Motorola Signature | 1.5కె డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరాలతో లాంచ్ అయిన మోటోరోలా సిగ్నేచర్ ఫోన్..!
Motorola Signature | మోటొరోలా భారత్‌లో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభిస్తూ మోటొరోలా సిగ్నేచర్ ఫోన్ ను అధికారికంగా విడుదల చేసింది. అల్ట్రా-ప్రీమియం విభాగం లక్ష్యంగా రూపొందించిన ఈ ఫోన్ డిజైన్, కెమెరా, పనితీరు, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని కంపెనీ చెబుతోంది.
Technology | Published On Jan 24, 2026, 7.40 am IST
Motorola Signature | మోటొరోలా భారత్‌లో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభిస్తూ మోటొరోలా సిగ్నేచర్ ఫోన్ ను అధికారికంగా విడుదల చేసింది. అల్ట్రా-ప్రీమియం విభాగం లక్ష్యంగా రూపొందించిన ఈ ఫోన్ డిజైన్, కెమెరా, పనితీరు, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని కంపెనీ చెబుతోంది. అత్యంత సన్నని 6.99 మిల్లీమీటర్ల మందంతో వచ్చిన ఈ ఫోన్, విమానాల తయారీలో ఉపయోగించే గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేయబడింది. క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌తో పాటు, IP68, IP69 రేటింగ్‌లు ఉండటంతో ధూళి, అధిక పీడన నీటి ప్రవాహం, 1.5 మీటర్ల లోతులో 30 నిమిషాల వరకు నీటిలో మునిగినా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాదు, మిలిటరీ స్థాయి MIL-STD-810H ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ను అందించారు.
వెనుక వైపు 50 మెగాపిక్సల్ 4 కెమెరాలు..
ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 6200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. రంగుల పరంగా పాంటోన్ సర్టిఫికేషన్ పొందిన మార్టిని ఒలివ్, కార్బన్ అనే రెండు ప్రత్యేక షేడ్స్‌లో అందుబాటులోకి వచ్చింది. కెమెరా విభాగంలో మోటరోలా సిగ్నేచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో ఇది సెగ్మెంట్‌లోనే తొలి ఫోన్‌గా నిలిచింది. సోనీ లైటియా సెన్సర్లతో కూడిన ఈ కెమెరా సెటప్‌కు DXOMARK గోల్డ్ లేబుల్ కూడా లభించింది. ప్రధాన కెమెరా 50MP లైటియా 828 సెన్సార్‌తో 8K వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఇస్తుంది. 3x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, 100x డిజిటల్ జూమ్ సామర్థ్యం, అల్ట్రా వైడ్, మాక్రో కెమెరా, అలాగే 50MP ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఫొటోల నాణ్యతను మెరుగుపరిచేందుకు మోటో ఏఐ ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ ను అందిస్తున్నారు.

భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను అందించారు. 3 నానోమీటర్ టెక్నాలజీతో తయారైన ఈ చిప్‌సెట్ 3.8GHz వరకు వేగంతో పనిచేస్తుంది. గేమింగ్, హెవీ టాస్క్‌ల కోసం ప్రత్యేక లిక్విడ్ మెటల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. బోస్ ట్యూనింగ్‌తో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, స్నాప్‌డ్రాగన్ సౌండ్ సపోర్ట్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. 5200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 90W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్, 10W రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కేవలం 7 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే రోజు మొత్తం బేసిక్ పనులకు అవసరం అయ్యే బ్యాటరీ పవర్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ధర వివరాలు..
మోటొరోలా సిగ్నేచర్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ను ఇచ్చారు. 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని మోటొరోలా హామీ ఇచ్చింది. అంతేకాదు, మోటో ఏఐ ఫీచర్లతో పాటు అనేక భాషలకు సపోర్ట్, భవిష్యత్తులో ప్రత్యేక వైట్ గ్లోవ్ అసిస్టెన్స్ సేవలు కూడా అందించనున్నారు. భారత్‌లో ఈ ఫోన్ ధరలు 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.59,999గా, 16GB, 512GB వేరియంట్‌కు రూ.64,999గా, 16GB, 1TB వేరియంట్‌కు రూ.69,999గా నిర్ణయించారు. జనవరి 30 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటొరోలా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇక లాంచ్ ఆఫర్ల కింద హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో రూ.5వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ఎక్స్చేంజ్ బోనస్, 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ కొన్నవారికి సిగ్నేచర్ క్లబ్ మెంబర్‌షిప్ తోపాటు మోటో వాచ్‌పై రాయితీ ని కూడా ఇస్తున్నారు. అలాగే పెర్‌ప్లెక్సిటీ ప్రొ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది.
ఈ సందర్భంగా మోటరోలా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎం. నరసింహన్ మాట్లాడుతూ, భారత మార్కెట్‌లో అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త నిర్వచనం ఇచ్చేలా మోటరోలా సిగ్నేచర్ రూపొందించామని, అత్యుత్తమ కెమెరా టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరు, ప్రత్యేకమైన సేవలతో వినియోగదారులకు సంపూర్ణ ప్రీమియం అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

HMD Vibe 2 5G | రూ.10,999కే హెచ్ఎండీ వైబ్ 2 5జి ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎంట్రీ..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



