త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 18 Pro | క్యూలో నిల‌బ‌డాల్సిన ప‌నిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివ‌రీ..

iPhone 18 Pro | యాపిల్‌ తాజా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ ల‌కు గాను భారత మార్కెట్లో అధికారికంగా అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. శుక్ర‌వారం నుంచి ఈ రెండు మోడళ్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ యాపిల్‌ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల‌తోపాటు బ్లింకిట్‌ వంటి క్విక్‌ కామర్స్‌ వేదికల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.

S

Technology | Published On Sep 18, 2026, 4.18 pm IST

iPhone 18 Pro | క్యూలో నిల‌బ‌డాల్సిన ప‌నిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివ‌రీ..
Advertisement

iPhone 18 Pro | యాపిల్‌ తాజా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ ల‌కు గాను భారత మార్కెట్లో అధికారికంగా అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. శుక్ర‌వారం నుంచి ఈ రెండు మోడళ్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ యాపిల్‌ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల‌తోపాటు బ్లింకిట్‌ వంటి క్విక్‌ కామర్స్‌ వేదికల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. బ్లింకిట్‌లో ఐఫోన్ 18 ప్రొ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్‌ రెండూ 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో లభిస్తున్నాయి. అయితే కొనుగోలుదారు ఉన్న ప్రాంతం, స్థానిక స్టాక్‌ ఆధారంగా రంగులు, స్టోరేజ్‌ వేరియంట్లు, డెలివరీ సమయాల్లో మార్పులు ఉంటాయి.

10 నిమిషాల్లోనే డెలివ‌రీ..

త్వరిత డెలివరీ విషయంలో బ్లింకిట్‌తోపాటు జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కూడా ముందుకొచ్చాయి. ఎంపిక చేసిన నగరాల్లో వినియోగదారుల ఇంటి వద్దకే ఐఫోన్‌ల‌ను డెలివరీ చేస్తున్నాయి. స్థానికంగా స్టాక్‌ అందుబాటులో ఉంటే ఆర్డర్‌ చేసిన సుమారు 10 నుంచి 15 నిమిషాల్లోనే ఫోన్‌ డెలివరీ అవుతున్నట్లు ఆయా సంస్థ‌లు తెలిపాయి. బ్లింకిట్‌ ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌, జైపూర్‌, లక్నో నగరాల్లో ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్‌ల‌ను అందిస్తోంది. ఇందుకోసం యాపిల్‌ అధీకృత రీసెల్లర్లైన యూనికార్న్‌, ఇమాజిన్‌ వంటి సంస్థలతో బ్లింకిట్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఆర్డర్లు నేరుగా వినియోగదారులకు డెలివరీ చేస్తున్నారు.

బ్యాంకు ఆఫ‌ర్లు సైతం..

క్విక్‌ కామర్స్‌ వేదికల ద్వారా ఐఫోన్‌ కొనుగోలు చేసే వారికి కొన్ని చెల్లింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన బ్యాంకు క్రెడిట్‌ కార్డులతో చెల్లిస్తే గరిష్ఠంగా రూ.7వేల వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకుల కార్డులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అదనంగా వర్తించే నిబంధనలకు లోబడి నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా చెక్ అవుట్‌ సమయంలో అందుబాటులో ఉంది. యాపిల్‌ తాజా ఐఫోన్లపై దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. ఐఫోన్‌ 18 ప్రొ సిరీస్‌ విక్రయాలు ప్రారంభమైన సందర్భంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో యాపిల్‌ స్టోర్ల ఎదుట కొనుగోలుదారులు రాత్రి నుంచే క్యూలలో నిలుచున్న దృశ్యాలు కనిపించాయి. అయితే బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వంటి క్విక్‌ కామర్స్‌ సేవలతో అర్హత కలిగిన ప్రాంతాల్లోని వినియోగదారులు ఇక ఫిజికల్‌ స్టోర్ల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా తమ స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఐఫోన్ 18ప్రొ లేదా ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్‌ను ఆర్డర్ చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement