Internet Services | ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంటర్నెట్ సేవలపై పడనుందా..? ఇంటర్నెట్ పోతే పరిస్థితేంటి..?
Internet Services | మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇరాన్‌పై తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
International | Published On Apr 3, 2026, 5.33 pm IST
Internet Services | మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇరాన్‌పై తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే ఇది చాలదన్నట్లు ఇంకో కొత్త ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర అడుగున విస్తరించి ఉన్న కీలక ఫైబర్-ఆప్టిక్ కేబుళ్ల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం ప్రాంతాల్లో సముద్ర గర్భంలో ఉన్న ఈ కేబుళ్లు ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు కీలకంగా మారాయి. ఈ కేబుళ్లకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
60 శాతం గల్ఫ్ మార్గం నుంచే..
ఈ డిజిటల్ యుగంలో సముద్ర అడుగున ఉన్న కేబుళ్లు అంతర్జాతీయ కనెక్టివిటీకి పునాది లాంటివి. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 99 శాతం ఈ సబ్‌మరైన్ కేబుళ్ల ద్వారానే కొనసాగుతుంది. ఇరాన్ ఈ యుద్ధ సమయంలో కేబుల్ మౌలిక సదుపాయాలను నేరుగా లక్ష్యంగా చేసుకోకపోయినప్పటికీ ఎర్ర సముద్రం ప్రాంతంలో ముప్పు పెరుగుతోందన్న ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ మద్దతు ఉన్న హౌతి తిరుగుబాటు దళాలు ఈ ప్రాంతంలో ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లను కత్తిరిస్తామని పలుమార్లు హెచ్చరించాయి. భారత్‌కు ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశంలోని సుమారు 60 శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్ ముంబై నుంచి యూరప్‌కు వెళ్లే గల్ఫ్ మార్గం మీద ఆధారపడుతోంది. మిగిలిన ట్రాఫిక్ చెన్నై నుంచి సింగపూర్, పసిఫిక్ మార్గాల ద్వారా సాగుతుంది. దీంతో భారత ఇంటర్నెట్ వ్యవస్థలో ప్రధాన భాగం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
17 సబ్‌మరైన్ కేబుళ్లు..
ఎర్ర సముద్రం ప్రాంతంలో కేబుల్ నష్టాలు గతంలో కూడా నమోదయ్యాయి. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఈ ముప్పును మరింత పెంచాయి. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం సముద్ర అడుగున ఉన్న మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ స్థాయిలో కొత్త ముప్పుగా పరిగణిస్తున్నారు. ఎర్ర సముద్రం ద్వారా సుమారు 17 సబ్‌మరైన్ కేబుళ్లు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఫైబర్-ఆప్టిక్ కోర్, కాపర్ వైర్లు, రక్షణ పొరలతో కూడిన ఈ కేబుళ్లు ప్రతి ఒక్కటి సగటున 100 గిగాబైట్ల డేటాను ప్రసారం చేస్తాయి. ఒక కేబుల్ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు ఒక సంవత్సరం పడుతుంది. ఈ కేబుళ్లు దెబ్బతిన్నా పూర్తిగా ఇంటర్నెట్ నిలిచిపోదు, ఎందుకంటే ఇది ఒకే మార్గంపై ఆధారపడదు. వివిధ మార్గాల ద్వారా డేటా ప్రవహిస్తుంది. ఒక మార్గం నిలిచిపోతే ట్రాఫిక్ ను ఇతర మార్గాలకు మళ్లిస్తారు. అయితే తాత్కాలిక అంతరాయం కూడా టెలికాం సంస్థలకు ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది. సేవల నాణ్యత, ట్రాఫిక్ నిర్వహణ, మరమ్మత్తులపై ప్రభావం పడుతుంది.
ఇంటర్నెట్ ఆగిపోదు, కానీ..
లైట్‌స్టార్మ్ టెలికాం కనెక్టివిటీ సంస్థ సీఈవో అమజిత్ గుప్తా స్పందిస్తూ ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు కానీ వేగం తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ సమస్య ఎక్కువకాలం కొనసాగితే ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేబుల్ నష్టం జరిగితే ట్రాఫిక్ ను ఇతర మార్గాలకు మళ్లిస్తారని, దీనివల్ల ఆ మార్గాలు కూడా రద్దీగా మారి ఇంటర్నెట్ వేగం తగ్గుతుందని తెలిపారు. మరమ్మత్తులు ఆలస్యమైతే ఆన్‌లైన్ లావాదేవీలు నెమ్మదిగా సాగడం, వీడియోలు బఫర్ అవడం, డౌన్‌లోడ్-అప్‌లోడ్ వేగాలు తగ్గడం, యాప్స్ స్పందన ఆలస్యమవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు. ప్రత్యేకంగా గ్లోబల్ కంపెనీలు, టెక్నాలజీ సర్వీసులు అందించే సంస్థలు ఈ ప్రభావాన్ని ఎక్కువగా అనుభవిస్తాయని తెలిపారు. దీంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bandi Sanjay Karimnagar | కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్
- ●Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!
- ●Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం
- ●OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..
- ●Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!
- ●Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు

Bandi Sanjay Karimnagar | కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్

Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!

Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం

OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..






