త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సాగర్ తీరాన ‘వరుణ’ వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!

తెలంగాణ రాజకీయం ఎప్పుడు ఏ మోడ్ లోకి వెళ్తుందో ఊహించడం కష్టం. కృష్ణా నదీ తీరాన, 108 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన 'మహా వరుణ యాగం' కేవలం వర్షాల కోసం చేసిన పూజ మాత్రమే కాదు! వర్షాభావ పరిస్థితులు, ప్రతిపక్షాల వరుస విమర్శల నడుమ రేవంత్ వేసిన ఈ 'యాగం అస్త్రం' పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆధ్యాత్మికత ముసుగులో విపక్షాల దాడిని నిరోధిస్తూ, గ్రామీణ రైతాంగంలో భరోసా నింపేందుకు పక్కాగా రచింపబడిన వ్యూహాత్మక పొలిటికల్ అల్గోరిథం ఇది!

S

News | Published On Aug 10, 2026, 7.06 pm IST

సాగర్ తీరాన ‘వరుణ’ వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!

సంక్షిప్త సారాంశం

వర్షాభావంతో ఉన్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక బాట పట్టింది. గతంలో కేసీఆర్‌కు మాత్రమే సొంతమని భావించిన 'యాగాల ఇమేజ్'‌కు నాగార్జునసాగర్ వేదికగా రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యూహంతో BRS, బీజేపీలు యాగాన్ని విమర్శించలేక, అలాగని కాంగ్రెస్‌కు దక్కే మైలేజ్‌ను అడ్డుకోలేక తీవ్ర ధర్మసంకటంలో పడిపోయాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై ఉండే "హిందుత్వ వ్యతిరేక పార్టీ" అనే ముద్రను చెరిపేస్తూ, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను చాటడానికే ఈ 'వరుణ వ్యూహం' రూపుదిద్దుకుంది!

Advertisement

                  కృష్ణమ్మ ఒడ్డున కౌంటర్ పాలిటిక్స్: రేవంత్ 'యాగం' వెనుక అసలు స్క్రీన్‌ప్లే ఇదే!

 రాజకీయాల్లో ఏం చేసినా దానికో వ్యూహం  ఉంటుంది. రాజకీయ నాయకులు ఏం మాట్లాడిన దానికి మరో అర్థం కూడా ఉంటుంది. ఇప్పుడు అదే ఈ కథనంలో చర్చించనున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మార్కు రాజకీయాలనుఈ కథనంలో విశ్లేషించుకోబోతున్నాం. నాగార్జునసాగర్ తీరాన, 108 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణలు, 11 హోమ గుండాల ధూపదీపాల మధ్య ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా నిర్వహించిన 'మహా వరుణ యాగం' కేవలం వర్షాల కోసం చేసిన పూజ మాత్రమే కాదు, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొనే క్రమంలో వేసిన ఒక కీలక రాజకీయ అడుగు! పాలనాపరమైన ఒత్తిడులు, వర్షాభావ పరిస్థితుల నడుమ సాగర్ జలాల సాక్షిగా రేవంత్ ఎంచుకున్న ఈ 'ఆధ్యాత్మిక మార్గం' వెనుక ఉన్న అసలు పొలిటికల్ అల్గోరిథం, ఆయన అనుసరించిన పొలిటికల్ స్ట్రాటజీల విశ్లేషణ ఇదిగో!

రైతు సెంటిమెంట్... భరోసా నింపే ప్రయత్నంలో భాగమే!

వర్షాలు లేక పంటలు ఎండిపోతాయేమోనన్న భయంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన చెలరేగుతున్న వేళ, ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీలు రైతు భరోసా, రుణమాఫీ అంశాలపై నిప్పులు చెరుగుతున్నాయి. ఈ తరుణంలో కేవలం ప్రభుత్వ యంత్రాంగానికే పరిమితం కాకుండా, దైవచింతనతో ప్రకృతిని ప్రసన్నం చేసుకునేందుకు స్వయంగా పీఠమెక్కడం ద్వారా... "మీ కష్టాల్లో మేమున్నాం, ప్రతి మార్గాన్నీ తొక్కుతున్నాం" అనే భావనను రైతాంగంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే ఈ యాగం! రైతుల్లో ఉన్న నైరాశ్యాన్ని తొలగించి, ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవడానికి రేవంత్ ఈ సెంటిమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారు.

యాగంతో 'కేసీఆర్ మార్క్'కి కౌంటర్ ఇచ్చే దిశగా!

