Lenovo IdeaPad Slim 3 Gen 11 | లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 లాంచ్.. ఏఐ ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్..
Lenovo IdeaPad Slim 3 Gen 11 | లెనోవో భారత మార్కెట్లో తన కొత్త థిన్-అండ్-లైట్ ల్యాప్‌టాప్ ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 ని అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌తోపాటు కోపైలట్+ పీసీ సామర్థ్యాలు అందుబాటులో ఉన్నాయి.
Technology | Published On Jun 13, 2026, 1.17 pm IST
Lenovo IdeaPad Slim 3 Gen 11 | లెనోవో భారత మార్కెట్లో తన కొత్త థిన్-అండ్-లైట్ ల్యాప్‌టాప్ ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 ని అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌తోపాటు కోపైలట్+ పీసీ సామర్థ్యాలు అందుబాటులో ఉన్నాయి. 14, 15 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో వచ్చిన ఈ డివైస్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. లెనోవో ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, ప్రొడక్టివిటీ టూల్స్‌ను కూడా ఇందులో అందించింది. 60 వాట్ అవర్ బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులోకి వచ్చింది. కాగా లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 ప్రారంభ ధరను రూ.1,09,990గా నిర్ణయించారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకునేలా కస్టమ్-టు-ఆర్డర్ (సీటీఓ) ఆప్షన్‌ను కూడా లెనోవో అందిస్తోంది.
బ్యాంకు ఆఫర్లు..
ఈ ల్యాప్‌టాప్ లూనా గ్రే కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, గరిష్టంగా రూ.10వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, అలాగే రూ.10వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తున్నారు. సాధారణంగా రూ.20వేల విలువ చేసే పెర్‌ప్లెక్సిటీ ప్రో ఒక సంవత్సర సభ్యత్వాన్ని కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే, 14, 15 ఇంచుల డిస్‌ప్లే మోడళ్లలో రెండింటికీ 16:10 ఆస్పెక్ట్ రేషియో, గరిష్టంగా 400 నిట్స్ బ్రైట్‌నెస్ అందుబాటులో ఉంది. సన్నని బెజెల్స్ కారణంగా స్క్రీన్‌కు 90 శాతం యాక్టివ్ ఏరియా లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే తక్కువ బ్లూ లైట్ ఉద్గారాల కోసం టీయూవీ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్, 16జీబీ మెమరీ, గరిష్టంగా 512జీబీ పీసీఐఈ జెన్4 ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ అందించారు. ఈ ల్యాప్‌టాప్ కోపైలట్+ పీసీగా సర్టిఫై అయింది. 1.3 మిల్లీమీటర్ల కీ ట్రావెల్ కలిగిన కీబోర్డ్‌తో పాటు, ఆప్షనల్ బ్యాక్‌లిట్ కీబోర్డ్ కూడా ఉంది. వీడియో కాల్స్ కోసం ఎఫ్‌హెచ్‌డీ ఐఆర్ కెమెరా, ప్రైవసీ షటర్, విండోస్ హలో ఫేషియల్ అథెంటికేషన్ వంటి ఫీచర్లు అందించారు.
లెనోవో స్మార్ట్ ఫీచర్లు..
కోపైలట్+ సామర్థ్యాల ద్వారా ఏఐ ఆధారిత సహాయం, ఇంటెలిజెంట్ సెర్చ్, రియల్-టైమ్ అనువాదం, ప్రొడక్టివిటీ టూల్స్ వంటి ఫీచర్లు విండోస్‌లోనే అందుబాటులో ఉంటాయి. అలాగే పనితీరు అప్‌డేట్, భద్రత, సులభమైన డివైస్ మేనేజ్‌మెంట్ కోసం లెనోవో స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా వై-ఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-ఏ పోర్టులు, డిస్‌ప్లేపోర్ట్, పవర్ డెలివరీ సపోర్ట్‌తోయూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, హెచ్‌డీఎంఐ 1.4, ఎస్‌డీ కార్డ్ రీడర్, 3.5ఎంఎం ఆడియో జాక్‌ను అందించారు. బ్యాటరీ విభాగంలో 60 వాట్ అవర్ బ్యాటరీతోపాటు రాపిడ్ చార్జ్ బూస్ట్ టెక్నాలజీని ఇచ్చారు. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల వరకు వినియోగం సాధ్యమవుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఎనర్జీ స్టార్ 9.0 సర్టిఫికేషన్, ఈపీఈఏటీ గోల్డ్ రిజిస్ట్రేషన్, ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఈ ల్యాప్‌టాప్‌కు లభించాయి.
సంబంధిత వార్తలు

Lenovo ThinkBook 14x | లెనోవో నుంచి 990 గ్రాముల థింక్‌బుక్.. ధర ఎంతంటే?
అక్టోబర్ 7, 2026

Copilot Plus PC | కోపైలట్ ప్లస్ పీసీ అంటే ఏమిటి.. సాధారణ పీసీలకు, వీటికి తేడా ఏంటి..?
జూన్ 5, 2026

ASUS AiO VM441 | ఏఐ పవర్‌తో అసుస్ కొత్త ఏఐఓ పీసీ.. తొలి స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ ఆలిన్ వన్ డెస్క్‌టాప్..
మే 25, 2026
తాజావార్తలు
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన
- ●Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
- ●Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్..! సోషల్ మీడియాలో ట్రోల్స్..!
- ●YIIRS | ఊపందుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
- ●RS Praveen Kumar | అసలు ఎవరీ సాయి ప్రసాద్? ఆయన వెనుక సీఎం ఉన్నారా? నామ్ కే వాస్తే కేసులు పెట్టాలని చెప్పిందెవరు?

Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్..! సోషల్ మీడియాలో ట్రోల్స్..!



