త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | ఇన్‌స్టాలో ఇక రీల్స్‌ను పాజ్ చేయ‌డం చాలా ఈజీ.. ఒక్క ట్యాప్ చాలు..

Instagram | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఇటీవ‌లి కాలంలో త‌న యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తోంది. అందులో పంపుకునే డైరెక్ట్ మెసేజ్‌ల‌లో వాయిస్ నోట్స్‌ను కావ‌ల్సిన వాయిస్‌తో ఏఐ ద్వారా మార్చుకునే కొత్త ఫీచ‌ర్‌ను ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్ట‌గా, ఇప్పుడు మ‌రో ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది.

S

Technology | Published On Mar 20, 2026, 5.13 pm IST

Instagram | ఇన్‌స్టాలో ఇక రీల్స్‌ను పాజ్ చేయ‌డం చాలా ఈజీ.. ఒక్క ట్యాప్ చాలు..
Advertisement

Instagram | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఇటీవ‌లి కాలంలో త‌న యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తోంది. అందులో పంపుకునే డైరెక్ట్ మెసేజ్‌ల‌లో వాయిస్ నోట్స్‌ను కావ‌ల్సిన వాయిస్‌తో ఏఐ ద్వారా మార్చుకునే కొత్త ఫీచ‌ర్‌ను ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్ట‌గా, ఇప్పుడు మ‌రో ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ను చూసే స‌మ‌యంలో వీడియోల‌ను పాజ్ చేసేలా స‌రికొత్త‌గా టాప్‌-టు-పాజ్ అనే స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రీల్స్ కు సంబంధించి వీడియో నియంత్ర‌ణ‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ఈ స‌దుపాయాన్ని యూజ‌ర్ల‌కు అందిస్తోంది. ఈ అప్‌డేట్‌ద్వారా యూజ‌ర్లు ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను చూసేట‌ప్పుడు ఏ రీల్‌పై అయినా స‌రే ఒక్క‌సారి సింగిల్ ట్యాప్ చేస్తే చాలు, ఆ రీల్ పాజ్ అవుతుంది. గ‌తంలో వీడియోల‌ను పాజ్ చేసేందుకు వేలితో స్క్రీన్‌పై ప్రెస్ చేసి అలాగే ప‌ట్టుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇక‌పై ఆ ఇబ్బంది లేదు.

సింగిల్ ట్యాప్‌తో పాజ్‌..

ఇన్‌స్టాగ్రామ్ తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఫీచ‌ర్ వ‌ల్ల రీల్స్‌ను యూజ‌ర్లు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా వీక్షించ‌వ‌చ్చు. రీల్ మీద క‌నిపించే సీకింగ్ బార్‌ను ముందుకు, వెన‌క‌కు జ‌రిపి రీల్‌ను కావ‌ల్సిన నిడివి స‌మ‌యం వ‌ద్ద కూడా చూడ‌వ‌చ్చు. ఇక స్క్రీన్‌పై ఒక్క‌సారి సింగిల్ ట్యాప్ చేస్తే రీల్ పాజ్ అవుతుంది. నిరంత‌రం తెర‌పై వేళ్ల‌ను ఉంచి రీల్‌ను పాజ్ చేయాల్సిన ప‌నిలేదు. అలాగే కొత్త‌గా మ్యూట్ ఆప్ష‌న్‌ను ఇచ్చారు. రీల్‌ను పాజ్ చేసిన అనంత‌రం దానిపై మ్యూట్ ఆప్ష‌న్ ద‌ర్శ‌న‌మిస్తుంది. దీంతో సౌడ్‌ను ఆఫ్ చేయ‌వ‌చ్చు. అదేవిధంగా నాచుర‌ల్ నావిగేష‌న్ అనే మ‌రో ఫీచ‌ర్‌ను కూడా ఈ అప్ డేట్‌లో ఇచ్చారు. దీని వ‌ల్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సాధార‌ణ వీడియోల మాదిరిగా మారి ప్లే అవుతాయి. ఇది యూజ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.

యూజ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా..

ఇన్‌స్టాగ్రామ్ త‌న తాజా అప్ డేట్‌లో అందిస్తున్న ఈ ఫీచ‌ర్ల‌ను గ‌త కొద్ది నెల‌లుగా ప‌రీక్షించిన అనంత‌రం ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి తెచ్చింది. యాప్‌లో ట్యాప్ కంట్రోల్స్ స‌రిగ్గా లేవ‌ని యూజ‌ర్ల నుంచి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని ఇన్ స్టాగ్రామ్ ఈ అప్ డేట్‌ను తీసుకువ‌చ్చింది. దీని వల్ల యాప్‌లో యూజ‌ర్ ఎక్స్‌పీరియెన్స్ మ‌రింత మెరుగు ప‌డుతుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. రీల్స్‌లో కొన్నింటిలో వ‌చ్చే చిత్రాలు లేదా టెక్ట్స్‌ను చ‌దివేందుకు స‌మ‌యం అవ‌స‌రం క‌నుక అలాంటి వారికి ఈ అప్ డేట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఈ ఫీచ‌ర్ ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రాగా యూజ‌ర్లు త‌మ యాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్లు యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఈ కొత్త ఫీచ‌ర్ల‌ను ఆటోమేటిగ్గా పొంద‌వ‌చ్చు. అందుకు ఎలాంటి సెట్టింగ్స్ మార్పు చేయాల్సిన ప‌నిలేదు.

Advertisement

తాజావార్తలు

Advertisement