త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒక‌రి అరెస్ట్‌

Chinese Manja Seize | నిషేధిత చైనీస్ సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మాంజాను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హైదరాబాద్‌ చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.7.50 లక్షల విలువైన 480 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు.

P

Hyderabad | Published On Oct 7, 2026, 6.56 pm IST

Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒక‌రి అరెస్ట్‌
Advertisement

Chinese Manja Seize | నిషేధిత చైనీస్ సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మాంజాను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హైదరాబాద్‌ చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.7.50 లక్షల విలువైన 480 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పురానాపూల్‌ జాలి హనుమాన్‌కు చెందిన అభిషేక్‌ సింగ్‌ (26) మంగళ్‌హాట్‌లో పతంగుల దుకాణం నిర్వహిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా చైనీస్‌ మాంజాను అధిక ధరలకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జించాలని పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మోహసిన్‌ నుంచి 10 కార్టన్లలో 480 బాబిన్ల మాంజాను ఆర్డర్‌ చేశాడు.

మంగళవారం భట్కో ట్రాన్స్‌పోర్ట్‌ వద్ద పార్సిల్‌ తీసుకునేందుకు వచ్చిన అభిషేక్‌ సింగ్‌ను టాస్క్‌ఫోర్స్‌, కాలాపత్తర్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. అతడి నుంచి 10 కార్టన్లలోని 480 మోనో గోల్డ్‌ చైనీస్‌ సింథటిక్‌ నైలాన్‌ గ్లాస్‌ కోటెడ్‌ మాంజాతోపాటు రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ శాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పక్షులు, జంతువులు, మానవుల ప్రాణాలకు ప్రమాదకరమైన మాంజాను అక్రమంగా తెప్పించి నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్ సైదాబాబు పర్యవేక్షణలో ఎస్‌ఐలు ఎం మహేశ్‌, కే రామారావు, ఎం మధు, పీసీ మహమ్మద్‌ సైఫ్‌ మోహియుద్దీన్‌, కాలాపత్తర్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కొన‌సాగుతోంద‌ని చార్మినార్‌-గోల్కొండ జోన్ ఇన్‌చార్జి అడిష‌న‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ కేఎస్ రామారావు తెలిపారు.

Advertisement
Advertisement