Nothing Store | బెంగళూరులో తొలి నథింగ్ ఫోన్ స్టోర్.. యూజర్లకు అద్భుతమైన సదుపాయాలు..
Nothing Store | ఇంగ్లండ్ కు చెందిన కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీ నథింగ్ భారత్‌లో తన తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ సీఈవో కార్ల్ పెయ్ తో పాటు సహవ్యవస్థాపకుడు, ఇండియా ప్రెసిడెంట్ ఆకిస్ ఎవాంజెలిడిస్ ప్రారంభించారు.
Technology | Published On Feb 15, 2026, 12.46 pm IST
Nothing Store | ఇంగ్లండ్ కు చెందిన కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీ నథింగ్ భారత్‌లో తన తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ సీఈవో కార్ల్ పెయ్ తో పాటు సహవ్యవస్థాపకుడు, ఇండియా ప్రెసిడెంట్ ఆకిస్ ఎవాంజెలిడిస్ ప్రారంభించారు. భారత మార్కెట్‌లో ఫిజికల్ రిటైల్ విస్తరణ దిశగా నథింగ్ కంపెనీ ఈ స్టోర్‌ను ప్రారంభించడం విశేషం. ఇక ఈ స్టోర్ ప్రారంభం ద్వారా భారత వినియోగదారులతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడమే లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది. డిజిటల్ అమ్మకాలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న వ్యూహంలో భాగంగానే ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.
నిర్మాణమే ప్రధాన ఆకర్షణ..
సుమారు 5,032 చదరపు అడుగుల విస్తీర్ణంలో నథింగ్ తన స్టోర్‌ను ఏర్పాటు చేసింది. 1970ల కాలంనాటి అసెంబ్లీ లైన్లు, వర్క్‌షాప్‌ల నుంచి ప్రేరణ పొందిన రెట్రో-ఫ్యూచరిస్టిక్ థీమ్‌తో ఇంటీరియర్‌ను రూపొందించారు. కాంక్రీట్, అల్యూమినియం, స్టీల్, గ్లాస్ వంటి పదార్థాలను అలంకరణ లేకుండా ఉపయోగించడం ద్వారా, నిర్మాణమే ప్రధాన ఆకర్షణగా నిలిచేలా డిజైన్ చేశారు. ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను సాధారణ రిటైల్ అవుట్‌లెట్‌గా కాకుండా, ఒక ఇమర్సివ్ హబ్ గా తీర్చిదిద్దారు. నథింగ్, సీఎంఎఫ్ (CMF) బ్రాండ్లకు చెందిన పూర్తి ఉత్పత్తులతోపాటు అధికారిక అపారెల్, మెర్చండైజ్ కూడా ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

క్రియేటర్లకు ప్రత్యేకంగా స్టూడియో..
స్టోర్‌లో ప్రత్యేకంగా క్రియేటర్ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఇక్కడ కంటెంట్ క్రియేటర్లు అన్‌బాక్సింగ్ వీడియోలు, హ్యాండ్స్-ఆన్ కంటెంట్ చిత్రీకరించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్లా మెషీన్లు, వెండింగ్ మెషీన్లు, కన్వేయర్ బెల్ట్ ఆధారిత ప్రొడక్ట్ డిస్‌ప్లేలు వంటి గేమిఫైడ్ ఎలిమెంట్స్ వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ఈ స్టోర్‌లో మాత్రమే లభించే ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన నథింగ్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అలాగే కమ్యూనిటీ జోన్‌ను ఏర్పాటు చేసి ఈవెంట్లు, సమావేశాల కోసం వేదికగా మార్చారు. సందర్శకులకు ఉచిత పానీయాలు, స్నాక్స్ అందించనున్నారు.
బెంగళూరులో ఎక్కడంటే..?
కాగా నథింగ్ స్టోర్‌ను ముందుగా లండన్‌లోని సోహో ప్రాంతంలో ఏర్పాటు చేయగా, బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ తాజా స్టోర్ కంపెనీకి రెండోది కావడం విశేషం. త్వరలో న్యూయార్క్, టోక్యో నగరాల్లో కూడా స్టోర్లు ప్రారంభించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం గత 8 త్రైమాసికాల్లో 7 సార్లు నథింగ్ భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఇక బెంగళూరులో ప్రస్తుతం నథింగ్ స్టోర్‌ను అక్కడి ఇందిరానగర్‌లో ప్రారంభించగా, రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. యూజర్లు స్టోర్‌లో నథింగ్ ఫోన్లను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరం అనుకుంటే కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్‌షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



