Lenovo Idea Tab Pro Gen 2 | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన లెనోవో కొత్త ట్యాబ్.. ఏఐ ఫీచర్లు ఇన్‌బిల్ట్‌గా..
Lenovo Idea Tab Pro Gen 2 | కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఐడియా ట్యాబ్ ప్రొ జెన్2 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ట్యాబ్‌ను ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ఎంటర్‌టెయిన్‌మెంట్ కోరుకునేవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Technology | Published On Apr 29, 2026, 10.17 am IST
Lenovo Idea Tab Pro Gen 2 | కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఐడియా ట్యాబ్ ప్రొ జెన్2 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ట్యాబ్‌ను ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ఎంటర్‌టెయిన్‌మెంట్ కోరుకునేవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ ట్యాబ్ స్లిమ్‌గా కేవలం 6.2ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే 598 గ్రాముల బరువు ఉంటుంది. కనుక ప్రయాణాల్లో దీన్ని తీసుకెళ్లడం తేలిగ్గా ఉంటుంది. ఈ ట్యాబ్‌లో 13 ఇంచుల ప్యూర్ సైట్ ప్రొ డిస్‌ప్లే ఉండగా, దీనికి 3.5కె హై రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. ఔట్ డోర్ వీక్షణ మరింత స్పష్టంగా ఉండేలా 800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఈ ట్యాబ్‌లో స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్4 ప్రాసెసర్, 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్‌ను ఇచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు.
భారీ బ్యాటరీ..
ఇక ఈ ట్యాబ్‌కు ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీయే అని చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 10,200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అందువల్ల ఈ ట్యాబ్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో జేబీఎల్ కంపెనీకి చెందిన క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌ను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఉన్నందున సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. డ్యుయల్ బ్యాండ్ వైఫైని ఇది సపోర్ట్ చేస్తుంది. అందువల్ల హై స్పీడ్ వైఫై సేవలను పొందవచ్చు. అలాగే బ్లూటూత్ 6.0 ను ఇచ్చినందున కనెక్టివిటీ బాగుంటుంది.
ఇన్‌బిల్ట్ ఏఐ సేవలు..
ఐడియా ట్యాబ్ ప్రొ జెన్2లో ప్రత్యేకంగా లెనోవో కిరా (Qira)ను లాంచ్ చేసింది. ఇది ఒక ఏఐ ప్లాట్‌ఫామ్ కాగా దీని సహాయంతో యూజక్లు ట్యాబ్ ద్వారా అనేక పనులను వేగంగా నిర్వహించుకోవచ్చు. స్మార్ట్ రీడర్, లెనోవో ఏఐ నోట్స్ ద్వారా లెనోవో ట్యాబ్ పెన్ ప్లస్‌ను ఉపయోగించి సెలెక్ట్స్ చేసిన టెక్ట్స్‌ను కుదించి క్లుప్తంగా వివరాలను తెలుసుకోవడం, వివరణలు ఇవ్వడం, భవిష్యత్తు అవసరాలకు ఆ టెక్ట్స్‌ను నోట్ రూపంలో సేవ్ చేసి పెట్టడం వంటి పనులను ఇది నిర్వర్తిస్తుంది. అలాగే లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ద్వారా సంభాషణలను రియల్‌టైమ్‌లో అనువదించుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా భాషలో లెక్చర్ ఇచ్చినప్పుడు దీని సహాయంతో వారు మాట్లాడే విషయాలను సులభంగా తర్జుమా చేసి తెలుసుకోవచ్చు. ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే లెనోవో స్మార్ట్ ఏఐ ఇన్‌పుట్ అనే ప్రత్యేక ఫీచర్ వల్ల యూజర్లు ట్యాబ్‌కు కనెక్ట్ అయిన కీబోర్డుపై స్మార్ట్ కీని ప్రెస్ చేస్తే టెక్ట్స్ జనరేషన్ ఎనేబుల్ అవుతుంది. దీంతో సహజసిద్ధమైన భాషలో కమాండ్లను ఇస్తూ ట్రాన్స్‌లేషన్ సేవలను పొందవచ్చు. ఇలా పలు ఏఐ ఫీచర్లను ఈ ట్యాబ్‌లో ఇచ్చారు.
మల్టిపుల్ యాక్ససరీస్ కనెక్టివిటీకి సపోర్ఠ్..
ఈ ట్యాబ్‌లో ప్రత్యేకమైన ఏఐ క్రియేషన్ టూల్స్ కూడా ఉన్నాయి. గూగుల్ జెమిని ఏఐ కి సపోర్ట్‌ను ఇచ్చారు. దీని వల్ల సర్కిల్ టు సెర్చ్, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యాబ్ లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. దీనికి ఆండ్రాయిడ్ 18 వరకు ఓఎస్ అప్ డేట్స్, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను 2030 వరకు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇక ఈ ట్యాబ్ మల్టిపుల్ యాక్ససరీస్ కనెక్టివిటీకి సపోర్ఠ్ ఇస్తుంది. దీనికి భిన్న రకాల యాక్ససరీలను కనెక్ట్ చేసుకోవచ్చు. లెనోవో ట్యాబ్ పెన్ ప్లస్ (బాక్స్‌లో వస్తుంది), 2 ఇన్ 1 కీబోర్డు ప్యాక్ (ప్రత్యేకంగా కొనాలి), ఫోలియో కేస్ (ప్రత్యేకంగా కొనాలి) వంటి యాక్ససరీలను కనెక్ట్ చేయవచ్చు. ఈ ట్యాబ్‌లో వైఫై 6ఇ/7 టెక్నాలజీ ఉన్నందున హైస్పీడ్ ఇంటర్నెట్, నెట్‌వర్క్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
లెనోవో ఐడియా ట్యాబ్ ప్రొ జెన్2 ట్యాబ్‌ను లూనా గ్రే కలర్ ఆప్షన్‌లో మాత్రమే లాంచ్ చేశారు. ఈ ట్యాబ్ ధర రూ.39,999 ఉండగా దీన్ని అన్ని ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ రిటెయిల్ స్టోర్స్, లెనోవో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో మే 1 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ట్యాబ్‌పై రూ.3వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. 'యాప్'తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!
- ●Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో 8-4-3 రూల్.. ఏంటిది.. దీంతో భారీ కార్పస్ ఎలా సాధ్యమవుతుంది..?
- ●Karne Prabhakar | ఏకపక్ష నిర్ణయం.. రేవంత్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం : మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
- ●KTR Challenges Revanth Reddy | బాహుబలిలో భల్లాల దేవుడి గతే రేవంత్‌కి పడుతుంది..!
- ●India EV | జూన్‌లో ఈవీ ద్విచక్ర వాహనాల దూకుడు.. రోజుకు 6 వేలకుపైగా అమ్మకాలు..

Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. 'యాప్'తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!

Rythu Bharosa | కొనసాగుతున్న రైతు భరోసా నిధుల విడుదల.. నేడు 3 ఎకరాల్లోపు రైతులకు

Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో 8-4-3 రూల్.. ఏంటిది.. దీంతో భారీ కార్పస్ ఎలా సాధ్యమవుతుంది..?

Karne Prabhakar | ఏకపక్ష నిర్ణయం.. రేవంత్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం : మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్






