త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMD Vibe 2 5G | రూ.10,999కే హెచ్‌ఎండీ వైబ్ 2 5జి ఫోన్‌.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎంట్రీ..

HMD Vibe 2 5G | భారత మార్కెట్లో హెచ్‌ఎండీ కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్ హెచ్ఎండీ వైబ్‌2 5జిని అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన వైబ్ 5జికి ఇది సక్సెసర్‌గా అందుబాటులోకి వ‌చ్చింది. తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, 120హెడ్జ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ అందిస్తోంది.

S

Technology | Published On May 21, 2026, 2.43 pm IST

HMD Vibe 2 5G | రూ.10,999కే హెచ్‌ఎండీ వైబ్ 2 5జి ఫోన్‌.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎంట్రీ..
Advertisement

HMD Vibe 2 5G | భారత మార్కెట్లో హెచ్‌ఎండీ కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్ హెచ్ఎండీ వైబ్‌2 5జిని అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన వైబ్ 5జికి ఇది సక్సెసర్‌గా అందుబాటులోకి వ‌చ్చింది. తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, 120హెడ్జ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్‌లో 6.745 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం స్మూత్‌గా ఉండనుంది. యూనిసాక్ టీ8200 5జి ప్రాసెసర్‌పై ఈ డివైస్ పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌తో పాటు 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవ‌చ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. అలాగే 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేసే ఇండస్ ఏఐ ఫీచర్‌ను కూడా కంపెనీ అందించింది. రెండు సంవత్సరాల పాటు క్వార్టర్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హెచ్‌ఎండీ తెలిపింది.

భారీ బ్యాట‌రీ..

ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సెకండరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్, బాటమ్ పోర్టెడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ డివైస్‌లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఛార్జర్‌ను కూడా బాక్స్‌లోనే అందిస్తున్నారు. డస్ట్, వాటర్ స్ప్లాష్ నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5జి, డ్యుయల్ 4జీ వోల్టీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

హెచ్ఎండీ వైబ్‌2 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్ కాస్మిక్ లావెండర్, నార్డిక్ బ్లూ, పీచ్ పింక్ రంగుల్లో లాంచ్ అయింది. మే 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ లో విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ సంద‌ర్బంగా ప‌లు లాంచ్ ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, యూపీఐ ట్రాన్సాక్షన్‌ల‌పై రూ.1500 తగ్గింపు, 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ను ఇస్తున్నారు.

Advertisement
Advertisement