తెలంగాణ పొలిటికల్ హిస్టరీలో 'యాగాలు - క్రతువులు' అంటే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరే ట్రేడ్‌మార్క్‌గా ఉండేది. ఆ  ఆధ్యాత్మిక కోణంలో కేసీఆర్‌కు ఉన్న ప్రత్యేకమైన ఇమేజ్‌కి చెక్ పెట్టేందుకు, నాగార్జునసాగర్ వేదికగా 'మహా వరుణ యాగం' చేపట్టి తనదైన శైలిలో సమాధానమిచ్చే దిశగా రేవంత్ అడుగులు వేశారు. గతంలో కాంగ్రెస్‌పై పడిన ముద్రను చెరిపేస్తూ, "యాగాలు కేవలం ఒకరి సొత్తు కావు, ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి నాయకుడి హక్కు" అని ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌కి ఉన్న ఆధ్యాత్మిక ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టి, ఆధిపత్యం తట్టుకునేందుకు రేవంత్ ఎంచుకున్న పొలిటికల్ స్ట్రాటజీ ఇది!

అపోజిషన్‌కి 'సైలెంట్ మైండ్ గేమ్'!

రేవంత్ ఎంచుకున్న ఈ ఆధ్యాత్మిక మార్గం ద్వారా ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బీజేపీలను 'కక్కలేక, మింగలేక' ఉండేలా ఒక ధర్మసంకటంలోకి నెట్టడం కూడా ఈ రాజకీయ వ్యూహంలో భాగమే! ఒకవేళ ఈ యాగాన్ని మూఢనమ్మకమని విమర్శిస్తే... "వీరికి హిందూ సంప్రదాయాలపై, రైతుల ప్రయోజనాలపై నమ్మకం లేదు" అని కార్నర్ చేసే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తుంది; విమర్శించకపోతే ఈ వ్యవహారం ద్వారా లభించే మైలేజ్ అంతా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుంది. ఒకవేళ ప్రకృతి అనుకూలించి రాబోయే రోజుల్లో వర్షాలు పడితే, ఆ క్రెడిట్‌ను స్వీకరించడానికి కాంగ్రెస్ ముందే సిద్ధమైంది. ప్రత్యర్థులను డిఫెన్సివ్ మోడ్‌లోకి నెట్టే ఉద్దేశంతో వేసిన మాస్టర్‌ప్లాన్ ఇది!

'సాఫ్ట్ హిందూత్వ' గేర్... కాంగ్రెస్ ఇమేజ్ మేక్ఓవర్!

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ "హిందుత్వ వ్యతిరేక పార్టీ" అంటూ బీజేపీ వేసే ప్రధాన ముద్రకు కౌంటర్ ఇచ్చే దిశగా తెలంగాణ నేల నుండి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పండితుల నేతృత్వంలో వేదోక్తంగా పూజలు జరిపి, మెజవరిటీ హిందూ ఓటు బ్యాంకుకు ఒక సానుకూల సందేశాన్ని పంపే దిశగా అడుగులేశారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న వేళ, "మేము సంప్రదాయాలను గౌరవించే నాయకులే" అని చాటుకుంటూ, సాఫ్ట్ హిందూత్వ కార్డ్‌ను రేవంత్ నెమ్మదిగా, వ్యూహాత్మకంగా ప్లే చేయడానికి సిద్ధపడ్డారు.

సాగర్ సాక్షిగా... వాటర్ పాలిటిక్స్ పంచ్!

ఈ క్రతువు కోసం హైదరాబాద్ దాటి నాగార్జునసాగర్ విజయ్ విహార్ ప్రాంగణాన్ని వేదికగా ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా ఉండే అంశమే. సరిగ్గా నాగార్జునసాగర్ వద్ద నిలబడి, కృష్ణా-గోదావరి నదులు జలకళతో తొలకరి పలకాలని రేవంత్ సంకల్పం చెప్పుకోవడం ద్వారా... ఉమ్మడి నల్లగొండతో పాటు దక్షిణ తెలంగాణ రైతాంగానికి "మీ నీటి హక్కులను కాపాడే విషయంలో మేము వెనకడుగు వేయం" అనే సందేశాన్ని స్పష్టంగా పంపే ప్రయత్నం చేశారు.

మొత్తానికి నాగార్జునసాగర్ తీరాన రేవంత్ రెడ్డి నడిపిన ఈ 'మహా వరుణ యాగం' కేవలం యజ్ఞ గుండంలో హవిస్సులు వేసే భక్తి మార్గం మాత్రమే కాదు... రాబోయే పొలిటికల్ తుఫానులను ఎదుర్కొనేందుకు, ప్రతిపక్షాల విమర్శల వేడిని చల్లార్చేందుకు వేసిన ఒక కీలకమైన పొలిటికల్ మైండ్ గేమ్!

Advertisement
Advertisement