Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్.. ఇకపై 5 హ్యాష్ ట్యాగ్‌లకు మాత్రమే అనుమతి..
2011లో ఇన్ స్టాగ్రామ్‌లో తొలిసారిగా హ్యాష్ ట్యాగ్‌లను ప్రవేశపెట్టారు. యూజర్లకు కావల్సిన కంటెంట్ మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు గాను ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Technology | Published On Dec 19, 2025, 11.55 am IST
Instagram | ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఏ విధంగా పేరుగాంచిందో అందరికీ తెలిసిందే. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో విహరిస్తుండడంతో ఈ ప్లాట్‌ఫామ్ బాగా పాపులర్ అయింది. గతంలో టిక్‌టాక్ ఉన్న సమయంలో ఇన్ స్టాగ్రామ్‌కు పెద్దగా ఆదరణ లేదు. కానీ ఆ తరువాత టిక్‌టాక్‌ను నిషేధించడం, ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్‌ను ప్రవేశపెట్టడంతో ఈ ప్లాట్ ఫామ్‌కు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది ఇన్‌స్టాలో రీల్స్ పెడుతూ సందడి చేస్తున్నారు. అలాగే చాలా మంది ఇందులో ఇన్ ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. నెల నెలా లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. అయితే యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఇన్ స్టాగ్రామ్ ఓ కొత్త రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ఇకపై లెక్కకు మించి హ్యాష్ ట్యాగ్‌లను ఇవ్వడం కుదరదు. దీనిపై ఇన్ స్టాగ్రామ్ పరిమితులను విధించింది.
5 హ్యాష్ ట్యాగ్‌లకు మాత్రమే..
ఇన్ స్టాగ్రామ్‌లో ఏదైనా రీల్ లేదా పోస్టును పబ్లిష్ చేస్తే అది యూజర్లకు మరింత ఎక్కువగా రీచ్ అయ్యేందుకు గాను యూజర్లు హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో హ్యాష్ ట్యాగ్‌లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కావల్సిన కంటెంట్‌ను వెదకడం కోసం యూజర్లకు, యూజర్లకు కావల్సిన కంటెంట్‌ను చూపించడం కోసం ప్లాట్ ఫామ్‌లకు ఈ హ్యాష్ ట్యాగ్‌లు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇన్ స్టాగ్రామ్‌లో హ్యాష్ ట్యాగ్‌లకు గాను ఇకపై పరిమితి విధించారు. ఒక పోస్టు లేదా రీల్‌కు గాను యూజర్లు ఇకపై కేవలం 5 హ్యాష్ ట్యాగ్‌లను మాత్రమే పెట్టేందుకు అనుమతి ఉంటుంది. ఇంతకు మించి హ్యాష్ ట్యాగ్‌లను ఇవ్వలేరు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ తాజాగా వెల్లడించింది.
స్పామ్‌కు అడ్డుకట్ట వేసేందుకే..
2011లో ఇన్ స్టాగ్రామ్‌లో తొలిసారిగా హ్యాష్ ట్యాగ్‌లను ప్రవేశపెట్టారు. యూజర్లకు కావల్సిన కంటెంట్ మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు గాను ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో అందులో ఇప్పటి వరకు ఒక పోస్ట్ లేదా రీల్‌కు 30 వరకు హ్యాష్ ట్యాగ్‌లను ఇచ్చుకునే వీలు ఉండేది. కానీ దీన్ని ప్రస్తుతం ఐదుకు కుదించినట్లు తెలిపారు. కనుక ఇకపై ఇన్‌స్టా రీల్స్ లేదా పోస్టులకు యూజర్లు కేవలం 5 హ్యాష్ ట్యాగ్‌లను మాత్రమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి ఇవ్వడం కుదరదు. అయితే దీన్ని కేవలం 3 కే పరిమితం చేయాలని భావించారు. కానీ సంఖ్య మరీ తక్కువ అవుతుందని 5 చేశారు. దీని వల్ల యూజర్లు తమ కంటెంట్‌కు సరైన హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారని, స్పామ్‌కు అడ్డుకట్ట వేయవచ్చని ఇన్ స్టాగ్రామ్ తెలియజేసింది.
అయితే ఇన్ స్టాగ్రామ్‌లో అసలు హ్యాష్ ట్యాగ్‌లు పనిచేయవని, కంటెంట్ వైరల్ అయ్యే క్రమాన్ని బట్టి రీచ్ పెరుగుతుందని, హ్యాష్ ట్యాగ్‌లతో పెద్దగా ఉపయోగం ఉండదని, అవి కేవలం కంటెంట్ డిస్కవరీ కోసమే పనిచేస్తాయని, రీచ్ కోసం పనిచేయవని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడం మోసెరి తెలిపారు. అయినప్పటికీ చాలా మంది అధిక మొత్తంలో హ్యాష్ ట్యాగ్‌లను వాడుతున్నారని, దీని వల్ల స్పామ్ పెరిగిపోతుందన్నారు. కనుకనే ఈ పరిమితి విధించినట్లు తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






