‌మ‌యం పాటు ఉప‌యోగించుకునేలా బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా వ‌చ్చేలా ఈ ఫోన్‌ను తీర్చిదిద్దిన‌ట్లు తెలిపారు. ఈ ఫోన్‌కు 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ల‌భిస్తుంది. క‌నుక దీన్ని వేగంగా చార్జింగ్ చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఇందులో డ్యుయ‌ల్ సిమ్ ల‌ను వేసుకోవ‌చ్చు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.47,999 ఉండ‌గా, 16జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌రను రూ.52,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌ను వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌, వ‌న్‌ప్ల‌స్ స్టోర్ యాప్‌, అమెజాన్‌, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో డిసెంబ‌ర్ 22 నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్‌కు ప్రీ బుకింగ్స్‌ను ప్ర‌స్తుతం ప్రారంభించారు. ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.2,299 విలువైన వ‌న్ ప్ల‌స్ నార్డ్ బ‌డ్స్ 3 ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఉచితంగా ఇస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.3వేల వ‌ర‌కు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అలాగే ఈజీ ఈఎంఐ ఆప్ష‌న్ కూడా ఉంది. 6 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి 180 రోజుల పాటు ఫోన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌, లైఫ్ టైం డిస్‌ప్లే వారంటీ ల‌భిస్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement