Meta Forum App | మెటా సీక్రెట్‌గా కొత్త యాప్ ‘ఫోరం’ లాంచ్.. రెడిట్‌కు భారీ పోటీ..
Meta Forum App | సోషల్ మీడియా దిగ్గజం మెటా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే తన కొత్త సోషల్ యాప్ ను ఫోరం పేరిట నిశ్శబ్దంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో కనిపించగా, సోషల్ మీడియా కన్సల్టెంట్ మ్యాట్ నవారా దీనిని మొదట గుర్తించారు.
Technology | Published On May 23, 2026, 10.23 am IST
Meta Forum App | సోషల్ మీడియా దిగ్గజం మెటా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే తన కొత్త సోషల్ యాప్ ను ఫోరం పేరిట నిశ్శబ్దంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో కనిపించగా, సోషల్ మీడియా కన్సల్టెంట్ మ్యాట్ నవారా దీనిని మొదట గుర్తించారు. చర్చలు, కమ్యూనిటీ సంభాషణలు, ప్రశ్నలు-సమాధానాలపై దృష్టి పెట్టిన ఈ ప్లాట్‌ఫామ్, ప్రముఖ డిస్కషన్ వెబ్‌సైట్ రెడిట్ కు ప్రత్యక్ష పోటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోరం యాప్ ప్రధానంగా ఫేస్‌బుక్ గ్రూప్స్ చుట్టూ నిర్మాణమైంది. డీపర్ డిస్కషన్స్, నిజమైన సమాధానాలు, ముఖ్యమైన కమ్యూనిటీల కోసం ప్రత్యేక స్థలం అంటూ యాప్ వివరణలో పేర్కొన్నారు. నిష్ హాబీస్, లోకల్ రికమండేషన్స్, సపోర్ట్ గ్రూప్స్ వంటి విభిన్న ఆసక్తులపై ప్రజలను ఒకచోట చేర్చడమే దీని లక్ష్యంగా తెలుస్తోంది. ఈ యాప్‌ను ఉపయోగించేందుకు వినియోగదారులు ఫేస్‌బుక్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న గ్రూప్స్, ప్రొఫైల్ వివరాలు, యాక్టివిటీ మొత్తం ఆటోమేటిక్‌గా ఫోరంలోకి వస్తాయి. అయితే వినియోగదారులు తమ అసలు పేరుకు బదులుగా నిక్‌నేమ్‌తో పోస్టులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫోరం ద్వారా చేసిన పోస్టులు సంబంధిత ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో కూడా కనిపిస్తాయి.
అడ్మిన్ల కోసం ప్రత్యేక టూల్స్..
యాప్ ఇంటర్‌ఫేస్‌ను పరిశీలిస్తే, వినియోగదారుల గ్రూప్స్‌లో జరుగుతున్న చర్చలు ఫీడ్ రూపంలో కనిపిస్తాయి. అలాగే కొనసాగుతున్న సంభాషణలను ఫాలో అవుతూ, మధ్యలో ఆపిన చోట నుంచే తిరిగి కొనసాగించే సౌకర్యం కూడా ఉంటుంది. ఫోరంలో ప్రత్యేకంగా ఆస్క్ అనే ఫీచర్‌ను అందించారు. ఇది వివిధ గ్రూప్స్ నుంచి సమాధానాలను సేకరించి యూజర్లకు త్వరగా సూచనలు అందిస్తుంది. అలాగే ఏఐ ఆధారిత ట్యాబ్ కూడా ఉండనుంది. ఇది యాప్‌లోని వివిధ కమ్యూనిటీల నుంచి త్వరిత సమాధానాలు అందించేందుకు ఉపయోగపడుతుంది. గ్రూప్ అడ్మిన్ల కోసం కూడా ప్రత్యేక టూల్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఉన్న అడ్మిన్ కంట్రోల్స్ అన్నీ ఫోరంలో కూడా కొనసాగుతాయి. అంతేకాదు, ఏఐ ఆధారిత అడ్మిన్ అసిస్టెంట్ ద్వారా కంటెంట్ మోడరేషన్, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, గ్రూప్ హెల్త్ నిర్వహణ వంటి పనులు సులభతరం కానున్నాయి.
ప్రస్తుతం ఈ యాప్ ఐఓఎస్ 18 లేదా అంతకంటే పై వెర్షన్ ఉన్న డివైస్‌లలో మాత్రమే పనిచేస్తోంది. 13 ఏళ్లు పైబడిన వారికి అనుకూలంగా రేటింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ యాప్ భారత్‌లో అందుబాటులోకి రాలేదు. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విడుదల చేసినట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
మే 26, 2026

WhatsApp | ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు వాట్సాప్ చాట్లను ఇలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయండి..
మే 25, 2026

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా

Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..



