Lenovo ThinkBook 14x | లెనోవో నుంచి 990 గ్రాముల థింక్‌బుక్.. ధర ఎంతంటే?
Lenovo ThinkBook 14x | హైబ్రిడ్ వర్క్, మొబైల్ ప్రొఫెషనల్స్, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లెనోవో ఇండియాలో థింక్‌బుక్ 14ఎక్స్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. పూర్తిగా అల్యూమినియం బాడీతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ బరువు 990 గ్రాముల కంటే తక్కువగా ఉండగా, మందం కేవలం 12.9 మిల్లీమీటర్లుగా ఉంది. థింక్‌బుక్ 14ఎక్స్‌లో 14 ఇంచుల 2.8కె ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.
Technology | Published On Oct 7, 2026, 5.28 pm IST
Lenovo ThinkBook 14x | హైబ్రిడ్ వర్క్, మొబైల్ ప్రొఫెషనల్స్, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లెనోవో ఇండియాలో థింక్‌బుక్ 14ఎక్స్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. పూర్తిగా అల్యూమినియం బాడీతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ బరువు 990 గ్రాముల కంటే తక్కువగా ఉండగా, మందం కేవలం 12.9 మిల్లీమీటర్లుగా ఉంది. థింక్‌బుక్ 14ఎక్స్‌లో 14 ఇంచుల 2.8కె ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కళ్లపై బ్లూ లైట్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఐసేఫ్ సర్టిఫైడ్ 2.0 టెక్నాలజీని కూడా అందించారు. ల్యాప్‌టాప్‌లో బ్యాక్‌లిట్ కీబోర్డ్, వెడల్పైన గ్లాస్ టచ్‌ప్యాడ్ ఉన్నాయి. పలు డివైస్‌లను అనుసంధానం చేసుకునేందుకు లెనోవో స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ కూడా ఉంది.
మిలిటరీ గ్రేడ్ బిల్వ్ క్వాలిటీ..
కోపైలట్ ప్లస్ పీసీగా వచ్చిన థింక్‌బుక్ 14ఎక్స్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీని కలిగి ఉంది. అందువల్ల బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. రోజంతా వినియోగించుకునేలా దీర్ఘకాలిక బ్యాటరీని అందించారు. భద్రత, గోప్యత కోసం ఇందులో ప్రత్యేక సెన్సార్లను కూడా లెనోవో అందించింది. పరిసర పరిస్థితులకు అనుగుణంగా కీబోర్డ్ లైట్ స్థాయిని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయడంతోపాటు, యూజర్ భుజం మీదుగా మరొకరు స్క్రీన్‌ను చూస్తున్నట్లు గుర్తిస్తే స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా బ్లర్ చేసే సామర్థ్యం ఉంది. కనెక్టివిటీ పరంగా థింక్‌బుక్ 14ఎక్స్ వైఫై 7కు మద్దతు ఇస్తుంది. ఇందులో రెండు యూఎస్‌బీ సి పోర్టులు, ఎప్పుడూ ఛార్జింగ్ అందించే రెండు యూఎస్‌బీ ఎ పోర్టులు, ఒక ఫుల్-సైజ్ హెచ్‌డీఎంఐ పోర్టు ఉన్నాయి. అదనంగా రెండు ఎస్‌ఎస్‌డీ స్లాట్లు ఉండడంతో భవిష్యత్తులో స్టోరేజ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా పెంచుకోవచ్చు.
ధర ఎంతంటే..
థింక్‌బుక్ 14ఎక్స్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 226వి లేదా ఇంటెల్ కోర్ అల్ట్రా 7 256వి ప్రాసెసర్లను ఎంచుకోవచ్చు. డిస్‌ప్లే విషయంలో ఎల్‌ఈడీ, ఎల్‌ఈడీ టచ్, 2.8కె ఓఎల్‌ఈడీ వేరియంట్లు ఉన్నాయి. ఓఎల్‌ఈడీ వేరియంట్‌లో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, ఎస్‌ఆర్‌జీబీ కవరేజ్ లభిస్తాయి. మెమరీ 16జీబీగా ఉండగా, స్టోరేజ్ కోసం 512జీబీ లేదా 1టీబీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం వేరియంట్‌ను బట్టి 54.7 లేదా 65 వాట్ అవర్‌గా ఉంటుంది. వైఫై 6ఈ లేదా వైఫై 7 కనెక్టివిటీ, విండోస్ 11 ప్రొ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. భారత్‌లో లెనోవో థింక్‌బుక్ 14ఎక్స్ ప్రారంభ ధర రూ.1,08,990గా ఉంది. ఇది లెనోవో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. కస్టమ్ టు ఆర్డర్ ఎంపిక ద్వారా కొనుగోలుదారులు తమకు కావాల్సిన స్పెసిఫికేషన్లను ఎంచుకుని ల్యాప్‌టాప్‌ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
- ●Prabhas | ప్రభాస్ సినిమాల రిలీజ్ ఆర్డర్ మారింది.. ముందు వచ్చేది స్పిరిట్ మూవీయే..!
- ●US Bond Yield | అమెరికా బాండ్లపై అమ్మకాల ఒత్తిడి.. 24 ఏళ్ల గరిష్ఠానికి 30 ఏళ్ల బాండ్ ఈల్డ్..
- ●Form 7 Voter Deletion Fraud | ఓటర్ల జాబితా నుంచి పేర్ల గల్లంతు కుట్ర: బీజేపీ ఏజెంట్‌పై ఎఫ్ఐఆర్
- ●Double Engine Disaster | "డబుల్ డిజాస్టర్".. 5 నెలల్లో 2,454 అత్యాచారాలు, 600 హత్యలు
- ●Harish Rao | రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని వెనక్కి తీసుకోవాలి
- ●Rahul Gandhi | నా గోల్ 100.. ప్రతీ ఎఫ్ఐఆర్ను మెడల్‌గా భావిస్తా : రాహుల్ గాంధీ

Prabhas | ప్రభాస్ సినిమాల రిలీజ్ ఆర్డర్ మారింది.. ముందు వచ్చేది స్పిరిట్ మూవీయే..!

US Bond Yield | అమెరికా బాండ్లపై అమ్మకాల ఒత్తిడి.. 24 ఏళ్ల గరిష్ఠానికి 30 ఏళ్ల బాండ్ ఈల్డ్..

Form 7 Voter Deletion Fraud | ఓటర్ల జాబితా నుంచి పేర్ల గల్లంతు కుట్ర: బీజేపీ ఏజెంట్‌పై ఎఫ్ఐఆర్

Double Engine Disaster | "డబుల్ డిజాస్టర్".. 5 నెలల్లో 2,454 అత్యాచారాలు, 600 హత్యలు





