మరోసారి మొరాయించిన క్లౌడ్ ఫ్లేర్ సర్వర్లు.. బుక్ మై షో, జిరోధా, గ్రో సహా పలు ప్రముఖ వెబ్ సైట్ల సేవలకు అంతరాయం..
Technology | Published On Dec 5, 2025, 11.59 am IST
ప్రముఖ ఇంటర్నెట్ అండ్ నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ ఫ్లేర్ సేవలకు మరోమారు ఆటంకం ఏర్పడింది. క్లౌడ్ ఫ్లేర్ సర్వర్లు మొరాయించడంతో దేశంలోని పలు ప్రముఖ వెబ్‌సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. క్లౌడ్ ఫ్లేర్ సర్వర్లలో ఏర్పడిన సమస్య కారణంగా కాన్వా, బుక్ మై షో, లింక్డ్ ఇన్, నోషన్, గ్రో, స్పేస్ ఎక్స్, జిరోధా, కాయిన్ బేస్ వంటి పలు ప్రముఖ సైట్లు కాసేపు నిలిచిపోయాయి. దీంతో యూజర్లకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా గతంలోనూ నవంబర్ 18వ తేదీన క్లౌడ్ ఫ్లేర్ లో సరిగ్గా ఇలాంటి సమస్యే వచ్చి అప్పుడు కూడా పలు సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. అప్పట్లో క్లౌడ్ ఫ్లేర్ సర్వర్ల సమస్య వల్ల ఓపెన్ ఏఐకు చెందిన చాట్ జీపీటీతోపాటు క్లౌడ్ ఏఐ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.
కాగా శుక్రవారం నాడు తలెత్తిన సమస్య గత మూడు వారాల్లో రెండో సారి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే క్లౌడ్ ఫ్లేర్ సర్వర్ల సేవలను ఉపయోగించుకుంటున్న అనేక సైట్లు కాసేపు పనిచేయలేదు. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్ సైట్లను ఓపెన్ చేసినప్పుడు 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ (క్లౌడ్ ఫ్లేర్) అనే మెసేజ్ దర్శనమిచ్చింది. అయితే బుక్ మై షో సేవలను కాసేపటికి పునరుద్ధరించినట్లు యాజమాన్యం తెలియజేసింది. ఇక ఈ సమస్యపై మరోవైపు క్లౌడ్ ఫ్లేర్ కూడా స్పందించింది. తాము సమస్యను గుర్తించామని, అందుకు తగిన విధంగా సాఫ్ట్ వేర్, సర్వర్‌లను అప్ డేట్ చేస్తున్నామని, సమస్య తొలగిపోతుందని తెలియజేసింది.
అయితే క్లౌడ్ ఫ్లేర్ సర్వర్లను ఉపయోగించుకుంటున్న అనేక బ్రోకరేజ్ సంస్థలు కూడా శుక్రవారం పనిచేయలేదు. ముఖ్యంగా గ్రో, జిరోధా, అప్ స్టాక్స్ వంటి బ్రోకరేజీ సంస్థలకు చెందిన సైట్లు ఎర్రర్ మెసేజ్‌లను చూపించాయి. దీంతో ట్రేడింగ్ చేసే వినియోగదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని గ్రో సంస్థ ఎక్స్ ద్వారా తెలియజేసింది. అలాగే ఆన్ లైన్ ఫొటో ఎడిటింగ్ సైట్ కాన్వా కూడా ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తమ వినియోగదారులకు తెలియజేసింది. గతంలో క్లౌడ్ ఫ్లేర్ సర్వర్లలో సమస్యలు ఏర్పడినప్పుడు చాట్ జీపీటీతోపాటు ఎక్స్, క్లౌడ్, పర్‌ప్లెక్సిటీ వంటి సైట్ల సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. అయితే క్లౌడ్ ఫ్లేర్ లో ఇలా జరగడం మూడు వారాల్లో ఇది రెండోసారి కావడంతో అనేక వెబ్ సైట్ల నిర్వాహకులు, యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై క్లౌడ్ ఫ్లేర్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ ప్రిన్స్ స్పందించారు. 2019 తరువాత మళ్లీ ఇప్పుడే తమ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. టెక్ సంస్థలకు చెందిన వెబ్ సైట్లలోని డేటాబేస్ సిస్టమ్స్‌లో పర్మిషన్స్‌లో తీసుకొచ్చిన మార్పుల కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందని, దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని తెలిపారు.
సంబంధిత వార్తలు

Nithin Kamath | బ్రోకరేజీ సంస్థలకు జీరోధా నితిన్ కామత్ హెచ్చరిక.. ఎంటీఎఫ్లపై అంత ఎక్స్పోజర్ వద్దు..
మే 20, 2026

TRAI | దేశవ్యాప్తంగా రానున్న పబ్లిక్ వైఫై.. అభిప్రాయాలను స్వీకరిస్తున్న ట్రాయ్..
ఏప్రిల్ 28, 2026

Internet Services | ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంటర్నెట్ సేవలపై పడనుందా..? ఇంటర్నెట్ పోతే పరిస్థితేంటి..?
ఏప్రిల్ 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



