Photoshop | చాట్ జీపీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫొటోషాప్ ను ఇక ఉచితంగా వాడుకోవచ్చు..
Technology | Published On Dec 12, 2025, 11.59 am IST
Photoshop | ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాట్ జీపీటీ యూజర్లకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ గుడ్ న్యూస్ చెప్పింది. చాట్ జీపీటీలో తమ సేవలను అందిస్తున్నట్లు తెలియజేసింది. ఫొటోషాప్‌తోపాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్, అక్రోబాట్ వంటి యాప్‌లను ఇకపై చాట్ జీపీటీలో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు గాను యూజర్లు ఎలాంటి ప్రత్యేక రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. ఆయా యాప్‌లను చాట్ జీపీటీలో ఉచితంగానే వాడుకోవచ్చు. ఇక ఇందుకు గాను పలు ప్రత్యేక ప్రాంప్ట్స్‌ను యూజర్లు వాడాల్సి ఉంటుంది. అడోబ్ అందిస్తున్న ఈ సేవల వల్ల చాట్ జీపీటీలో ఉన్న 800 మిలియన్ల మంది యూజర్లకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఇరు సంస్థలు చెబుతున్నాయి.
యూజర్లు చాట్ జీపీటీలో ఫొటోషాప్, ఇతర అడోబ్ యాప్‌ల సేవలను పొందేందుకు గాను ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌లను వాడాల్సిన పనిలేదు. ఈ సేవలు అన్నీ చాట్ జీపీటీలోనే ఇంటిగ్రేట్ అయ్యాయి. అందువల్ల వీటిని నేరుగా చాట్ జీపీటీలోని చాట్‌లలోనే ఉపయోగించుకోవచ్చు. ఇక అడోబ్ అందిస్తున్న ఈ సేవల ద్వారా యూజర్లు తమ ఇమేజ్ లను సులభంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. డిజైన్లు చేయవచ్చు. అలాగే డాక్యుమెంట్లను సైతం సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఆయా అడోబ్ యాప్స్ చాట్ జీపీటీలో ఏజెంటిక్ ఏతోపాటు మోడల్ కాంటెక్ట్స్ ప్రొటోకాల్ (ఎంసీపీ) అనే టెక్నాలజీని వాడుకోనున్నాయి.
ఈ క్రమంలో యూజర్లు చాట్ జీపీటీలో ఆయా అడోబ్ యాప్స్‌ను ఉపయోగించి ఫొటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇన్విటేషన్లను డిజైన్ చేయవచ్చు. డాక్యుమెంట్లను క్రియేట్, ఎడిటింగ్, మేనేజ్ చేసుకోవచ్చు. అడోబ్ ఫొటోషాప్ ద్వారా ఒక ఇమేజ్‌కు చెందిన నిర్దిష్టమైన భాగాన్ని సైతం ఎడిట్ చేసుకోవచ్చు. బ్రైట్ నెస్, కాంట్రాస్ట్, ఎక్స్‌పోజర్ వంటివి సెట్ చేసుకోవచ్చు. పలు రకాల ఎఫెక్ట్స్‌ను అప్లై చేయవచ్చు. అలాగే చాట్ జీపీటీ ప్రాంప్ట్స్‌ను ఉపయోగించి ఇమేజ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ సేవల్లో భాగంగా అడోబ్ ఎక్స్‌ప్రెస్‌ను సైతం వాడుకోవచ్చు. అలాగే పీడీఎఫ్‌ల కోసం అడోబ్ ఆక్రోబాట్ కూడా లభిస్తుంది. దీని సహాయంతో పీడీఎఫ్‌లను ఎడిట్ చేసుకోవడంతోపాటు పీడీఎఫ్‌లను కంబైన్, కంప్రెస్ వంటివి చేసుకోవచ్చు.
చాట్ జీపీటీలో ఫొటోషాప్ సేవలను ఉపయోగించుకోవాలంటే యూజర్లు తమ చాంట్ విండోలో /AdobePhotoshop అనే ప్రాంప్ట్‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే ఇతర యాప్స్‌కు కూడా అందుకు అనుగుణంగా ఇలాగే ప్రాంప్ట్స్‌ను ఎంటర్ చేయాలి. దీంతో ఆయా యాప్స్ సేవలను ఉచితంగా వాడుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Adobe Acrobat | పీడీఎఫ్‌ల క్రియేషన్ ఇక ఈజీ.. ఏఐ ఏజెంట్‌ను ప్రవేశపెట్టిన అడోబ్..
మే 7, 2026

Adobe CEO Shantanu Narayen | అడోబ్ సీఈవో పదవికి శాంతను నారాయణ్ రాజీనామా.. కారణం ఏమిటి..?
మార్చి 13, 2026

Airtel | ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు Adobe Express ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ..
జనవరి 30, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



