త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

motorola edge 70 | అద్భుత‌మైన డిస్‌ప్లే, సౌండ్ క్వాలిటీ, ఏఐ ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్‌..!

S

Technology | Published On Dec 15, 2025, 6.38 pm IST

motorola edge 70 | అద్భుత‌మైన డిస్‌ప్లే, సౌండ్ క్వాలిటీ, ఏఐ ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్‌..!
Advertisement

motorola edge 70 | స్మార్ట్ ఫోన్ త‌యారీదారు మోటోరోలా ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో ఎడ్జ్ 70 పేరిట ఈ ఫోన్‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో 6.7 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 1.5కె రిజ‌ల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 7 జెన్ 4 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. ర్యామ్‌ను అద‌నంగా మ‌రో 16జీబీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్‌గా పెంచుకునే వీలు క‌ల్పించారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా, మ‌రో 50 మెగాపిక్స‌ల్ సెకండ‌రీ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు కూడా 50 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఫీచ‌ర్లు ఇవే..

ఈ ఫోన్ పూర్తిగా మెట‌ల్ ఫ్రేమ్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల దీనికి ప్రీమియం లుక్ వ‌చ్చింది. ఇందులో ఐపీ 68, 69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. కనుక బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 4 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 4 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌లో ప‌లు అద్భుత‌మైన ఏఐ ఫీచ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు. ఈ ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్లు మోటో ఏఐ 2.0 స‌హాయంతో పొంద‌వ‌చ్చు. ఈ ఏఐ టూల్‌తో అనేక స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. ఏఐ ఇమేజ్ స్టూడియో, స్కెచ్ టు ఇమేజ్‌, స్టైల్ సింక్‌, టెక్ట్స్ టు స్టిక్క‌ర్‌, అవ‌తార్ క్రియేష‌న్ వంటి ఫీచ‌ర్ల‌ను ఏఐ స‌హాయంతో వాడుకోవ‌చ్చు.

మోటో ఏఐ 2.0 స‌హాయంతో క్యాచ్ మి అప్ 2.0 ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల యూజ‌ర్లు ఇత‌రులు మాట్లాడే మాట‌ల‌ను లైవ్‌లో ట్రాన్స్‌క్రిప్ష‌న్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఏఐ ప్లేలిస్ట్ స్టూడియో, గ్లోబ‌ల్ సెర్చ్‌, ఆటో స్క్రీన్ షాట్ బ్ల‌ర్ వంటి ఫీచ‌ర్లు సైతం ఇందులో ల‌భిస్తున్నాయి. అయితే యూజర్లు ఈ ఫోన్ ద్వారా త‌మ‌కు కావ‌ల్సిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకునే స‌దుపాయం ఉంది. మోటోరోలా అందిస్తున్న మోటో ఏఐ లేదా మైక్రోసాఫ్ట్ కోపైల‌ట్‌, ప‌ర్‌ప్లెక్సిటీ, గూగుల్ జెమిని వంటి ఏఐల‌లో త‌మ‌కు కావ‌ల్సిన ఏఐని ఎంచుకుని యూజ‌ర్లు ఈ ఫోన్‌లో ప‌నులు చేసుకోవ‌చ్చు. ఇక ఈ ఫోన్ కేవ‌లం 5.99 ఎంఎం మందంతో చాలా స్లీక్‌గా ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అందిస్తున్నారు. దీనికి 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. అలాగే 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను కూడా పొంద‌వ‌చ్చు.

ధ‌ర వివ‌రాలు..

మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్‌ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తుండ‌గా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్ ఉంది క‌నుక సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి స‌దుపాయాలు ఇందులో ల‌భిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ ధ‌ర రూ.29,999 ఉండ‌గా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, మోటోరోలా ఆన్ లైన్ స్టోర్‌, అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్‌లో డిసెంబ‌ర్ 23 నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్‌పై రూ.1వేయి బ్యాంక్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement