Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు
Rythu Bharosa | రాష్ట్రంలో అర్హత రైతులకు రైతు భరోసా( Rythu Bharosa ) నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 2 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా, బుధవారం మూడు ఎకరాల్లోపు రైతులకు నిధులు విడుదల చేశారు.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అర్హత రైతులకు రైతు భరోసా( Rythu Bharosa ) నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 2 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా, బుధవారం మూడు ఎకరాల్లోపు రైతులకు నిధులు విడుదల చేశారు.
బుధవారం రెండో దశలో భాగంగా 10.68 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 1590.02 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం 54.96 లక్షల మంది రైతులకు చెందిన 67.87 ఎకరాలకు రైతుభరోసా చెల్లించామని తెలిపారు. రైతుభరోసా కింద ఇప్పటివరకు 4072.04 కోట్లు విడుదల చేశామన్నారు.
సిద్దిపేటలో యూరియా బస్తాల అక్రమాలు
యూరియా యాప్ ద్వారా సిద్దిపేటలో యూరియా బస్తాల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. 6000 యూరియా బస్తాలు మాయమైన కేసులో డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. వ్యవసాయశాఖ అధికారిని కూడా సస్పెండ్ చేశాం. యూరియా యాప్ వల్లే అక్రమాలను గుర్తించడం సాధ్యమైంది. యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయి. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
- ●IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Woman dies in hospital | ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

HMDA | వాహనదారులకు గుడ్న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!




