Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు
Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా ప్రజల మనసుల నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డిని తీసేయలేరని మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం దుర్మార్గమన్నారు.
- పెద్ది విగ్రహం ఆవిష్కరించి తీరుతాం
- ఈ కుట్రలు చూస్తుంటే పెద్ది మరణంపై కూడా అనుమానం కలుగుతోంది
- మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యలు
Vinod Kumar, Dayakar Rao | త్రినేత్ర.న్యూస్: గద్దెను కూల్చినంత ఈజీగా ప్రజల మనసుల నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డిని తీసేయలేరని మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. విగ్రహ గద్దెను కూల్చిన వారిని రెండు రోజుల్లో శిక్షించకపోతో రాష్ట్రవ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామ గ్రామన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నర్సంపేటలో పెద్ది విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చివేసిన ప్రదేశాన్ని సోమవారం వారు పరిశీలించి మాట్లాడారు.

విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఈ కుట్ర వెనక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా కచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించి తీరుతాం. ఈ కుట్రలు చూస్తుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై కూడా మాకు అనుమానాలు వస్తున్నాయి. తనను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో అర్థం అవుతుంది. విగ్రహం గద్దెను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణం. నర్సంపేట పట్టణంలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారు.? పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం ఉండడం వల్ల తాత్కాలికంగా ఈ ధర్నాను విరామించుకున్నాం. 2 రోజుల సమయం ఇస్తున్నాం. ఆలోపు ఈ విగ్రహ గద్దెను కూల్చిన వారిని శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం అని వినోద్‌కుమార్, దయాకర్‌రావు హెచ్చరించారు.


అంతకుముందు నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో తెలియజేసిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సంబంధిత వార్తలు

Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు
ఆగస్టు 10, 2026

Minister Vakiti Srihari | 4.21 లక్షల మంది మత్స్యకారులకు రూ.5లక్షల ప్రమాద బీమా : మంత్రి వాకిటి శ్రీహరి
ఆగస్టు 10, 2026

KTR | పెద్ది అంతిమయాత్రకు ఓరుగల్లు మొత్తం కదిలింది.. ఆ చివరి ప్రయాణమే ఆయన జీవితానికి అసలైన కొలమానం
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Defence Corridor | హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను ఆమోదించండి.. కేంద్రమంత్రికి జితేందర్‌రెడ్డి రిక్వెస్ట్
- ●Ar Rahman Son | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఆర్ రహమాన్ కొడుకు
- ●Maha Varuna Yagam | వరుణుడి కరుణ కోసం మహా యాగం.. సాగర్ తీరాన అంగరంగ వైభవంగా 'కరీరీ ఇష్టి'.. పూర్ణాహుతిలో సీఎం రేవంత్
- ●Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు
- ●Kiran Abbavaram | ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - పౌరాణిక సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి ఎంట్రీ!
- ●van swept away | నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి

Defence Corridor | హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను ఆమోదించండి.. కేంద్రమంత్రికి జితేందర్‌రెడ్డి రిక్వెస్ట్

Ar Rahman Son | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఆర్ రహమాన్ కొడుకు

Maha Varuna Yagam | వరుణుడి కరుణ కోసం మహా యాగం.. సాగర్ తీరాన అంగరంగ వైభవంగా 'కరీరీ ఇష్టి'.. పూర్ణాహుతిలో సీఎం రేవంత్

Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు



