Android | పాస్‌వర్డ్‌ల బదిలీ ఇక మరింత ఈజీ.. ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్..
Android | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ పాస్‌వర్డ్‌లు లేదా పాస్‌కీలను ఒక పాస్‌వర్డ్ మేనేజర్ నుంచి మరో పాస్‌వర్డ్ మేనేజర్‌కు సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇందుకు గాను వాటిని ప్రత్యేక ఫైల్స్‌గా డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేదు.
Technology | Published On Sep 12, 2026, 4.47 pm IST
Android | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ పాస్‌వర్డ్‌లు లేదా పాస్‌కీలను ఒక పాస్‌వర్డ్ మేనేజర్ నుంచి మరో పాస్‌వర్డ్ మేనేజర్‌కు సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇందుకు గాను వాటిని ప్రత్యేక ఫైల్స్‌గా డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ 8 లేదా ఆ తరువాతి వెర్షన్‌లు కలిగిన డివైస్‌లలో ఈ కొత్త ఫీచర్ ఆటోమేటిగ్గా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. గతంలో పాస్ వర్డ్‌లను ఒక మేనేజర్ నుంచి మరో మేనేజర్‌కు మార్చాలంటే వాటిని ముందుగా ఎన్‌క్రిప్ట్ చేయని టెక్ట్స్ ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయాల్సి వచ్చేది. దీంతో ఆ ఫైల్‌లోని ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లకు డివైస్‌లలో ప్రొటెక్షన్ ఉండేది కాదు. సులభంగా డేటా లీక్ జరిగేది. కానీ కొత్త ఫీచర్ ద్వారా ఆ బాధ తప్పనుంది. పాస్ కీలు లేదా పాస్‌వర్డ్‌లను ఒక మేనేజర్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
ఎలా బదిలీ చేస్తుంది..
కొత్త విధానంతో పాస్‌వర్డ్‌లను ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయకుండానే బదిలీ చేసుకోవచ్చు. అలాగే పాస్‌కీలను కూడా ఒక పాస్‌వర్డ్ మేనేజర్ నుంచి మరోదానికి మార్చుకోవచ్చు. దీంతో కొత్త పాస్‌వర్డ్ మేనేజర్‌కు మారుతున్నప్పుడు పాస్‌వర్డ్‌లు, పాస్‌కీలు రెండింటినీ ఒకేసారి బదిలీ చేసుకునే అవకాశం లభిస్తుంది. పాస్‌వర్డ్‌లు, పాస్‌కీలను బదిలీ చేయడానికి ముందుగా కొత్త పాస్‌వర్డ్ మేనేజర్‌ను తెరిచి, మరో ప్రొవైడర్ నుంచి పాస్‌వర్డ్‌లు, పాస్‌కీలను దిగుమతి చేసుకోవడం లేదా కాపీ చేసుకోవడం కోసం ఉన్న ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత బదిలీ ప్రక్రియను ఆండ్రాయిడ్ ఓఎస్ ఆటోమేటిగ్గా నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో మొదట ఆండ్రాయిడ్ డివైస్‌లో ఇప్పటికే ఉన్న పాస్‌వర్డ్ మేనేజర్లను గుర్తించి, వాటిలో ఏ మేనేజర్ల నుంచి డేటాను దిగుమతి చేసుకోవచ్చో చూపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత వినియోగదారులను పాత పాస్‌వర్డ్ మేనేజర్‌కు తీసుకెళ్తుంది. అక్కడ బదిలీ చేయాల్సిన పాస్‌వర్డ్‌లు, పాస్‌కీలను ఎంపిక చేసుకోవచ్చు.
స్క్రీన్ లాక్ తప్పనిసరి..
తర్వాత ఎంపిక చేసిన డేటాను సమీక్షించి బదిలీకి అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం పాత పాస్‌వర్డ్ మేనేజర్‌లో సైన్ ఇన్ చేయాల్సి వస్తుంది. పాస్‌కీలను బదిలీ చేసే సందర్భంలో రికవరీ కీ కూడా అవసరం అవుతుంది. అనుమతి ఇచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ రెండు యాప్‌ల మధ్య డేటాను సురక్షితంగా బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి సాధారణంగా కొన్ని సెకన్లు మాత్రమే పడుతుంది. ఆండ్రాయిడ్‌లో పాస్‌వర్డ్‌లు, పాస్‌కీలను దిగుమతి చేసుకోవడానికి డివైస్‌లో స్క్రీన్ లాక్ తప్పనిసరిగా ఉండాలి. పిన్, ప్యాటర్న్ లేదా ఫింగర్‌ప్రింట్ వంటి స్క్రీన్ లాక్‌ను ఉపయోగించవచ్చు. డివైస్‌లో స్క్రీన్ లాక్ లేకపోతే ముందుగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆండ్రాయిడ్ సూచిస్తుంది. గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌లో ఇప్పటికే ఉన్న పాస్‌వర్డ్‌లను మళ్లీ దిగుమతి చేస్తే డూప్లికేట్ ఎంట్రీలు క్రియేట్ కావు. మరో పాస్‌వర్డ్ మేనేజర్‌లో పాస్‌వర్డ్‌లు ఏవీ లేకపోయినా, లేదా డేటా దెబ్బతిన్నా దిగుమతి ప్రక్రియ విజయవంతం కాదు.
వేటికి సపోర్ట్ ఉంది..
కొత్త డివైస్‌లో పాస్‌కీలను బదిలీ చేస్తున్నప్పుడు పాత డివైస్‌లోని స్క్రీన్ లాక్ లేదా గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ పిన్‌ను ఉపయోగించి పాస్‌కీలను యాక్సెస్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త బదిలీ సదుపాయం గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్, 1పాస్‌వర్డ్, బిట్‌వార్డెన్ పాస్‌వర్డ్ మేనేజర్, డాష్‌లేన్‌లలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని పాస్‌వర్డ్ మేనేజర్ భాగస్వాములు ఈ సదుపాయంలో చేరనున్నారని గూగుల్ తెలిపింది. వినియోగదారులు తమ డేటాపై మరింత నియంత్రణ కలిగి ఉండడంతోపాటు, తమకు నచ్చినప్పుడు ఒక పాస్‌వర్డ్ మేనేజర్ నుంచి మరోదానికి స్వేచ్ఛగా మారేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని గూగుల్ పేర్కొంది.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
ఆగస్టు 27, 2026

