త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nothing | న‌థింగ్ నుంచి మ‌రో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు.. మిడ్ రేంజ్ విభాగంలో.. ధ‌ర ఎంతంటే..?

Nothing | మొబైల్స్ తయారీ సంస్థ న‌థింగ్ మ‌రో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. న‌థింగ్ ఫోన్ 4ఎ, న‌థింగ్ ఫోన్ 4ఎ ప్రొ పేరిట ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. గ‌తేడాది విడుద‌లైన న‌థింగ్ ఫోన్‌3ఎ, 3ఎ ప్రొ ఫోన్ల‌కు కొన‌సాగింపుగా ఆ సంస్థ ఈ ఫోన్‌ల‌ను విడుద‌ల చేసింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Mar 6, 2026, 12.55 pm IST

Nothing | న‌థింగ్ నుంచి మ‌రో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు.. మిడ్ రేంజ్ విభాగంలో.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

Nothing | మొబైల్స్ తయారీ సంస్థ న‌థింగ్ మ‌రో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. న‌థింగ్ ఫోన్ 4ఎ, న‌థింగ్ ఫోన్ 4ఎ ప్రొ పేరిట ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. గ‌తేడాది విడుద‌లైన న‌థింగ్ ఫోన్‌3ఎ, 3ఎ ప్రొ ఫోన్ల‌కు కొన‌సాగింపుగా ఆ సంస్థ ఈ ఫోన్‌ల‌ను విడుద‌ల చేసింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. న‌థింగ్ ఫోన్ 4ఎ ను మార్చి 12 నుంచి విక్ర‌యించ‌నుండ‌గా, న‌థింగ్ ఫోన్ 4ఎ ప్రొను మార్చి 13 నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, విజ‌య్ సేల్స్‌, క్రోమా వంటి అన్ని ప్ర‌ధాన రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్లు ల‌భ్యం కానున్నాయి. ఈ ఫోన్లపై ప‌లు ఆఫ‌ర్ల‌ను, నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాల‌ను కూడా అందిస్తున్నారు.

న‌థింగ్ ఫోన్ 4ఎ ఫీచ‌ర్లు..

ఇందులో 6.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా దీనికి 1.5కె రిజ‌ల్యూష‌న్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. 4500 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్‌నెస్ ల‌భిస్తుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ కూడా డిస్‌ప్లేకు ఉంది. స్నాప్ డ్రాగ‌న్ 7ఎస్ జెన్‌4 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 12జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 256జీబీ వ‌ర‌కు స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌ను ఇచ్చారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 50, 8, 50 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉండ‌గా, ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఆప్టిక‌ల్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి స‌దుపాయాలు ఉన్నాయి. 5400 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది. 50 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్‌ను ఇచ్చారు.

న‌థింగ్ ఫోన్ 4ఎ ప్రొ ఫీచ‌ర్లు..

ఇందులో 6.83 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 1.5కె రిజ‌ల్యూష‌న్‌, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే మ‌రింత క్వాలిటీగా ఉంటుంది. 5000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ కూడా డిస్‌ప్లేకు ఉంది. స్నాప్ డ్రాగ‌న్ 7 జెన్ 4 ప్రాసెస‌ర్‌ను ఇందులో ఇచ్చారు. 12జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 256జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ను ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్ ఆప్ష‌న్ ఉంది. 50, 8, 50 మెగాపిక్స‌ల్ కెమెరాలు వెనుక వైపు ఉండ‌గా, ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఆప్టిక‌ల్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ఉంది. 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ స‌దుపాయాలు కూడా ఉన్నాయి. 5400 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా 50 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్‌ను ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

  • న‌థింగ్ ఫోన్ 4ఎ కు చెందిన 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.31,999 ఉండ‌గా, 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.34,999గా ఉంది. అలాగే 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.37,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్ పై రూ.3వేల బ్యాంక్ డిస్కౌంట్‌ను, రూ.4వేల వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్‌ను, 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు.
  • న‌థింగ్ ఫోన్ 4ఎ ప్రొ కు చెందిన 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.39,999 ఉండ‌గా, 8జీబీ, 256జీబీ మోడల్ ధ‌ర రూ.42,999గా ఉంది. అలాగే 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.45,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌పై రూ.4వేల బ్యాంక్ డిస్కౌంట్‌ను, రూ.1వేయి వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్‌ను, 12 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు.

బెంగ‌ళూరులో మార్చి 7వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన ఈవెంట్‌లో నథింగ్ స్టోర్‌లో ఈ ఫోన్ల‌ను అందుబాటులో ఉంచ‌నున్నారు. క‌నుక ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్లు అంద‌రికీ అందుబాటులోకి రావ‌డానికి ఐదారు రోజుల ముందుగానే ఈ ఫోన్ల‌ను అక్క‌డ కొనుగోలు చేయ‌వ‌చ్చు. మొద‌టి 100 మంది క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా ఎన్‌గ్రేవ్ చేయ‌బ‌డిన న‌థింగ్ ఫోన్ 4ఎ ఎడిష‌న్‌ను అందించ‌నున్నారు. అలాగే ఈ ఫోన్ల‌ను ఆ స్టోర్‌లో కొంటే రూ.999 విలువైన ఇయ‌ర్ ఎ లేదా సీఎంఎఫ్ బ‌డ్స్ 2 ప్ల‌స్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement