Lenovo Yoga Slim 7 | అత్యంత స్లిమ్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయిన లెనోవో కొత్త ల్యాప్ టాప్‌లు
Lenovo Yoga Slim 7 | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో భారత మార్కెట్‌లో నూతన శ్రేణి ల్యాప్ టాప్‌లను విడుదల చేసింది. యోగా, ఐడియా ప్యాడ్ సిరీస్‌లలో ఈ ల్యాప్ టాప్‌లు లాంచ్ అయ్యాయి. జెన్11 సిరీస్‌గా లెనోవో సంస్థ వీటిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త సిరీస్ ల్యాప్ టాప్‌లను ప్రీమియం, కన్వర్టబుల్ విభాగాల్లో లాంచ్ చేశారు.
Technology | Published On Apr 8, 2026, 2.26 pm IST
Lenovo Yoga Slim 7 | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో భారత మార్కెట్‌లో నూతన శ్రేణి ల్యాప్ టాప్‌లను విడుదల చేసింది. యోగా, ఐడియా ప్యాడ్ సిరీస్‌లలో ఈ ల్యాప్ టాప్‌లు లాంచ్ అయ్యాయి. జెన్11 సిరీస్‌గా లెనోవో సంస్థ వీటిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త సిరీస్ ల్యాప్ టాప్‌లను ప్రీమియం, కన్వర్టబుల్ విభాగాల్లో లాంచ్ చేశారు. అలాగే రోజువారీ అవసరాల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్లతోపాటు ఏఐ ఫీచర్లను కూడా ఈ ల్యాప్ టాప్‌లలో అందిస్తున్నారు. యోగా స్లిమ్ 7 సిరీస్, యోగా7 2-ఇన్-1 సిరీస్, ఐడియా ప్యాడ్5 2-ఇన్-1 సిరీస్‌లలో లెనోవో కొత్త ల్యాప్ టాప్‌లు విడుదలయ్యాయి. ఇవి ఇంటెల్, ఏఎండీ, క్వాల్ కామ్ కంపెనీలకు చెందిన ప్రాసెసర్లను కలిగి ఉన్నాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్3, ఏఎండీ రైజెన్ ఏఐ400 సిరీస్, స్నాప్ డ్రాగన్ ఎక్స్2 ప్రాసెసర్‌లను ఈ ల్యాప్ టాప్‌లలో ఏర్పాటు చేశారు. అందువల్ల ఇవి అద్భుతమైన ప్రదర్శనను ఇస్తాయి.
యోగా స్లిమ్ 7ఐ అల్ట్రా ఆరా ఎడిషన్..
యోగా స్లిమ్7 సిరీస్ ల్యాప్ టాప్ మోడల్స్ చాలా తక్కువ బరువు కలిగి ఉండి స్లిమ్ డిజైన్‌లో ఉంటాయి. యోగా స్లిమ్7ఐ అల్ట్రా ఆరా ఎడిషన్ మెటల్ అల్లాయ్ చాసిస్‌తో నిర్మాణమైంది. దాదాపు 975 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్9 ప్రాసెసర్‌లను ఇచ్చారు. లెనోవో ఏఐ కోర్‌కు వీటిల్లో సపోర్ట్ లభిస్తుంది. ప్యూర్ సైట్ ప్రొ పీఓలెడ్ డిస్‌ప్లేను ఈ ల్యాప్ టాప్‌లలో ఇచ్చారు. అలాగే ఫిఫా ఎడిషన్ వెర్షన్‌ను కూడా ఈ సిరీస్‌లో లాంచ్ చేయనున్నారు. యోగా స్లిమ్7ఎక్స్ మోడళ్లలో స్నాప్ డ్రాగన్ ఎక్స్2 ఎలైట్ ప్రాసెసర్ కలిగిన వేరియెంట్లు కూడా ఉన్నాయి. ఇవి 13.9 మిల్లీమీటర్ల సన్నని డిజైన్‌ను కలిగి ఉంటాయి. 1.17 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. ఈ ల్యాప్ టాప్‌లను ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే సాధారణ వాడకానికి గరిష్టంగా 31 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. వీటిల్లో ముందు వైపు 9 మెగా పిక్సల్ వెబ్ కెమెరా ఉండగా, నాలుగు మైక్రోఫోన్లను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. ఓలెడ్ తరహా డిస్‌ప్లేలను ఇవి కలిగి ఉన్నాయి.
యోగా7 2-ఇన్-1 సిరీస్..
యోగా7 2-ఇన్-1 సిరీస్ ల్యాప్ టాప్‌లలో ఇంటెల్‌తోపాటు ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లను ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్‌లను 360 డిగ్రీల కన్వర్టబుల్ డిజైన్‌తో రూపొందించారు. అందువల్ల వీటిని ల్యాప్ టాప్‌గా, టాబ్లెట్‌గా రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. లెనోవో యోగా పెన్ జెన్2కు సపోర్ట్‌ను ఇచ్చారు. ప్యూర్ సైట్ ప్రొ ఓలెడ్ డిస్‌ప్లే, డాల్బీ విజన్, 120 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను వీటిల్లో ఇచ్చారు. ఇవి 70వాట్ అవర్ బ్యాటరీని కలిగి ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. క్వాడ్ స్పీకర్లు, 5 మెగాపిక్సల్ వెబ్ కెమెరా ఉన్నాయి. ఇంటెల్ మోడల్స్‌లో స్మార్ట్ షేర్, స్మార్ట్ మోడ్స్, స్మార్ట్ కేర్ తదితర అదనపు సదుపాయాలను ఇచ్చారు. ఏఎండీ మోడల్స్‌లో క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ కోసం ప్రత్యేక ఏఐ ఫీచర్లను ఇచ్చారు.