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●MP Mallu Ravi | మాక్ అసెంబ్లీ రాజకీయ డ్రామా కాదా..?
- ●Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీకి సీక్వెల్ - గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
- ●Ekta Mall Telangana | రూ.200 కోట్ల 'ఏక్తా మాల్' ప్రైవేట్ బిల్డర్ల జేబుల్లోకి? శాసనమండలిలో సర్కార్‌ను నిలదీసిన దాసోజు శ్రవణ్
- ●Kalwakuntla Kavitha | అసెంబ్లీని అడ్వర్టైజెమెంట్ కోసం వాడుకుంటున్నడు
- ●CM Revanth Reddy | అతిథుల వివరాలను అందించండి.. గణేశ్ మండప నిర్వాహకులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●NSE IPO | ఎన్ఎస్ఈ ఐపీఓకు సబ్‌స్క్రైబ్ చేయాలా.. నిపుణులు ఏమంటున్నారు..?

MP Mallu Ravi | మాక్ అసెంబ్లీ రాజకీయ డ్రామా కాదా..?

Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీకి సీక్వెల్ - గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ

Ekta Mall Telangana | రూ.200 కోట్ల 'ఏక్తా మాల్' ప్రైవేట్ బిల్డర్ల జేబుల్లోకి? శాసనమండలిలో సర్కార్‌ను నిలదీసిన దాసోజు శ్రవణ్

Kalwakuntla Kavitha | అసెంబ్లీని అడ్వర్టైజెమెంట్ కోసం వాడుకుంటున్నడు



