త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas | ప్రభాస్‌ సినిమాల రిలీజ్‌ ఆర్డర్ మారింది.. ముందు వ‌చ్చేది స్పిరిట్ మూవీయే..!

Prabhas | యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాల విడుదల విషయంలో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ప్రభాస్‌ కెరీర్‌లో 24వ సినిమాగా ‘ఫౌజీ’, 25వ చిత్రంగా ‘స్పిరిట్‌’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

P

Entertainment | Published On Oct 7, 2026, 5.24 pm IST

Prabhas | ప్రభాస్‌ సినిమాల రిలీజ్‌ ఆర్డర్ మారింది.. ముందు వ‌చ్చేది స్పిరిట్ మూవీయే..!
Advertisement

Prabhas | యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాల విడుదల విషయంలో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ప్రభాస్‌ కెరీర్‌లో 24వ సినిమాగా ‘ఫౌజీ’, 25వ చిత్రంగా ‘స్పిరిట్‌’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ‘ఫౌజీ’ షూటింగ్‌ ఆలస్యం కావడంతో రిలీజ్‌ ఆర్డర్‌ మారినట్లు సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ని 2026 డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించింది. అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ రిలీజ్‌ ప్లాన్‌ నుంచి సినిమాను తప్పించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి ఇంకా 60 రోజులకు పైగా షూటింగ్‌ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ‘ఫౌజీ’ని 2027 ద్వితీయార్థంలో విడుదల చేయాలని ప్రభాస్‌ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ షూటింగ్‌ మాత్రం అనుకున్న ప్రకారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణ పూర్తయితే 2027 మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ‘ఫౌజీ’ కంటే ముందుగా ‘స్పిరిట్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తద్వారా ప్రభాస్‌ కెరీర్‌లో 25వ సినిమాగా రావాల్సిన ‘స్పిరిట్‌’.. ఆయన తదుపరి థియేట్రికల్‌ రిలీజ్‌గా నిలవనుంది.

యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్న ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. డ్రగ్‌ మాఫియాను ఎదుర్కొనే మాజీ పోలీస్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. భద్రకాళి పిక్చర్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ‘ఫౌజీ’కి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రణాళికలు అమలైతే 2027లో ప్రభాస్‌ నుంచి వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్న‌ది. ఈ మూవీలు పూర్త‌య్యాక ప్రభాస్ స‌లార్ త‌దిత‌ర ప్రాజెక్టులు చేయాల్సి ఉంది.

Advertisement
Advertisement