ఐడియా ప్యాడ్5 2-ఇన్-1 సిరీస్..
లెనోవో లాంచ్ చేసిన ఐడియా ప్యాడ్5 2-ఇన్-1 సిరీస్ ల్యాప్ టాప్‌లు కూడా 360 డిగ్రీల కన్వర్టబుల్ ఆప్షన్‌ను కలిగి ఉన్నాయి. అందువల్ల వీటిని కూడా ల్యాప్ టాప్‌లుగా, ట్యాబ్లెట్లుగా వాడుకోవచ్చు. వీటిల్లో ఇంటెల్ కోర్ అల్ట్రా జెన్3 ప్రాసెసర్‌లను ఇచ్చారు. లెనోవో స్మార్ట్ నోట్, వైఫై 7, డాల్బీ ఆడియో, స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి. 60వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. విద్యార్థులు, రోజువారీ పనుల కోసం ఈ ల్యాప్ టాప్‌లు ఉపయోగపడతాయి.
ధర వివరాలు..
ఈ ల్యాప్ టాప్‌లను లెనోవో ఆకర్షణీయమైన ధరలకు అందిస్తోంది. ఐడియా ప్యాడ్ జెన్11 ల్యాప్‌టాప్‌లు ఇప్పటికే అందుబాటులోకి రాగా, యోగా స్లిమ్ 7ఎక్స్ సిరీస్ మాత్రం ఏప్రిల్ 21 నుంచి లభిస్తాయి. లెనోవో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ల్యాప్ టాప్‌లను విక్రయిస్తున్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌లను కస్టమర్లు తమ అభిరుచులకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేసుకుని కొనుగోలు చేసే విధంగా సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఐడియా ప్యాడ్5 2-ఇన్-1 మోడల్స్ రూ.1,19,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉండగా, యోగా7ఎ 2-ఇన్-1 ల్యాప్ టాప్‌లు రూ.1,32,990 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. అలాగే యోగా స్లిమ్ 7ఎక్స్ మోడల్స్ రూ.1,32,990కి, యోగా 7ఐ 2-ఇన్-1 మోడల్స్ రూ.1,36,990కి, యోగా స్లిమ్ 7ఐ అల్ట్రా ఆరా ఎడిషన్ మోడల్స్ రూ.1,99,990 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. 'యాప్'తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!
- ●Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో 8-4-3 రూల్.. ఏంటిది.. దీంతో భారీ కార్పస్ ఎలా సాధ్యమవుతుంది..?
- ●Karne Prabhakar | ఏకపక్ష నిర్ణయం.. రేవంత్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం : మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
- ●KTR Challenges Revanth Reddy | బాహుబలిలో భల్లాల దేవుడి గతే రేవంత్‌కి పడుతుంది..!
- ●India EV | జూన్‌లో ఈవీ ద్విచక్ర వాహనాల దూకుడు.. రోజుకు 6 వేలకుపైగా అమ్మకాలు..

Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. 'యాప్'తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!

Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు

Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో 8-4-3 రూల్.. ఏంటిది.. దీంతో భారీ కార్పస్ ఎలా సాధ్యమవుతుంది..?

Karne Prabhakar | ఏకపక్ష నిర్ణయం.. రేవంత్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం : మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్






