Protest | ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు.. జంతర్ మంతర్‌లో దళిత క్రైస్తవుల ధర్నా..
Protest | దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.
Protest | దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకపోవడంతో విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేశామని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాడుతుందని చెప్పారు.
బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితులపై వివక్ష మారదన్నారు. కారంచేడు, చుండూరు ఘటనల్లో బాధితులు మతం మారిన దళితులేనని గుర్తుచేశారు. బీసీలు, ఎస్టీలకు మతమార్పిడి అనంతరం కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతున్నప్పుడు దళిత క్రైస్తవులకు మాత్రమే ఆ అవకాశం లేకుండా చేయడం వివక్షేనన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు అశాస్త్రీయమైనవని, రాజ్యాంగంలోని సమానత్వం, మత స్వేచ్ఛ హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ మాట్లాడుతూ.. 1950 ఆగస్టు 10న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడినందున ఆ రోజును బ్లాక్‌డేగా పాటిస్తున్నామని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మతం మారినా కులం మారదని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల వారు మరింత వెనుకబడుతున్నారని అన్నారు.
1950 నాటి షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వుల్లోని పేరా-3 ద్వారా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను ఆచరించే దళితులకే ఎస్సీ హోదాను పరిమితం చేశారని రాజీవ్‌సాగర్ తెలిపారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికలు కూడా మతం మారినా దళితుల సామాజిక స్థితి, వివక్షలో మార్పు ఉండదని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ హోదా కల్పించే వరకు ఉద్యమం కొనసాగుతుందని, ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ, ముస్లిం మతాలు స్వీకరించిన దళితులకు మాత్రమే రిజర్వేషన్లు లేకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. క్రైస్తవ సేవా సమితి అధ్యక్షుడు గడ్డం సాల్మోన్‌రాజు, ఆల్ ఇండియా దళిత క్రిస్ట్ రైట్స్ సమితి అధ్యక్షుడు సంగటి మనోహర్, దళిత క్రిస్టియన్ ఫోరం చిన్న జోసెఫ్, రావులపాటి మోసెస్, మానిక్యాల ఎలియా, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ఇస్లాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rgv | టాలీవుడ్ హీరోతో ఆర్జీవీ బాలీవుడ్ మూవీ - ఎన్నాళ్లకెన్నాళ్లకు?
- ●Bigg Boss Thanuja | కుకు విత్ జాతిరత్నాలు విన్నర్‌గా తనూజ - ప్రైజ్‌మనీ ఎంతంటే?
- ●Malaysia Telangana Association | ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి: మలేషియాలో మార్మోగిన 'బోనాలు 2026' సంబురాలు
- ●సాగర్ తీరాన 'వరుణ' వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!
- ●PRLIS | పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గం : నిరంజన్‌రెడ్డి
- ●Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు

Rgv | టాలీవుడ్ హీరోతో ఆర్జీవీ బాలీవుడ్ మూవీ - ఎన్నాళ్లకెన్నాళ్లకు?

Bigg Boss Thanuja | కుకు విత్ జాతిరత్నాలు విన్నర్‌గా తనూజ - ప్రైజ్‌మనీ ఎంతంటే?

Malaysia Telangana Association | ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి: మలేషియాలో మార్మోగిన 'బోనాలు 2026' సంబురాలు

సాగర్ తీరాన 'వరుణ' వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!





