Infinix Note Edge 5G | భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
Infinix Note Edge 5G | మొబైల్స్ తయారీదారు Infinix భారత్‌లో నూతనంగా NOTE Edge 5G పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో ఆ సంస్థ లాంచ్ చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.
Technology | Published On Feb 18, 2026, 12.46 pm IST
Infinix Note Edge 5G | మొబైల్స్ తయారీదారు Infinix భారత్‌లో నూతనంగా NOTE Edge 5G పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో ఆ సంస్థ లాంచ్ చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 90FPS కు సపోర్ట్‌ను అందిస్తుందని, కనుక గేమ్స్‌ను వేగంగా ఆడుకోవచ్చని, ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్ గేమ్ ప్లే ఉంటుందని కంపెనీ తెలిపింది. గేమర్ల కోసం ప్రత్యేకంగా AI Powers Your Play అనే ఫీచర్‌ను అందిస్తన్నట్లు వివరించింది. ఇందులో భాగంగా గేమర్లు పెర్ఫాన్మెన్స్ మోడ్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోగలుగుతారు. మ్యాజిక్ వాయిస్ చేంజర్, నెట్‌వర్క్ ఎన్‌హాన్స్‌మెంట్, బైపాస్ చార్జింగ్ వంటి సదుపాయాలను కూడా ఇందులో అందిస్తున్నారు.
అద్భుతమైన డిస్‌ప్లే..
ఈ ఫోన్ కేవలం 185 గ్రాముల బరువును కలిగి ఉండి 7.2 ఎంఎం మందంతో అత్యంత స్లీక్‌గా ఉంటుంది. 3డి కర్వ్‌డ్ డిజైన్‌ను కలిగి ఉన్నందున ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ఫోన్‌ను లూనార్ టైటానియం, స్టెల్లార్ బ్లూ, సిల్క్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ డిస్‌ప్లే 6.78 ఇంచుల సైజ్ ఉండగా దీనికి 1.5కె రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కనుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ డిస్‌ప్లేకు 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీనికి గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఐపీ65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌ను ఈ ఫోన్‌కు ఇచ్చారు.
భారీ బ్యాటరీ, 3 ఓఎస్ అప్‌డేట్స్..
ఇన్ఫినిక్స్ విడుదల చేసిన నోట్ ఎడ్జ్ 5జి ఫోన్‌లో 6500mAh భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. దీన్ని 2వేల సార్లు పూర్తిగా చార్జింగ్ చేసినప్పటికీ 80 శాతం కెపాసిటీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ సాధారణ యూసేజ్‌కు 6 ఏళ్ల పాటు బ్యాటరీ మన్నికగా ఉంటుందని తెలిపింది. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇస్తున్నందున ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 27 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది. ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. వీటికి ఏఐ ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్ఓఎస్ 16 ఆధారంగా పనిచేస్తుంది. దీనికి 3 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా, ఇందులో డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్ ఉన్నాయి. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.
ధర వివరాలు..
ఇన్పినిక్స్ నోట్ ఎడ్జ్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6GB + 128GB మోడల్ ధర రూ.21,999 ఉండగా, 8GB + 128GB మోడల్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. అలాగే 8GB + 256GB మోడల్ ధర రూ.25,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్‌తోపాటు ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ కార్డులతో రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2వేల వరకు అదనపు రాయితీ లభిస్తుంది.
సంబంధిత వార్తలు

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
- ●Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో 'కోతి పుర్రె'
- ●TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి



