త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | ప్ర‌త్యేక వెసులుబాటుతో తాడిచ‌ర్ల-2 గ‌నిని సింగ‌రేణికి కేటాయించాం: కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: దక్షిణ భారతదేశానికే తలమానికం, 137 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న సింగరేణి సంస్థకు ఊపిరిపోస్తూ నేరుగా తాడిచర్ల-2 బొగ్గు గనిని కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంద‌ని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖా మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Jul 10, 2026, 12.59 pm IST

Kishan Reddy | ప్ర‌త్యేక వెసులుబాటుతో తాడిచ‌ర్ల-2 గ‌నిని సింగ‌రేణికి కేటాయించాం: కిష‌న్‌రెడ్డి
Advertisement

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: దక్షిణ భారతదేశానికే తలమానికం, 137 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న సింగరేణి సంస్థకు ఊపిరిపోస్తూ నేరుగా తాడిచర్ల-2 బొగ్గు గనిని కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంద‌ని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖా మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. గత కొంతకాలంగా మంచి గ్రేడ్ ఉన్న బొగ్గు గనులు అందుబాటులో లేక, నాణ్యత తగ్గిపోయి, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో నష్టపోయిందన్నారు. కోల్ ఇండియా వంటి ఇతర కంపెనీలతో పోలిస్తే సింగరేణికి నిర్వహణ ఖర్చు కూడా బాగా పెరిగిందని చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

నేడు ప్రత్యక్షంగా 75 వేల మంది కార్మికులకు, పరోక్షంగా మరో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నార‌ని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రజల జీవనాధారంగా ఉన్న సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌న్నారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్న మన సింగరేణి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామ‌ని వివ‌రించారు.

సుప్రీంకోర్టు తీర్పుల వల్ల నేరుగా గనులు కేటాయించడం కష్టమైనప్పటికీ, చట్టంలో ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUs) ఉన్న ప్రత్యేక వెసులుబాటును ఉపయోగించి తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణకే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికే ఎంతో మేలు చేసే నిర్ణయమ‌ని కిష‌న్‌రెడ్డి కొనియాడారు.

Advertisement
Advertisement