త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్‌..! సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌..!

Janhvi Kapoor | బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తనలోని ఓ విచిత్రమైన టాలెంట్‌ను బయటపెట్టింది. తన నాలుకను దాదాపు 360 డిగ్రీల వరకు తిప్పగలనని వెల్లడించింది. అయితే ఇది పెద్దగా ఉపయోగపడని టాలెంట్‌ అని.. ‘చాలా స్టుపిడ్‌, యూజ్‌లెస్‌ స్కిల్‌’ అంటూ జాన్వీ స్వయంగా చెప్పింది.

P

Entertainment | Published On Oct 7, 2026, 6.44 pm IST

Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్‌..! సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌..!
Advertisement

Janhvi Kapoor | బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తనలోని ఓ విచిత్రమైన టాలెంట్‌ను బయటపెట్టింది. తన నాలుకను దాదాపు 360 డిగ్రీల వరకు తిప్పగలనని వెల్లడించింది. అయితే ఇది పెద్దగా ఉపయోగపడని టాలెంట్‌ అని.. ‘చాలా స్టుపిడ్‌, యూజ్‌లెస్‌ స్కిల్‌’ అంటూ జాన్వీ స్వయంగా చెప్పింది. పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీని.. తనలో దాగి ఉన్న టాలెంట్‌ ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో తన క్లాస్‌మేట్స్‌ నాలుకతో ముక్కును తాకించేందుకు పోటీపడేవారని జాన్వీ గుర్తుచేసుకుంది. తాను మాత్రం నాలుకతో ముక్కును తాకించలేకపోయేదానినని తెలిపింది. అయితే ఇతర పిల్లలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో తాను కూడా ఏదైనా చేయాలని ప్రయత్నించిందట. ఈ క్రమంలో తన నాలుకను ఓ ప్రత్యేకమైన రీతిలో తిప్పగలనని గుర్తించానని చెప్పింది. అప్పటి నుంచి అదే తనకు ఓ విచిత్రమైన పార్టీ ట్రిక్‌గా మారిందని వివరించింది.

‘ధడక్‌’తో హీరోయిన్‌గా..

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన జాన్వీ కపూర్‌.. 2018లో ‘ధడక్‌’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ తర్వాత గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌, మిలీ, గుడ్‌ లక్‌ జెర్రీ, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, ఉలఝ్‌ వంటి చిత్రాల్లో నటించింది. గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

దేవరతో తెలుగులోకి..

జాన్వీ కపూర్‌ 2024లో ‘దేవర: పార్ట్‌ 1’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తంగం పాత్రలో కనిపించింది. తొలి తెలుగు సినిమాతోనే భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న జాన్వీ.. ఆ తర్వాత కూడా టాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’లోనూ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం జాన్వీ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది.

టైగర్‌ ష్రాఫ్‌, లక్ష్యతో కలిసి ‘లగ్‌ జా గలే’ చిత్రంలో నటిస్తోంది. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా జాన్వీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే, జాన్వీ క‌పూర్ చెప్పిన హిడెన్ టాలెంట్‌పై నెటిజ‌న్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదేం టాలెంట్ అని ప‌లువురు ప్ర‌శ్నించ‌గా.. దీని కంటే న‌ట‌పై దృష్టి సారిస్తే బాగుంటుంద‌ని ప‌లువురు సూచించారు. నెపో కిడ్‌కు ఇవే టాలెంట్స్ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

 

Advertisement
Advertisement