త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adobe | అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌కు భారీ అప్‌డేట్.. ఫోటో, వీడియో ఎడిటింగ్‌లో శక్తివంతమైన ఏఐ ఫీచర్లు..

Adobe | అడోబ్ తన ప్రముఖ క్రియేటివ్ క్లౌడ్ అప్లికేషన్‌లకు కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఫోటో ఎడిటింగ్, వీడియో ప్రొడక్షన్, మోషన్ గ్రాఫిక్స్, వెక్టర్ డిజైన్ త‌దిత‌ర విభాగాల్లో ఉపయోగించే ప్రధాన సాఫ్ట్‌వేర్‌లకు ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది.

S

Technology | Published On Jun 17, 2026, 11.55 am IST

Adobe | అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌కు భారీ అప్‌డేట్.. ఫోటో, వీడియో ఎడిటింగ్‌లో శక్తివంతమైన ఏఐ ఫీచర్లు..
Advertisement

Adobe | అడోబ్ తన ప్రముఖ క్రియేటివ్ క్లౌడ్ అప్లికేషన్‌లకు కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఫోటో ఎడిటింగ్, వీడియో ప్రొడక్షన్, మోషన్ గ్రాఫిక్స్, వెక్టర్ డిజైన్ త‌దిత‌ర విభాగాల్లో ఉపయోగించే ప్రధాన సాఫ్ట్‌వేర్‌లకు ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. కూలింగ్, మాస్కింగ్, రోటోస్కోపింగ్, కంపోజిటింగ్, ఇమేజ్ క్లీనప్ వంటి సమయం తీసుకునే మాన్యువల్ పనులను తగ్గించడంతోపాటు, ఏఐ ఆధారిత ఎడిటింగ్ సామర్థ్యాలను మరింత విస్తరించడంపై ఈ అప్‌డేట్ దృష్టి సారించింది. లైట్‌రూమ్‌లో ఫోటోలను నిర్వహించడం, ఎడిట్ చేయడం మరింత సులభమయ్యేలా కొత్త ఫీచర్లను అడోబ్ తీసుకొచ్చింది. అసిస్టెడ్ కూలింగ్ ఫీచర్ ఇప్పుడు సాధారణ వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న ఫోటోలను విశ్లేషించి, ఫేస్ డిటెక్షన్, కళ్లు తెరిచి ఉండటం, ఫోటో షార్ప్‌నెస్ వంటి అంశాల ఆధారంగా ఉత్తమ చిత్రాలను గుర్తిస్తుంది.

ఫేస్ వ్యూ ఫీచ‌ర్‌..

ఫేస్ వ్యూ ఫీచర్ ద్వారా ఫోటోలలోని వ్యక్తులను విడిగా గుర్తించి సులభంగా సమీక్షించవచ్చు. స్టాకింగ్ సిస్టమ్ ఒకే తరహా ఫోటోలను గ్రూప్ చేసి, ప్రతి సెట్‌లో ఉత్తమ ఫోటోను సూచిస్తుంది. ఫోటో టు వీడియో ఫీచర్ ద్వారా స్థిర చిత్రాలను ఏఐ సాయంతో మోషన్ క్లిప్‌లు లేదా రీల్స్‌గా మార్చుకోవచ్చు. ఇది అడోబ్ ఫైర్‌ఫ్లై, గూగుల్ వియో టెక్నాలజీలతో పనిచేస్తుంది. యూజర్ ఇచ్చే ప్రాంప్ట్‌లు లేదా ఇమేజ్ కంటెంట్ ఆధారంగా వీడియో మోషన్‌ను రూపొందిస్తుంది. టోపాజ్ ల్యాబ్స్ ఇంటిగ్రేషన్‌తో వచ్చిన ఏఐ షార్పెన్ ఫీచర్ ద్వారా టెక్స్చర్లు, జంతువుల వెంట్రుకలు, పూల రేకులు, ఆకులు వంటి సూక్ష్మ వివరాలను మరింత స్పష్టంగా చూపించవచ్చు. ఫోటోలను వేరే సాఫ్ట్‌వేర్‌కు ఎక్స్‌పోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే సోనీ ఆల్ఫా 7ఆర్ వీఐ కెమెరా నుంచి వచ్చే సోనీ రా ఫార్మాట్ ఫైళ్లకు లైట్‌రూమ్, లైట్‌రూమ్ క్లాసిక్, కెమెరా రా ప్లాట్‌ఫామ్‌లలో పూర్తి మద్దతును అందించారు.

ప్రీమియ‌ర్ ప్రోలో..

ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ వేగం, టైమ్‌లైన్ నియంత్రణను మెరుగుపరిచే అనేక ఫీచర్ల‌ను ఇచ్చారు. గ్లోబల్ ఆడియో మ్యూట్ ద్వారా మొత్తం ప్రాజెక్ట్ ఆడియోను ఒకే క్లిక్‌తో మ్యూట్ చేయవచ్చు. మార్కర్ సెర్చ్ ఫీచర్ ద్వారా మార్కర్లను పేరు లేదా రంగు ఆధారంగా ప్రాజెక్ట్ అంతటా వెతకవచ్చు. చానెల్ బ్లర్, గ్రాడియెంట్, నాయిస్ ఎఫెక్ట్స్ వంటి కొత్త టూల్స్ టైమ్‌లైన్‌లోనే కంపోజిటింగ్, టెక్స్చర్ పనులను సులభతరం చేస్తాయి. 3డి స్పిన్‌బ్యాక్, స్లైడ్ ట్రాన్సిషన్‌లు వీడియోలకు మరింత డైనమిక్ మోషన్ ఎఫెక్ట్‌లను అందిస్తాయి. సింగిల్ వర్డ్ క్యాప్షనింగ్ ఫీచర్ ద్వారా మొత్తం క్యాప్షన్ బ్లాక్‌ను ప్రభావితం చేయకుండా ఒక్కో పదాన్ని సవరించవచ్చు. స్టాక్ ప్యానెల్ చెకౌట్ ద్వారా అడోబ్ స్టాక్ అసెట్‌లను ప్రీమియర్ ప్రోలోనే ప్రీవ్యూ చేసి లైసెన్స్ పొందవచ్చు. ఫైర్‌ఫ్లై బోర్డ్స్ ఇంటిగ్రేషన్ ద్వారా బహుళ అసెట్‌లను జోడించినప్పుడు వీడియో సీక్వెన్స్‌ల‌ను ఆటోమేటిక్‌గా రూపొందిస్తుంది. ఆబ్జెక్ట్ మాస్క్ ఫీచర్ వేగవంతమైన, మరింత క‌చ్చితమైన మాస్కింగ్‌ను అందించడంతోపాటు మీడియా రీలింక్ అయిన తర్వాత కూడా మాస్క్‌లను తిరిగి రూపొందిస్తుంది.

ఫొటోషాప్‌లో..

ఫోటోషాప్‌లో ఇమేజ్ క్లీనప్, ఆఫ్‌లైన్ ఏఐ ప్రాసెసింగ్‌పై ప్రధాన దృష్టి పెట్టారు. రిఫ్లెక్షన్ రిమూవల్ ఫీచర్ ద్వారా గాజు వెనుక నుంచి తీసిన ఫోటోలలో కనిపించే ప్రతిబింబాలను గుర్తించి వాటిని ప్రత్యేక ఎడిటబుల్ లేయర్లుగా విడదీస్తుంది. రిమూవ్ టూల్ కు ఆన్-డివైస్ జనరేటివ్ ఏఐ మద్దతు జోడించారు. దీంతో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఏఐ ఆధారిత ఎడిటింగ్ పనులను నిర్వహించవచ్చు. ఇల్లస్ట్రేటర్‌లో కాన్సెప్ట్ టు వెక్టర్ అనే కొత్త వర్క్‌ఫ్లోను ప్రవేశపెట్టారు. ఇది స్కెచ్‌లు లేదా తక్కువ నాణ్యత కలిగిన ఇన్‌పుట్‌లను ఎడిటబుల్ వెక్టర్ డ్రాఫ్ట్‌లుగా మారుస్తుంది. ఒకే ఇన్‌పుట్ నుంచి అనేక శైలుల్లో డిజైన్ వేరియేషన్లను కూడా సృష్టిస్తుంది. ఈ ఫీచర్ నేరుగా ఇల్లస్ట్రేటర్‌లోనే అందుబాటులో ఉండటంతో డిజైన్ ఆలోచనలను వేగంగా అభివృద్ధి చేయవచ్చు. అడోబ్ తెలిపిన ప్రకారం, ఈ కొత్త క్రియేటివ్ క్లౌడ్ ఫీచర్లు ఈ వారం నుంచే సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రాంతం, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, సాఫ్ట్‌వేర్ వెర్షన్ ఆధారంగా కొన్ని ఫీచర్ల లభ్యత మారుతుంది. అన్ని ఫీచర్ల‌ను ఇప్పటికే ఉన్న అడోబ్ అప్లికేషన్‌లలో ఇంటిగ్రేట్ చేశారు. ప్రత్యేకంగా కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అవసరం ఉండదు.

Advertisement
Advertisement