Windows 11 | విండోస్ 11 ఓఎస్‌లో ఇక బలవంతపు అప్ డేట్స్ ఉండవు.. మార్పులు చేసిన మైక్రోసాఫ్ట్.. యూజర్లకు భారీ ఊరట..
Windows 11 | టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ యూజర్లకు శుభవార్త చెప్పింది. విండోస్ అప్‌డేట్స్‌ను ఇకపై మరింత మెరుగ్గా నియంత్రించేందుకు కొత్త అప్‌డేట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల యూజర్లను అప్‌డేట్స్ ఇక ఇబ్బంది పెట్టవని ఆ సంస్థ స్పష్టం చేసింది.
Technology | Published On Apr 28, 2026, 4.39 pm IST
Windows 11 | టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ యూజర్లకు శుభవార్త చెప్పింది. విండోస్ అప్‌డేట్స్‌ను ఇకపై మరింత మెరుగ్గా నియంత్రించేందుకు కొత్త అప్‌డేట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల యూజర్లను అప్‌డేట్స్ ఇక ఇబ్బంది పెట్టవని ఆ సంస్థ స్పష్టం చేసింది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో అప్ డేట్స్ వస్తే వాటిని ఎక్కువ రోజుల పాటు ఆపి ఉంచడం ఇబ్బందయ్యేది. కచ్చితంగా అప్ డేట్ చేస్తేనే పీసీ రీస్టార్ట్ లేదా షట్ డౌన్ అయ్యే విధంగా ఇప్పటి వరకు ఫీచర్‌ను ఇచ్చారు. కానీ యూజర్ల ఫీడ్ బ్యాక్‌తో దీనికి మైక్రోసాఫ్ట్ మార్పులు చేసింది. దీంతో అప్ డేట్స్‌ను కచ్చితంగా ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే యూజర్లు తమ పీసీలను షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చేసుకోవచ్చు.
కచ్చితంగా అప్ డేట్ చేస్తే గానీ..
సాధారణంగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఓఎస్‌కు సంబంధించి లేదా సెక్యూరిటీ అప్‌డేట్స్ ను సిస్టమ్ డిఫాల్ట్‌గా ఎప్పటికప్పుడు సిద్ధం చేసి ఇస్తుంది. వాటిని యూజర్లు ఆటోమేటిగ్గా లేదా మాన్యువల్‌గా నిర్దిష్టమైన సమయానికి ఇన్‌స్టాల్ చేయమని సిస్టమ్‌కు సెట్టింగ్స్ చేయవచ్చు. అయితే అప్‌డేట్స్‌ను డౌన్ లోడ్ చేయడం లేదా ఇన్‌స్టాల్ చేయడం కొద్ది రోజుల వరకే పాజ్ చేసుకునే వీలుంది. కానీ ఆ గడువును తరువాత పొడిగించేందుకు వీలు కావడం లేదు. దీంతో యూజర్లు తమ పీసీని ఆఫ్ చేయాలంటే కచ్చితంగా ముందు అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. లేదా రీస్టార్ట్ చేసినా సరే అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే. అప్ డేట్స్ అనేవి యూజర్ ఖాళీ సమయాల్లో చేస్తే ఓకే. కానీ అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్‌డేట్స్ కచ్చితంగా ఇన్‌స్టాల్ చేయాల్సిందే అని చూపిస్తే యూజర్లకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటి వరకు విండోస్ యూజర్లకు ఇదే పెద్ద సమస్యగా మారింది. అయితే దీనికి మైక్రోసాఫ్ట్ మార్పులు చేసింది. అప్‌డేట్స్ ను యూజర్లు కావల్సినన్ని రోజులు పాజ్ చేయడంతోపాటు కావాలనుకున్న సమయంలోనే వాటిని ఇన్ స్టాల్ చేసుకునే విధంగా ముందస్తుగా సిస్టమ్‌కు సెట్టింగ్స్ మార్చవచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్ తన తదుపరి ఓఎస్ అప్‌డేట్స్‌లో ఇవ్వనుంది.
మార్పులతో కూడిన ఓఎస్ అప్ డేట్..
మైక్రోసాఫ్ట్ చేసిన ఈ మార్పుతో కూడిన అప్‌డేట్ విండోస్ 11 యూజర్లకు విండోస్ 11 బిల్డ్ 26300.8289 వెర్షన్‌లో లభిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. అందువల్ల యూజర్లు తమ పీసీలో ఈ బిల్డ్ వెర్షన్ అప్‌డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటే ఇకపై అప్ డేట్స్ కోసం అలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ వెర్షన్ అందుబాటులో ఉంటే వెంటనే ఇన్‌స్టాల్ చేయడం మంచిది. లేకపోతే వెర్షన్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక విండోస్ 11 యూజర్లు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్యను కూడా మైక్రోసాఫ్ట్ పరిష్కరించింది. విండోస్ పీసీలో ఉండే షట్ డౌన్ అనే బటన్‌ను క్లిక్ చేస్తే చాలా మంది తమ పీసీ రీస్టార్ట్ అవుతుందని ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ సమస్యకు కూడా ఫిక్స్‌ను ఈ వెర్షన్‌లోనే సంస్థ అందిస్తోంది.
బలవంతపు అప్ డేట్స్‌కు చెక్..
అయితే ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ వాదన మాత్రం పూర్తి భిన్నంగా ఉంటూ వచ్చింది. యూజర్లను అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం సెక్యూరిటీ రిస్క్‌లు ఉంటాయన్న సాకుతో ఆటోమేటిక్ అప్ డేట్స్‌పై యూజర్లకు అసలు నియంత్రణ లేకుండా వ్యవహరించింది. దీంతో చాలా మంది యూజర్లు ఇప్పటికీ ఆ అప్‌డేట్స్ పట్ల చిర్రెత్తుతున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ అమలు చేస్తున్న ఆ బలవంతపు అప్‌డేట్స్ చాలా మంది ప్రొఫెషనల్ యూజర్లను సైతం ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన మైక్రోసాఫ్ట్ సదరు ఆటో అప్ డేట్స్‌పై యూజర్లకు పూర్తి కంట్రోల్ ఉండేలా మార్పును తీసుకువచ్చింది. ఇక యూజర్లు అంతకు ముందు ఉన్న 35 రోజుల అప్ డేట్ లిమిట్‌ను ఇక ఎన్ని రోజులకు అయినా మార్చుకోవచ్చు. వీలుంటే తమకు కావల్సిన రోజునే ఓఎస్ అప్‌డేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీంతో విండోస్ యూజర్లకు భారీ ఊరట లభించింది. అయితే మైక్రోసాఫ్ట్ అమలు చేస్తున్న ఇలాంటి చర్యలు, ఆ ఓఎస్‌లో ఉండే రిస్క్‌లు, లోపాల వల్ల చాలా మంది ప్రొఫెషనల్ యూజర్లు ఇప్పటికే యాపిల్‌కు చెందిన మాక్ ఓఎస్‌కు మారుతున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తన ఆటోమేటిక్ అప్ డేట్స్‌కు ఈ మార్పును తేవడం గమనార్హం.
సంబంధిత వార్తలు

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026

Dell | ఎక్స్పీఎస్ సిరీస్‌లో డెల్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏకంగా 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
ఏప్రిల్ 27, 2026

ASUS ExpertBook | వ్యాపారులు, ప్రొఫెషనల్స్ కోసం అసుస్ అల్ట్రా సిరీస్ ల్యాప్ టాప్‌లు.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



