Meta | మెటా ఉద్యోగులను కలవరపెడుతున్న మే 20.. 8వేల ఉద్యోగాల కోత..
Meta | ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మెటా మరోమారు ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతోంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 8వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. మే 20 నుంచి తొలిదశ లేఆఫ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ తెలిపింది.
Technology | Published On May 18, 2026, 5.31 pm IST
Meta | ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మెటా మరోమారు ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతోంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 8వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. మే 20 నుంచి తొలిదశ లేఆఫ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ తెలిపింది. ఈ డెడ్‌లైన్ దగ్గరపడుతున్న కొద్దీ కంపెనీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మాజీ మెటా ఉద్యోగి అడెల్ వూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె తెలిపిన ప్రకారం కంపెనీలో పని చేస్తున్న చాలామంది ఉద్యోగులు భయంతో ఉన్నారని, కొందరు లేఆఫ్‌లో పేరు వస్తే మంచిదే అని ఎదురుచూస్తుండగా, మరికొందరు ఉద్యోగం కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారని వెల్లడించింది. ఇప్పటికీ అక్కడ పని చేస్తున్న తన స్నేహితులు ఇద్దరు పలు విధాలుగా ఆలోచిస్తున్నారని, కొందరు లేఆఫ్ కోసం ఎదురుచూస్తున్నారని, మరికొందరు ఈ ఉద్యోగమే తమ జీవనాధారం కావడంతో తీవ్ర టెన్షన్‌లో ఉన్నారని పేర్కొంది.
మరిన్ని కోతలు జరిగే అవకాశం..
అలాగే మెటాలో చోటుచేసుకున్న తొలి భారీ లేఆఫ్స్ సమయంలో జరిగిన ఘటనలను కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఉద్యోగులు ఆఫీసులో లభించే ఉచిత స్నాక్స్, డ్రింక్స్, ఛార్జర్లు వంటి వస్తువులను బ్యాగుల్లో నింపుకుంటూ వెళ్లారని తెలిపింది. ఆ మొదటి పెద్ద లేఆఫ్ ముందు రాత్రి పరిస్థితి డూమ్స్‌డేలా అనిపించిందని, ఉద్యోగులు ఉచిత స్నాక్స్, డ్రింక్స్, ఛార్జర్లు అన్నీ బ్యాగుల్లో వేసుకుని వెళ్లిపోయారని, బిగ్ టెక్‌లో అది చాలా విచిత్రమైన సమయం అని ఆమె చెప్పింది. మే 20 తర్వాత కూడా మెటా మరిన్ని ఉద్యోగ కోతలు చేపట్టే అవకాశం ఉందని రాయిటర్స్ ఇప్పటికే వెల్లడించింది. ముఖ్యంగా ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చని సమాచారం. కాగా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కంపెనీ కార్యకలాపాలను ఏఐ ఆధారిత సామర్థ్యాల దిశగా మలచేందుకు పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగ కోతలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇతర సంస్థలు కూడా అదే దారిలో..
మెటా మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. అమెజాన్ సహా పలు ప్రముఖ సంస్థలు ఇటీవల నెలల్లో దాదాపు 30వేల ఉద్యోగులను తొలగించాయి. మెటా లేఆఫ్స్ వార్తలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉద్యోగులు ఆఫీస్ వస్తువులను తీసుకెళ్లడాన్ని కొందరు ట్రామా బాండింగ్ గా అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో చెప్పుకునే విచిత్ర అనుభవంగా ఇది మిగిలిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేఆఫ్ వార్తల తర్వాత బ్యాగుల్లో ఉచిత వస్తువులు నింపుకోవడం వింతగా ఉందని, కానీ మెటాలో వింతలకే కొదవలేదని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఉదయం 3 గంటలకు లేచి ఇన్‌బాక్స్‌లో వచ్చే డూమ్ ఈమెయిల్ కోసం ఎదురు చూసిన రోజులు గుర్తొస్తున్నాయని, అది నిజంగా ట్రామా బాండింగ్‌లాంటిదేనని, కానీ భవిష్యత్తులో చెప్పుకునే క్రేజీ స్టోరీ అవుతుందని అంటున్నారు.
సంబంధిత వార్తలు

Tech Industry Layoffs | “బాత్రూమ్లో ఒంటరిగా ఏడుస్తున్నాం”.. లేఆఫ్స్ భయంతో వణికిపోతున్న Meta, LinkedIn టెకీలు!
మే 20, 2026

Meta Layoffs | మెటాలో మొదలైన లేఆఫ్స్.. ఉదయం 4 గంటలకే మెయిల్స్
మే 20, 2026

Standard Chartered CEO Bill Winters | ఏఐ దెబ్బకు బ్యాంకు ఉద్యోగాలు ఔట్? స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో సంచలనం..
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



