Microsoft Windows | మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టమ్‌కు విండోస్ అని ఎందుకు పేరు పెట్టిందంటే..?
Microsoft Windows | మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే పేరు గాంచిన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిందే. ఇందులో అనేక వెర్షన్లు వచ్చాయి. ప్రస్తుతం చాలా వరకు కంప్యూటర్లలో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.
Technology | Published On Dec 23, 2025, 8.47 am IST
Microsoft Windows | మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే పేరు గాంచిన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిందే. ఇందులో అనేక వెర్షన్లు వచ్చాయి. ప్రస్తుతం చాలా వరకు కంప్యూటర్లలో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇక ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లలో అధిక భాగం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా వాడడం చాలా సులభతరం. కనుక లైనక్స్, మాక్ కన్నా విండోస్ పీసీలనే అధికంగా వాడుతున్నారు. అయితే అసలు విండోస్ అనే పేరును మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎందుకు పెట్టింది..? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి..? విండోస్ అంటే కిటికీలు అని అర్థం కదా. మరలాంటి సింపుల్ పేరును ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎందుకు పెట్టారు..? అంటే..
అదే విండోస్ ఓఎస్‌కు పునాది..
అప్పట్లో.. 1985కి ముందు DOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. అయితే అది పూర్తిగా కమాండ్ లైన్ ఇంటర్ ఫేస్ ఉంటుంది. అంటే అందులో మౌస్‌ను వాడలేం. నలుపు రంగు స్క్రీన్ ఉంటుంది. ఏ పనిచేయాలన్నా కమాండ్లే దిక్కు. వాటిని సరిగ్గా ఇస్తేనే పనిచేయగలం. ఇప్పటి మాదిరిగా గ్రాఫికల్ లుక్ ఉండేది కాదు. దీంతో యూజర్లకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే జిరాక్స్ అనే కంపెనీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (జీయూఐ) కలిగిన, మౌస్‌తో ఆపరేట్ చేసుకునేందుకు వీలుండే కంప్యూటర్‌ను మొదట అభివృద్ధి చేసింది. కానీ తరువాత అది మార్కెట్‌లో నిలబడలేదు. అయితే జిరాక్స్ కంపెనీ తయారు చేసిన ఆ కంప్యూటరే తరువాత మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు పునాది వేసింది.
విండో లాంటి లుక్ ఉండడం వల్లే..
జిరాక్స్ కంపెనీ తయారు చేసిన గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ కంప్యూటర్‌ను మోడల్‌గా తీసుకుని మైక్రోసాఫ్ట్ కూడా మరో నూతన ఓఎస్‌ను తీర్చిదిద్దింది. దాన్ని extended MS-DOS అని పిలిచేవారు. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను మౌస్‌తో కూడా వాడుకోవచ్చు. దీనికి తోడు గ్రాఫికల్ లుక్‌లో కలర్‌ఫుల్‌గా ఉండేది. దీంతో యూజర్లకు అది నచ్చింది. అనంతరం ఇదే ఆపరేటింగ్ సిస్టమ్‌ను మైక్రోసాఫ్ట్ మరింత డెవలప్ చేసింది. చివరకు ఎట్టకేలకు కొత్త ఓఎస్ విండోస్ 1.0ను నవంబర్ 20, 1985న మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు విండోస్ అని ఎందుకు పేరు పెట్టారంటే.. మన ఇంట్లో బెడ్‌రూంకు, లివింగ్ రూమ్‌కు, బాత్‌రూమ్‌కు.. ఇలా అనేక గదులకు కూడా కిటికీలు ఉంటాయి కదా. అలాగే ఒక్కో అప్లికేషన్‌ను వాడుకోవాలంటే ఒక్కో బాక్స్ లాంటి విండో ఉపయోగపడుతుంది. అలా కిటికీల మాదిరిగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్నందు వల్లే మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌కు విండోస్ అని పేరు పెట్టింది. పైగా సామాన్య ప్రజలకు కూడా దీన్ని గుర్తు పెట్టుకోవడం చాలా సులభం. కనుకనే మైక్రోసాఫ్ట్ అదే పేరును కొనసాగించింది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ ఇంటర్ ఫేస్ కూడా చాలా ఈజీగా వాడుకునేలా ఉంటుంది. మనం విండోస్ ఓఎస్‌లో ఒక్కో సాఫ్ట్‌వేర్‌ను ఒక్కో విండోలో ఓపెన్ చేసి వాడుకోవచ్చు. ఇక ఆ తరువాత అలా క్రమంగా ఈ ఓఎస్ చాలా పాపులర్ అయింది.
సంబంధిత వార్తలు

Chromebook | క్రోమ్‌బుక్ వర్సెస్ విండోస్ ల్యాప్‌టాప్.. ఎవరికి ఏది బెటర్..?
జులై 18, 2026

Xbox | లేఆఫ్‌కు గురైన ఎక్స్‌బాక్స్ వైస్‌ప్రెసిడెంట్.. 37 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిందంటూ భావోద్వేగ పోస్ట్
జులై 8, 2026

Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో
జులై 7, 2026
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు



